
‘మధ్యాహ్న’ కార్మికుల సమ్మె
కై లాస్‌నగర్: పెండింగ్ వేతనాలు,బిల్లులు విడు దల చేయాలనే డిమాండ్‌తో ఏఐటీయుసీ అ నుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. సోమవారం విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటా ల రాములు మాట్లాడుతూ.. ఏడాదిగా మధ్యా హ్న భోజన పథకానికి సంబంధించిన బి ల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వేతనాలు కూడా ఆరు నెలలుగా అందడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వంట చేయడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘ నాయకులు శ్రీదేవి, రాంబాయి, పు ష్పలత, సంతోష్, నాందేవ్, లక్ష్మి పాల్గొన్నారు.