
టీచర్ల తీరు మారలే!
● ఫేషియల్ అటెండెన్స్ వచ్చినా అదే పరిస్థితి ● సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది తీ రు మాత్రం మారడం లేదు. ఇదివరకు బయోమెట్రి క్ ఉండగా కొందరు సమయపాలన పాటించారు. మరికొంత మంది వివిధ సాకులతో తప్పించుకున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల ఫేషియల్ అటెండెన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. అయినా పలువురు తమ తీరు మార్చుకో వడం లేదని తెలుస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో డీఈవో పరిధిలో 691 పాఠశాలలు ఉండగా, 3,288మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇంకా 230 మంది టీచర్లు యాప్ డౌన్‌లోడ్ చేసుకోకపోవడం గమనా ర్హం. మొదటి రోజు 63 శాతం మంది యాప్ ద్వారా హాజరు వేసుకున్నారు. సోమవారం ఉపాధ్యాయు ల హాజరును రాష్ట్రవిద్యాశాఖ అధికారులు పరిశీ లించారు. ఇందులో పలువురు సమయపాలన పా టించలేదని తెలిసింది. జిల్లాకేంద్రంతో పాటు మా రుమూల మండలాల్లో ఉపాధ్యాయులు పాఠశాల కు ఉదయం 9.30 తర్వాత వెళ్లగా, మధ్యాహ్నం 3.30 గంటలకే ఇంటి ముఖం పట్టినట్లు తెలుస్తోంది. మరికొంత మంది 10గంటలు, 11 గంటలకు, 12గంటలు,ఒంటి గంటవరకు వెళ్లగా..మధ్యాహ్నం 3 గంటలు, 3.45 గంటలలోపే యాప్‌లో అటెండెన్స్ నమోదు చేసి ఇంటి ముఖం పట్టారని తెలు స్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆ రిపోర్టు ను పంపించగా అందులో పలువురి సమయపాలన వివరాలు ఇలా నమోదయ్యాయి. తిప్ప పాఠశాలకు చెందిన టీచర్ మధ్యాహ్నం 3.45 గంటలకు, అంకో లి ఉపాధ్యాయుడు ఉదయం 10.12 గంటలకు, రాంపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు 10గంటలకు, చాందాకు చెందిన ఉపాధ్యాయుడు మధ్యాహ్నం 1.31 గంటలకు, యాపల్‌గూడకు చెందిన ఉపాధ్యాయుడు 11.06 గంటలకు, కచ్‌కంటికి చెందిన టీచర్ మధ్యాహ్నం2.53గంటలకు, ఖిల్లాకు చెందిన టీచర్ మధ్యాహ్నం 1.37 గంటలకు, కేజీబీవీ మావలకు చెందిన సీఆర్టీలు ముగ్గురు 11.45, మరొకరు 12 గంటలకు, సరస్వతీనగర్‌కు చెందిన టీచర్ మధ్యాహ్నం1.05గంటలకు ఫేషియల్ అటెండెన్స్‌లో న మోదు చేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు సమయపాలన పాటించలేదని తెలుస్తోంది. ప్రస్తు తం ట్రయల్‌రన్‌కొనసాగుతుండగా, రెండు మూడు రోజుల తర్వాత ఈ అటెండెన్స్ పకడ్బందీగా అమలు చేయనున్నట్లు రాష్ట్రశాఖ అధికారులు పేర్కొన్నా రు. దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇక నుంచి సమయపాలన పాటించని వారికి హైదరాబాద్ నుంచే మెమోలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అటెండెన్స్ షీట్ విడుదలతో సమయపాలన పాటించని ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది.