
● నత్తనడకన కొరటా– చనాఖ బ్యారేజ్ ● ఇంకా పూర్తి కాని డిస
సాత్నాల: ఆదిలాబాద్ జిల్లాలో దిగువ పెన్‌గంగపై నిర్మిస్తున్న కొరటా– చనాఖ బ్యారేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2016లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరంభించిన ఈ ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తి కావాల్సి ఉంది. తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. బ్యారేజ్ పూర్తయినా ఇంకా కాలువల పనులు మాత్రం పూర్తి కాలేదు. పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో వృథా అవుతున్న వరద నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు రాజకీయ హామీలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, అసంపూర్తి కాలువల కారణంగా జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహంతో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016లో ఈ బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రూ.1200 కోట్లు ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రూ.800 కోట్లు అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇందులో భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీలు, పంప్‌హౌస్ నిర్మాణాలకు నిధులు అవసరం ఉంటాయని అంటున్నారు. ప్రధాన కాలువల నిర్మాణం పూర్తయినప్పటికీ డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పిప్పల్‌కోటి నుంచి భీంపూర్ వరకు 14 గ్రామాల్లో, హత్తిఘాట్ నుంచి బేల వరకు కాలువల నిర్మాణానికి సైతం భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయినట్లు పేర్కొంటున్నా రు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పనులు త్వరి తగతిన పూర్తిచేసి బ్యారేజ్‌ను అందుబాటులోకి తీ సుకురావాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.