
సంస్కృతిని భావితరాలకు అందించాలి
ఇంద్రవెల్లి: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. మండలంలోని గౌరాపూర్‌లో శుక్రవారం ఘనంగా దండారీ ఉత్సవాలు నిర్వహించారు. ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడి నృత్యాలతో వారికి స్వా గతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీలు దండారీ ఉత్సవాలు నిర్వహించుకో వడం ఆనవా యితీ అని అన్నారు. పండుగను ప్రతి ఒక్కరూ ప్ర శాంత వాతావరణంలో నిర్వహించుకో వాలన్నారు. ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న, గ్రామ పెద్దలు మడావి మారుతి పటేల్, భూమేశ్, బొజ్జు, సోము, అంకూస్, తదితరులున్నారు.
మన్కాపూర్‌లో..
గుడిహత్నూర్: మండలంలోని మన్కాపూర్ గ్రా మంలో శుక్రవారం నిర్వహించిన దండారీ ఉత్సవా ల్లో ఎస్పీ హాజరై మాట్లాడారు. గ్రామ పటేళ్ల ఆధ్వర్యంలో పండుగ నిర్వహించడం, ఒక గ్రామానికి మరో గ్రామం ఆతిథ్యం ఇవ్వడం అనేది ఒకరికి ఒక రు ప్రేమను పంచుకోవడమే అన్నారు. ఇందులో ఏఎస్పీ కాజల్‌సింగ్, సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతిని భావితరాలకు అందించాలి