breaking news
yugantar
-
బ్రిటిష్ గుండెల్లో 14 ఏళ్ల బుల్లెట్
1931 డిసెంబర్ 14. కమిల్లా జిల్లా కోర్టు. మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ ఎదుట చేతిలో రివాల్వర్‌తో14 ఏళ్ల స్కూల్ అమ్మాయి. తర్వాతి 10 సెకన్లలో పేలిన 5 గుళ్లు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించాయి. ఆ అమ్మాయి పేరు సునీతి చౌదరి. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో యంగెస్ట్ విప్లవకారిణి. చరిత్రలో మూలకు నెట్టివేయబడ్డ అగ్ని జ్వాల. ఆమె సాహసభరిత గాథ ఇది.భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఉరితీతతో దేశమంతా రగిలిపోతున్న కాలమది. ‘ఇంకా ఎంతకాలం ఈ బానిస సంకెళ్లు?’ అని ప్రతి యువకుడు ప్రశ్నిస్తున్న రోజులవి. బెంగాల్‌లోని కమిల్లా అనే చిన్న పట్టణంలో ఒక స్కూల్ అమ్మాయి ఈ ప్రశ్నకు తుపాకీతో జవాబు ఇచ్చింది. వయసు 14. పేరు సునీతి చౌదరి. పాఠాలు చదవాల్సిన వయసులో చరిత్ర రాసింది.బాల్యమే విప్లవ పాఠశాలసునీతి 1917 మే 22న కమిల్లా (నేటి బంగ్లాదేశ్)లో జన్మించింది. తండ్రి ఉమాచరణ్ చౌదరి. ఆమె అన్నయ్యలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ ఉండటం వల్ల ఇంట్లో రోజూ దేశభక్తి, బ్రిటిష్ దౌర్జన్యాల గురించి చర్చ జరిగేది. బెంగాల్ అప్పటికే విప్లవ సంఘాలకు కేంద్రం. స్కూల్లో చదువుతూనే సునీతి రహస్య విప్లవ సభలకు హాజరయ్యేది. ఆమె ప్రాణస్నేహితురాలు 15 ఏళ్ల శాంతి ఘోష్ కూడా సునీతికి తోడైంది. ఇద్దరూ కలిసి ‘మనం ఏదో చేయాలి’ అని ప్రతిజ్ఞ చేశారు. శత్రువును శత్రువు భాషలోనే ఎదుర్కోవాలని భావించిన సునీతి ‘యుగాంతర్’ అనే విప్లవ సంస్థలో చేరింది. అక్కడ కర్రసాము, కత్తిసాముతోపాటు తుపాకీ కాల్చడంలో అసాధారణ శిక్షణ పొందింది. వయసు చిన్నదైనా, ఆమె గురి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు.రెచ్చగొట్టిన కలెక్టర్1931 సెప్టెంబర్‌లో కమిల్లా జిల్లా మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ స్వయంగా సునీతి, శాంతి చదువుతున్న గవర్నమెంట్ హైస్కూల్‌కి వచ్చాడు. అమ్మాయిలను లైన్ లో నిలబెట్టి ‘గాడ్ సేవ్ ది కింగ్’ అని నినదించమన్నాడు. ఒప్పుకోని పిల్లలను చెంపలు వాయించాడు. అతని మీద అప్పటికే అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. ‘పిల్లల మీద చేయి వేసేవాడు మనిషే కాదు’ అని సునీతి, శాంతి డిసైడ్ అయ్యారు. టార్గెట్ ఫిక్స్ అయ్యింది. గర్జించిన గుళ్లు1931 డిసెంబర్ 14. ఉదయం 10 గంటలు. సునీతి, శాంతి ఇద్దరూ స్కూల్ యూనిఫాం, చేతిలో పుస్తకాలు పట్టుకుని కోర్టుకు వచ్చారు. కలెక్టర్ స్టీవెన్స్ కు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినట్టు నటించారు. కలెక్టర్ టేబుల్ దగ్గరికి వెళ్లగానే ఒక్కసారిగా పుస్తకాల్లో దాచిన రివాల్వర్లు బయటికి తీసి ఎడాపెడా 5 గుళ్లు పేల్చారు. స్టీవెన్స్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అందరూ షాక్‌లో ఉండగా ఇద్దరూ పారిపోలేదు. నిలబడి ‘జై హింద్! భారత్ మాతా కీ జై!’ అని నినదించారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.దేశం కోసం చేశాం కోర్టులో జడ్జి అడిగాడు– ‘ఎందుకు చేశారు?’. 14 ఏళ్ల సునీతి తడబడకుండా చెప్పింది– ‘మా దేశం కోసం చేశాం’. ఈ ఒక్క వాక్యంతో బ్రిటిష్ చట్టం కూడా తలవంచింది. చిన్న పిల్లలు కాబట్టి ఉరిశిక్ష వేయలేక పోయారు. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బ్రిటిష్ పత్రికలు ‘Two School Girls Kill DM‘ అని మొదటి పేజీలో రాశాయి. లండన్ వరకు వార్త పాకింది. సునీతిని అలీపూర్ సెంట్రల్ జైలుకు పంపారు.బ్రిటిష్ జైల్లో నరకం..హత్య జరిగిన వెంటనే బ్రిటిష్ సైనికులు సునీతిని, శాంతిని బంధించారు. 14 ఏళ్ల పసిపిల్ల అని కూడా చూడకుండా సునీతిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. విప్లవ సంస్థ రహస్యాలు చెప్పాలంటూ బూట్లతో తన్నారు. కానీ ఆ పసిపెదవుల నుంచి కేవలం ‘వందేమాతరం’ అనే నినాదం తప్ప ఒక్క రహస్యం కూడా బయటకు రాలేదు. ఆమె వయసు చిన్నది కావడం వల్ల ఉరిశిక్ష తప్పి యావజ్జీవం పడింది. జైల్లో ఆమెకు కనీస సదుపాయాలు లేకుండా నరకం చూపించారు. అయినా ఆమె కళ్లలోని ధైర్యం, ముఖంలోని చిరునవ్వు చెదరలేదు. జ్లైలోనే చదువుకుంది. రాజకీయ ఖైదీలతో మాట్లాడి దేశ చరిత్ర, త్యాగాల గురించి ఇంకా తెలుసుకుంది. 1939లో ఆమ్నెస్టీ, గాంధీ జోక్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. అలా ఎనిమిదేళ్ల తర్వాత సునీతి బయటికి వచ్చింది.విడుదలైన తర్వాత విడుదల తర్వాత సునీతి మరో విప్లవ యోధుడు ప్రద్యోత్ కుమార్ గుహను పెళ్లి చేసుకుంది. అతను కూడా జైలుశిక్ష అనుభవించినవాడే. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ సునీతి ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రాలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ‘మేము చేసింది మా కర్తవ్యం’ అని మాత్రమే చెప్పేది. ప్రశాంతంగా కుటుంబంతో జీవితం గడిపి 1988 జనవరి 12న కలకత్తాలో కన్నుమూసింది. ఆమెతో పాటు కాల్పులు జరిపిన శాంతి ఘోష్ తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎం.ఎల్.ఏగా కూడా పని చేసింది. ఇద్దరూ కలిసి ‘కమిల్లా కన్యలు’ (ది గర్ల్స్ ఆఫ్ కమిల్లా) గా చరిత్రలో నిలిచారు. మనం ఇవాళ అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల వెనుక 14 ఏళ్ల వయసులోనే నవ్వుతూ జైలు పాలైన ఇలాంటి పసి హృదయాల రక్తం ఉందనే సత్యాన్ని మనం మరువలేము. వీర విప్లవ కిశోరం సునీతి చౌదరికి జోహార్లు! – కె. -
యుగేందర్‌కు రజతం
ఏఎన్‌యూ (గుంటూరు): జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు ఎస్. యుగేందర్ ఆకట్టుకున్నాడు. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో ట్రయాథ్లాన్ ఈవెంట్లో రజత పతకాన్ని సాధించాడు. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌ను అర్జున అవార్డు గ్రహీత పీటీ ఉష ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అండర్–14 బాలుర ట్రయాథ్లాన్లో రెండో స్థానాన్ని దక్కించుకున్న యుగేందర్ 1739 పాయింట్లను సాధించాడు. ఈ ఈవెంట్లో ఢిల్లీకి శివాంగ్ మీనా 1779 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు. హరియాణాకు చెందిన అజయ్ 1724 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. -
పూరా నిర్లక్యం!
మంజూరైనా మోక్షం లేదు... =మూడేళ్లయినా అమలుకు నోచుకోని పురా ప్రాజెక్ట్ =నేతల మాటలు నీటి మూటలే... =విజయవాడలో ముందడుగు.. ఇక్కడ వెనకడుగు =రూ.168 కోట్లు వదులుకున్నట్లేనా? కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పట్నంలోని సదుపాయాలు.. పల్లెల్లో చూడాలనుకున్న జిల్లా ప్రజల కల నెరవేరేటట్టు లేదు. అధికారుల అలసత్వం.. నేతల నిర్లక్ష్యం.. వెరసి కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపటాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్పె నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పుర’ (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం అమలు మూడేళ్లుగా జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పేరు వినడమే తప్ప.. ఇక్కడి జనం ఆ పథకం అమలు తీరెలా ఉంటుందో ఎరుగరు. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు వరంగల్ జిల్లాతోపాటు విజయవాడ కూడా ఎంపికైంది. అక్కడ పర్యాటక రంగానికి ఈ ప్రాజెక్టులో ప్రాధాన్యమివ్వడంతో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఏ విధంగా చూసినా విజయవాడలో ‘పుర’ అమలు తీరు మన జిల్లా కంటే చాలా రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. ఇందుకు కారణం అక్కడి ప్రజాప్రతినిధుల చొరవే. రూ.168.52 కోట్ల ప్రాజెక్ట్ పుర ప్రాజెక్టు అమలుకు జిల్లాలో పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింతనెక్కొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూరు, పెద్దతండా గ్రామాలు ఎంపిక చేశారు. పథకం అమలు పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం యుగాంతర్, ఎస్వీఈసీ సంస్థలకు టెండర్ల ద్వారా అప్పగించారు. మొత్తం నిధులు రూ.168.52లో కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.123.34కోట్లు(73శాతం వాటా), రాష్ట్ర ప్రభుత్వం రూ.25.80 (15శాతం వాటా), భాగస్వామ్య సంస్థలు రూ.19.38కోట్లు(11శాతం వాటా) చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పదమూడేళ్ల పాటు ప్రాజెక్టు నిర్వాహణ చేయాలి. అందులో మొదటి మూడేళ్లు మౌలిక సదుపాయాల కల్పన చేపడతారు. తరువాత పదేళ్లపాటు నిర్వాహణ బాధ్యతలు చేట్టిన సంస్థలు పనుల పర్యవేక్షణ అమలు చూసుకుంటాయి. అనంతరం ఆ ప్రాంతంలోని స్థానిక సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం అప్పటికి పథకం ఫలాలు సామాన్యులకు అందుతాయి కాబట్టి దానిపై వచ్చే లాభాల నుంచి కొంత మొత్తం పన్నుల రూపంలో పంచాయతీల ఆమోదంతో వసూలు చేసి.. తదుపరి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలన్నది పథకం అసలు ప్రణాళిక. పథకం అమలైతే... వాస్తవ లెక్కల ప్రకారం జిల్లాలో ఈ పథకం ఇప్పటికే ప్రారంభమై మూడేళ్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికీ అతీ..గతీ..లేకపోవడం మన నేతల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. గ్రామాల్లో కూడా మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి, గ్రామాల్లో నిరంతరాయంగా సాగు, తాగునీరు, కూరగాయల పెంపకం, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు, పంటలు తరలించేందుకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి, విద్యుత్ దీపాలు, ఇంటర్నెట్ సదుపాయాలు కలుగుతాయి. పథకం అమలైతే పల్లెలు పట్నం రూపులోకి మారుతాయి. అయితే ఈ పథకంపై ఒకరిద్దరు ప్రజాప్రతినిధులకు తప్ప మిగతావారికి పెద్దగా అవగాహన లేనట్టు తెలుస్తున్నది. ఆర్భాటాలే తప్ప.. ఆచరణ లేదు కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆర్బాటాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో ముందడుగు పడడం లేదు. ఈ సంవత్సరం జూన్ 21న పథకం ప్రారంభించేందుకు రాష్ర్త ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో పాటు మొత్తం సుమారు 30 మంది వరకు ప్లామెంటు సభ్యులు వస్తున్నట్టు అధికారులు చెప్పారు. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, అప్పట్లో ముఖ్యంమంత్రికి వీలుకాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక అక్టోబర్11న జిల్లా మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ రాజయ్య, కలెక్టర్ ప్రత్యేకంగా పుర పథకం అమలుపై సమావేశం నిర్వహించుకున్నారు. త్వరలో ప్రతిపాదనలు ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదు. అంచనాలు పెరిగే అవకాశం మూడేళ్ల క్రితం లెక్కల ప్రకారం పుర ప్రాజెక్టు అమలుకు రూ.168 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పటికీ ప్రారంభంకాని ప్రాజెక్టుకు అప్పటి అంచా వ్యయం సరిపోదు. ఈ లెక్కలు కేంద్రానికి పంపి ఆమో దం పొందినా లెక్కల్లో తేడాల వల్ల మొత్తంగా మరో 30 శాతం ఖర్చు పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన ప్రతిపాదనలు కూడా సాంకేతిక పరంగా రాష్ట్ర స్థాయిలో ఆమోదం పొందే అవకాశం తక్కువని సమాచారం. ఈ విషయంలో నిపుణుల సూచనలు లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పుడు కాకుంటే అంతే సంగతులు... ప్రస్తుతం నేతలు పూనుకుంటే పథకం ఇప్పటికైనా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇక దీని గురించి ప్రజలు మర్చిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కొద్ది రోజుల్లో ఎన్నికల వాతావరణం కమ్ముకుంటుంది. ఈ తరువాత ఎన్నికల కోడ్... తరువాత కొత్త ప్రభుత్వం ఇలా... మళ్లీ మొదటికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాలయలు వచ్చే ఒక ప్రాజెక్టు విషయంలో మన నేతలు ఇప్పటికైనా చొరవ చూపితే కనీసం ప్రాజెక్టు ప్రారంభమైనట్టయినా ఉంటుంది.


