
వినతుల వెల్లువ
● పింఛన్, ‘ఇందిరమ్మ’ అర్జీలే అధికం
● ప్రజావాణికి 112 దరఖాస్తులు
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 112 అర్జీలు అందాయి. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వే ఉన్నాయి. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..
అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి
ప్రజావాణికి కలెక్టర్ ఉదయం 10.30 గంటలకే హాజరయ్యారు. అర్జీలకు సంబంధించి ఆయా శాఖ ల అధికారులను పిలువగా అందుబాటులో లేకపోవడంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ అధికారులెక్కడ అంటూ అక్కడే ఉన్న జిల్లా అధి కారుల సంఘం అధ్యక్షుడు మనోహర్‌ను ప్రశ్నించారు. వచ్చేవారం నుంచి సకాలంలో హాజరయ్యేలా చూస్తామని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు హుటాహుటిన హాజరయ్యారు. అయితే చాలామంది 11.30గంట ల సమయంలో గ్రీవెన్స్‌కు రావడం కనిపించింది.