
పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత
బోథ్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు పశువులను తరలిస్తున్న లారీని గురువారం సోనాల మండలంలోని ఘన్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు ఘన్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న లారీని ఆపి పరిశీలించగా అందులో పశువులు కనిపించాయి. లారీలో 26 పశువులు ఉండగా రెండు మృతి చెంది ఉన్నాయి. వాహనాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న పశువులను బజార్‌హత్నూర్‌లోని గోశాలకు తరలించినట్లు ఎస్సై శ్రీసాయి పేర్కొన్నారు. లారీ ఓనర్‌తో పాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత