
కార్గో ద్వారా రాఖీల బుకింగ్
ఆదిలాబాద్: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో అన్నదమ్ములకు రాఖీలు పంపాలనుకునే సోదరీమణుల కోసం ఆర్టీసీ కార్గో కౌంటర్లను ప్రారంభించినట్లు ఆదిలాబాద్ డిపో మేనేజర్ ప్రతి మారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రం లోని బస్టాండ్‌లో కార్గో బుకింగ్‌కౌంటర్ ప్రారంభించారు. రీజియన్ పరిధిలో 29 కౌంటర్లలో రాఖీలు బుక్ చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ పీఎస్ రెడ్డి, రీజనల్ మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్ సాయన్న,అన్సార్ తదితరులున్నారు.