
‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం
అక్షర సత్యాలను ప్రజల ముందు ఉంచుతున్న ‘సాక్షి’పై కక్ష గట్టి కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని పలు వర్గాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. జిల్లాలోని పలువురు జర్నలిస్టులు, విద్యార్థి సంఘ నాయకులు, న్యాయవాదులు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఇలా.. – ఆదిలాబాద్‌టౌన్/కై లాస్‌నగర్
ఏపీ ప్రభుత్వ తీరును
ఖండిస్తున్నాం..
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా అ క్కడి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సాక్షి ఎడిటర్ ధనంజయ్‌ను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఈ చర్యను ఖండిస్తున్నాం. అలాగే సాక్షి జర్నలిస్టులపై కేసులు అప్రజాస్వామికం. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.
– సూది నరేష్, బోథ్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు
కేసుల నమోదు సరికాదు
రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలను ప్రజల్లో తీసుకెళ్తే జర్నలి స్టులపై కేసులు పెట్ట డం సరికాదు. సాక్షి ఎడిటర్‌పై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖండించాలి. అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్లాలి. కానీ దాడులకు పాల్పడడం అప్రజాస్వామికం. అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదు.
– షేక్ మోయిజ్,
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
భావ ప్రకటన స్వేచ్ఛను
హరించడమే..
పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతో సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడం సరికాదు. అక్రమ కేసులతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికం. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమే.
– గెడం కేశవ్, ఏఐఎస్‌ఎఫ్, జిల్లా కార్యదర్శి
ప్రజాస్వామికవాదులు
స్పందించాలి
ప్రశ్నించే గొంతుకలపై ముఖ్యంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయ్‌రెడ్డిపై ఏపీ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయ డం దుర్మార్గం. ఇది మీడి యా స్వేచ్ఛను హరించడమే. ఇది ఒక ‘సాక్షి’ పత్రిక సమస్య కాదు. పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులంతా స్పందించాల్సిన అవసరం ఉంది.
– బొల్లారం సుధీర్, న్యాయవాది
పత్రికల గొంతు
నొక్కడం సరికాదు..
సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డిపై ఏపీ పోలీ సులు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరి కాదు. సమాజంలో జరుగుతున్న అంశాలను బయటకు తీసే స్వేచ్ఛ పత్రికలకు ఉంటుంది. దాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పోలీసులతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. పత్రికల గొంతు నొక్కే తీరును మార్చుకోవాలి.
– సామ రూపేశ్‌రెడ్డి, కాంగ్రెస్
అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు
మీడియాపై దాడి సరికాదు
ప్రభుత్వం అవలంభిస్తు న్న అసంబద్ధ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే స్వేచ్ఛ పత్రికలకు ఉంటుంది. తమకు వ్యతి రేకంగా వార్తలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కక్ష కట్టి సాక్షిపై పోలీసులతో దాడులు చేయించడం విచారకరం. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యంలో సరికాదు. ఏపీ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి. – బాలశంకర్ కృష్ణ,
యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు

‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం

‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం

‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం

‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం

‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం

‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం