
గెలిచిన సంఘాలు విఫలం
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గెలిచిన సంఘాలు విఫలమయ్యాయని సీఐటీయూ కేంద్ర కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గురువారం ఆర్కే 7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, ఇన్వాలిడేషన్ అయిన వారి స్థానంలో డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికుల సమస్యలపై కొట్లాడటానికి వేదికలైన స్ట్రక్చర్ సమావేశాలు బహిష్కరించి ఇక్కడ గనులపై మెమోరాండాలు ఇస్తూ కార్మికులను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూని యన్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ కుమారస్వామి, వెంకట్‌రెడ్డి, సమ్మయ్య, ప్రవీణ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.