breaking news
yogisvar
-
మూడేళ్ల కష్టం
యోగీశ్వర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పరారి’. ‘రన్ ఫర్ ఫన్’ అనేది ఉపశీర్షిక. సాయి శివాజీ దర్శకత్వం వహించారు. అతిథి హీరోయిన్గా నటించారు. ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జీవీవీ గిరి నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నటుడు సుమన్ విడుదల చేశారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ– ‘‘యోగీశ్వర్ పేరులోనే పవర్ ఉంది. ‘పరారి’ చిన్న సినిమా అనుకోవడానికి వీలు లేకుండా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం తెరకెక్కించారని తెలుస్తోంది’’ అన్నారు.‘‘చిత్ర నిర్మాత గిరి నాకు అభిమాని మాత్రమే కాదు.. నా కుటుంబ సభ్యుడు. అలాంటి అభిమాని ఉండటం నా అదృష్టం. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది’’ అన్నారు సుమన్. ‘‘ఈ కథ వెనక మూడేళ్ల కష్టం ఉంది. మహిత్గారి సంగీతం మా సినిమాకి పెద్ద సపోర్ట్‌గా నిలిచింది’’ అన్నారు సాయి శివాజీ. ‘‘నేను హీరోగా మారడానికి మా నాన్నగారే కారణం. సుమన్గారితో కలిసి నటించడం నా అదృష్టం’’ అన్నారు యోగీశ్వర్. ‘‘సుమన్‌గారు నా అభిమాన హీరో. ‘పరారి’ చూశాక నా కొడుకు యోగీశ్వర్కి అభిమానిగా మారాను’’ అని గిరి అన్నారు. ‘‘చక్రిగారు నాకు అన్నయ్యే కాదు.. గురువు కూడా. ఆయన పేరుని తీసుకొని నేను నా ప్రయాణం మొదలుపెట్టాను’’ అన్నారు మహిత్ నారాయణ్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, నటుడు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
సమీకరణాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ సమీకరణలు జోరుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష జేడీఎస్ నుంచి నిష్ర్కమణలు ప్రారంభమయ్యాయి. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలతో పాటు మైసూరు, ధార్వాడ, చిత్రదుర్గ శాసన మండలి స్థానాలకు ఈ నెల 21, 22 తేదీల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లు అవగాహనకు వచ్చాయి. దీనిపై జేడీఎస్‌లోని సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు దేవెగౌడ వ్యవహార శైలిపై అనేక మంది నాయకులకు ఆగ్రహం ఉన్నప్పటికీ, సందర్భం కోసం ఎదురు చూస్తున్న వారంతా పార్టీని ఫిరాయించడానికి ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు. మాజీ స్పీకర్ కృష్ణ, మాజీ ఎంపీ నారాయణస్వామి కాంగ్రెస్‌లో చేరడం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్టీలో సీనియర్లయిన వీరద్దరినీ దళాధిపతి ఏనాడో పక్కన పెట్టేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్ల కోసం ప్రయత్నించి విఫలమైనప్పటి నుంచీ వీరిద్దరూ అధినేతపై గుర్రుగా ఉన్నారు. ఇక బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శాసన సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీజీపీ శంకర బిదరి సమాజ్ వాదిలో చేరడమే కాకుండా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే సీపీ. యోగీశ్వర్‌ను కాంగ్రెస్‌కు మద్దతునివ్వాల్సిందిగా ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆదేశించారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని చన్నపట్టణ అసెంబ్లీ స్థానానికి యోగీశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత వారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోగీశ్వర్‌ను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించి కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరారు. అయితే తనకు మంత్రి పదవినిస్తే మద్దతునిస్తానని యోగీశ్వర్ షరతు విధించారు. ప్రచార శైలిపై నివేదిక రెండు లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి నివేదికను సమర్పించాల్సిందిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పార్టీ రాష్ట్ర నాయకులను కోరారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న కాంగ్రెస్ ఆరు నూరైనా రెండు స్థానాల్లోనూ గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉంది. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఈసారి ఘోర పరాజయం తప్పదని తాజా సర్వేలు సైతం స్పష్టం చేస్తుండడంతో అధిష్టానం కర్ణాటకపై చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని ఇక్కడ పూడ్చలేక పోయినా, అధికారంలో ఉన్నందున గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోవాలన్నది పార్టీ సంకల్పం. జేడీఎస్ ప్రాబల్యమున్న ఈ రెండు నియోజక వర్గాల్లో పైచేయి సాధిస్తే శ్రేణుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందనే అంచనాతో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది.