
గుండాల అటవీప్రాంతంలో దాడులు
ఎఫెక్ట్..
ఇచ్చోడ: ‘అడవి తల్లి కన్నీరు’ శీర్షికన ఈ నెల 14న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అటవీ అధికారులు స్పందించారు. ఇన్‌చార్జి డీఎఫ్‌వో రేవంత్‌చంద్ర ఆదేశాల మేరకు టాస్స్‌ఫోర్స్, స్థానిక అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం మండలంలోని గుండాల అటవీప్రాంతలో సోదాలు నిర్వహించా రు. దట్టమైన అటవీప్రాంతంలో టేకు చెట్లను నరి కిన కొందరు స్మగ్లరు వాటిని సైజులుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేయగా గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. పట్టుకున్న కలప విలువ రూ.90వేల వరకు ఉంటుంది. కాగా, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే స్మగ్లర్లు పరారయ్యారు. పట్టుకున్న కలపను ఇచ్చోడ టింబర్ డిపో కు తరలించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వోలు అమర్‌సింగ్, కవిత, ఎఫ్ బీవోలు సజన్‌లాల్, భీంజీనాయక్, రాకేశ్, స్వాతి, బేస్‌క్యాంప్ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.

గుండాల అటవీప్రాంతంలో దాడులు