
పశువైద్య శిబిరం పరిశీలన
ఇచ్చోడ: మండలంలోని గుబ్బ గ్రామంలో గు రువారం నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని జి ల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు పరి శీలించారు. ఉచిత గాలికుంటు నివారణ టీకా ల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాల ని సూచించారు. పశువైద్య శిబిరాల్లో పశువులన్నింటికీ తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీ కాలు వేయించాలని, ఆధార్ చెవి పోగు కూడా వేయించాలని పేర్కొన్నారు. రైతులు పశుపోషణపైనా దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న దండారీ వేడుకల్లో పాల్గొన్నారు. మండల పశువైద్యాధికారి గోవింద్‌నాయక్, సంధ్య ఉన్నారు.