
ఎఫెక్ట్..
ఆ ఉపాధ్యాయుల వివరాలు పంపండి..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఆయా పాఠశాలలకు కేటాయించిన ఉపాధ్యాయులు విధుల్లో చేరడం లేదని సోమవారం ‘‘సర్దుబాటు’ ఆదేశాలు బేఖాతరు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన డీఈవో శ్రీనివాస్‌రెడ్డి సర్దుబాటు ప్రక్రియలో భాగంగా కేటాయించిన కొత్త పాఠశాలలకు చేరని టీచర్ల వివరాలు వెంటనే పంపించాలని ఎంఈవోలు, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల ఆధారంగా వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.