క్రాప్‌ బుకింగ్‌ పూర్తయ్యాకే కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

క్రాప్‌ బుకింగ్‌ పూర్తయ్యాకే కొనుగోళ్లు

Oct 17 2025 6:02 AM | Updated on Oct 17 2025 6:02 AM

క్రాప్‌ బుకింగ్‌ పూర్తయ్యాకే కొనుగోళ్లు

క్రాప్‌ బుకింగ్‌ పూర్తయ్యాకే కొనుగోళ్లు

● సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు ● కలెక్టర్‌ రాజర్షి షా ● కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై సమీక్ష ● కిసాన్‌ యాప్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

కైలాస్‌నగర్‌: జిల్లాలో డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ 85 శా తం పూర్తయిందని, వందశాతం పూర్తయ్యాక రైతు ల సమాచారమంతా కపాస్‌ కిసాన్‌ యాప్‌లోకి వె ళ్లాకే పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని కలెక్టర్‌ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూ ర్తికానుందని తెలిపారు. పత్తి కొనుగోళ్లపై గురువా రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిఽధులు, వ్యాపారులు, వ్యవసాయ, మార్కెటింగ్‌, పోలీస్‌, ఫైర్‌, లీగల్‌ మెట్రాలజీ శాఖ ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత ఆయా వర్గాల నుంచి అభిప్రాయలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నెట్‌వర్క్‌ సమస్య కలిగిన ఆవాస ప్రాంతాలను పెన్షన్‌ పంపిణీలో తలెత్తిన ఇబ్బందు ల ఆధారంగా గుర్తించి వాటి వివరాలు సేకరించా మని, ఈ ప్రాంతాల్లో ఏఈవోల ద్వారా స్లాట్‌బుకింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నెట్‌వర్క్‌ కలిగిన ప్రాంతాల్లో రైతులకు సహకరిస్తూ స్లాట్‌ బుకింగ్‌ చేసేందుకు ఆసక్తి గల యువతను గుర్తించి వారి సెల్‌ నంబర్లనూ తీసుకున్నామని పేర్కొన్నారు. అక్కడ నెట్‌వర్క్‌ ఉంటుందా? లేదా? అనే వివరాలు కూడా సేకరించామని తెలిపారు. యువత, ఏఈవోలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కౌలు రైతులు మాత్రం రిజిస్ట్రేషన్‌తో పాటు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తేమశాతంపై ఇబ్బందులు తలెత్తకుండా కాటన్‌ పర్చేజింగ్‌ ఆఫీసర్లు (సీపీవోలు), ఐకేపీ సి బ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆది లాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కంట్రోల్‌ రూంలు ఏర్పా టు చేస్తామని కలెక్టర్‌ చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా షామియానాలు, కుర్చీలు, తాగునీ టి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు తలెత్తకుండా తహసీల్దార్‌, ఎస్‌హెచ్‌వో, ఇద్దరు రైతులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వారు జిన్నింగ్‌లు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి వసతులు పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం కిసాన్‌ యాప్‌ ప్ర చార పోస్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌, ట్రైనీ కలెక్టర్‌ సలోని, అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామలాదేవి, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, అనిల్‌ జాదవ్‌, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంఽథాలయ సంస్ధ చైర్మన్‌ నర్సయ్య, మార్కెటింగ్‌ ఏడీ గజానంద్‌, ఆర్డీవో స్రవంతి, వ్యవసాయ శాఖ టెక్నికల్‌ అధికారి కే శివకుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.

పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు

ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ.. మార్కెట్‌యార్డులో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పోలీస్‌ పికె టింగ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతీ జిన్నింగ్‌ మిల్లులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల ని, తహసీల్దార్‌, సెక్రటరీ, ఎస్‌హెచ్‌వో, రైతులతో కూడిన మానిటరింగ్‌ కమిటీలకు పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైతులకు ఎ లాంటి ఇబ్బంది కలిగించవద్దని, కొనుగోళ్లలో ఎ లాంటి అవకతవకలు జరిగినా వెంటనే ఫిర్యాదు చే స్తే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement