breaking news
Xbox
-
తెరపైకి మళ్లీ H-1B వీసా వివాదం!
అమెరికాలో హెచ్1బీ వీసా అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వీసా విధానంపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ భారీ లేఆఫ్ కొత్త వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఎక్స్‌బాక్స్ విభాగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో సంస్థ అమెరికన్ల ఉద్యోగాలను, విదేశీయులతో భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్స్‌బాక్స్ విభాగానికి చెందిన ఉద్యోగులు సుమారు 3,200 మంది ఉన్నారు. గత కొన్నేళ్లుగా గేమింగ్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్స్‌బాక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పునర్వ్యవస్థీకరణ అవసరమని ఉద్యోగులకు వివరించారు.అమెరికన్ ఉద్యోగుల స్థానంలో విదేశీయులా?అయితే.. ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్‌కు ఈ ఏడాది 2,273 హెచ్1బీ వీసా ఉద్యోగుల నియామకాలకు అనుమతి లభించిందనే వార్తలు వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ అమెరికన్ ఉద్యోగులను తొలగించి, తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నారని ఆరోపణలు మరింత బలపడ్డాయి.ఈ అంశంపై అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన రైలీ మూర్ తీవ్రంగా స్పందించారు. పెద్ద టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసి, అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులకు ఇస్తున్నాయని ఆరోపించారు. అందుకే హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌బాక్స్‌లో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత విదేశీ ఉద్యోగుల కోసం వీసాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు.సోషల్ మీడియాలో చర్చసోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అమెరికా ఉద్యోగాలు క్రమంగా విదేశీయులకు వెళ్లిపోతున్నాయని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు.మైక్రోసాఫ్ట్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఉద్యోగుల తొలగింపులు పూర్తిగా వ్యాపార అవసరాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని, హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ లేఆఫ్‌లలో ప్రభావితమయ్యారని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఉద్యోగుల వీసా హోదాతో ఈ నిర్ణయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్! -
ఒక్క కంపెనీ.. 3,200 మంది ‘గేమ్’ ఓవర్!
మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Xbox) తన చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మంది అంటే 3,200 మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో తొలి విడతగా 1,600 మందిని వెంటనే విధుల నుంచి తప్పించగా, మిగిలిన కోతలను 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయనుంది. మైక్రోసాఫ్ట్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఖర్చుల నియంత్రణ, ఏఐ ఆధారిత పెట్టుబడుల పెంపు నేపథ్యంలో ఎక్స్‌బాక్స్‌లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఉద్యోగులకు పంపిన లేఖలో ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ సంస్థ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టంగా స్పందించారు. "ప్రస్తుతం మా వ్యాపారం ఆరోగ్యకరంగా లేదు. ఇతర ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, పబ్లిషింగ్ సంస్థలతో పోలిస్తే మా లాభ మార్జిన్లు 3 నుంచి 10 రెట్లు తక్కువగా ఉన్నాయి" అని పేర్కొన్నారు. గతంలో చేసిన పలు వ్యూహాత్మక పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, గేమింగ్ మార్కెట్లో పెరిగిన పోటీ, హార్డ్‌వేర్ వ్యయాలు పెరగడం సంస్థపై ఒత్తిడి పెంచాయని వివరించారు.నాలుగు గేమింగ్ స్టూడియోల విభజనపునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎక్స్‌బాక్స్‌కు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను కొత్త యాజమాన్యానికి అప్పగించనుంది. అలాగే మరో స్టూడియో భవిష్యత్తుపై కూడా వ్యూహాత్మక సమీక్ష కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ప్రధాన గేమ్ ప్రాజెక్టులను రద్దు చేసే ఉద్దేశం లేదని సంస్థ స్పష్టం చేసింది.నిర్వహణ వ్యవస్థలో భారీ మార్పులుసంస్థలో కొన్ని విభాగాల్లో 14 స్థాయిల మేనేజ్మెంట్ ఉండటంతో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని ఆశా శర్మ పేర్కొన్నారు. అందుకే ఇకపై మేనేజ్మెంట్ పొరలను గరిష్ఠంగా ఐదు స్థాయిలకే పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బాహ్య విక్రేతలపై (Vendor) వ్యయాన్ని 50 శాతం వరకు తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.కొత్త సీఓఓగా హెలెన్ చియాంగ్ఎక్స్బాక్స్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు హెలెన్ చియాంగ్‌ను కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించారు. కంటెంట్, హార్డ్‌వేర్, ప్లాట్‌ఫారమ్, సేవలపై సమగ్ర బాధ్యత ఆమెకు ఉంటుంది. మొజాంగ్ (Minecraft), కింగ్ (Candy Crush) వంటి ప్రధాన స్టూడియోలు కూడా ఇకపై నేరుగా సీఈఓ పరిధిలోకి రానున్నాయి.ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవేనని, అయితే అవి ఉద్యోగుల ప్రతిభను ప్రతిబింబించవని ఆశా శర్మ స్పష్టం చేశారు. "ఎక్స్‌బాక్స్‌ను మరింత దృఢమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికీ పెట్టుబడులు కొనసాగుతాయి. అయితే ఇకపై మరింత క్రమశిక్షణతో, స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తాం" అని ఆమె పేర్కొన్నారు.This is an important email I sent today to all employees at XBOX:Team,We are beginning the most significant restructure in XBOX history. After careful consideration, I've made the difficult decision to reduce our team by approximately 3,200 throughout FY27. This will include…— ASHA (@asha_shar) July 6, 2026 -
మైక్రోసాఫ్ట్ గేమింగ్ కన్సోల్ ఎక్స్‌బాక్స్, ధర ఎంత?
మైక్రోసాఫ్ట్ తన పాపులర్ గేమింగ్ కన్సోల్‌ను మళ్లీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఎక్స్‌బాక్స్ వన్ఎక్స్’ పేరుతో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. దీని ధరను రూ. 44,990 గా నిర్ణయించింది. ఆన్లైన్ రీటైలర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, లాండ్మార్క్ లతో పాటు, 100 గేమింగ్ స్పెషల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది లభ్యం కానుందని సంస్థ తెలిపింది. 1300 వందకు పైగా గేమింగ్ టైటిల్స్‌తో వచ్చిన ఈ డివైస్ పీఎస్4 ప్రో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. శక్తివంతమైన గేమింగ్ సదుపాయంకోసం రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఈ కొత్త గేమింగ్ కన్సోల్ లో 8కోర్ సీపియూ (2.3గిగాహెడ్జ్) కస్టమ్ సీపియూ(1.172గిగాహెడ్జ్) వాడింది. అలాగే దీని గ్రాఫికల్ ప్రాసెసింగ్ పవర్ విడ్త్ 6 టెర్రా ఫ్లాప్స్. ఇంకా 8 జీబీ ర్యామ్, 12జీబీ జీడీఆర్5 వీడియో ర్యామ్ , 326జీబీ /ఎస్ మొమరీ బ్యాండ్‌విడ్త్, 1టీబీ హెచ్డీడీ ఇంటర్నల్ స్టోరేజ్, వైర్లెస్ కంట్రోలర్, హెచ్డీఎంఐ కేబుల్ ఈ డివైస్ స్పెషల్ ఫీచర్లుగా ఉండనున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇండియా కన్స్యూమర్ అండ్ డివైస్ సేల్స్, జనరల్ మేనేజర్ ప్రియదర్శి మొహాపాత్ర మాట్లాడుతూ ప్రపంచంలో మోస్ట్పవర్ఫుల్ కన్సోల్ భారత వినియోగదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. -
మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360 కనుమరుగు!
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్ లో స్థాన బలం సంపాదించేందుకు ఎంతగానో సహకరించిన, అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్ బాక్స్ 360 వీడియో గేమ్ కన్సోల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. 2005 లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటినుంచీ ఈ కన్సోల్ లో 80 మిలియన్ల యూనిట్ల కంటే అధికంగా అమ్ముడయ్యాయి. మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360.. కినెక్ట్ మోషన్ సెన్సింగ్ గేమ్ డివైజ్ ను కూడా పరిచయం చేసింది. 2013 లో ఎక్స్ బాక్స్ వన్ ప్రారంభమయ్యే వరకు ఇది సంస్థ యొక్క ప్రాథమిక గేమింగ్ కన్సోల్ గానే ఉంది. ఎక్స్ బాక్స్ 360 తో పాటు... 'కాల్ ఆఫ్ డ్యూటీ 2' గా పిలిచే యాక్టివిజన్ బ్లిజార్డ్ ఇంక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఇంక్స్ వంటి ఎన్నో ప్రముఖమైన వీడియోగేమ్స్ ప్రారంభించారు. ఇకపై కన్సోల్స్ అమ్మకాలు కొనసాగిస్తూనే, వినియోగదారులకు కంపెనీ మద్దతుగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. సంస్థ యొక్క ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమింగ్ వ్యవస్థ ఎక్స్ బాక్స్ లైవ్ నెట్ వర్క్ మాత్రం ఎక్స్ బాక్స్ 360 కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. పాతతరపు కన్సోళ్ళు ఎక్స్ బాక్స్ 360, సోనీ ప్లే స్టేషన్ 3 వంటి అమ్మకాలను తగ్గించడంతో కస్టమర్లు కంపెనీ అందించే నూతన సంస్కరణలకు మారాలని సూచిస్తోంది. పదేళ్ళకు పైగా వస్తు ఉత్పత్తుల్లో వెనుకంజ వేయకుండా ప్రయాణించిన తమకు... ఓ వస్తువు తయారీ భీతిని కలిగించిందని మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ డివిజన్ అధిపతి ఫిల్ స్పెన్సర్ తెలిపారు. వినియోగదారులు గేమ్స్ ప్లే చేసుకునేందుకు అనువుగా ఉండే ఎక్స్ బాక్స్ 360 ఆధునిక కన్సోల్ ను ఇప్పటికే సంస్థ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బ్యాక్ వార్డ్ కంపాటబిలిటీ సౌకర్యంతో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం వినియోగదారులకోసం 100 వరకూ వీడియో గేమ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు.. ఫిల్ వివరించారు. -
మహిళా డెరైక్టర్ల ఎంపికకు మరింత గడువు
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్‌హోమ్ గేమింగ్ సంస్థ మోజంగ్కు చెందిన మైన్క్రాఫ్ట్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.5 బిలియన్ డాలర్లను(రూ. 15,000 కోట్లు) వెచ్చించనుంది. 2009లో విడుదలైన మైన్‌క్రాఫ్ట్ గేమ్‌ను దీర్ఘకాలంగా కంప్యూటర్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటూనే ఉండటం విశేషం. ఎక్స్‌బాక్స్‌లో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్కాగా, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్, గూగుల్ ఆండ్రాయిడ్‌లోనూ టాప్ యాప్‌గా నిలుస్తోంది. మైన్‌క్రాఫ్ట్ అత్యంత విజయవంత మైన గేమింగ్ ఫ్రాంచైజీ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గేమింగ్ కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలకు తెరలేపనున్నట్లు చెప్పారు. 2014 చివర్లో డీల్ పూర్తికాగలదని అంచనా. కాగా, 2015కల్లా మైన్‌క్రాఫ్ట్ లాభాలు ఆర్జించే స్థితికి(బ్రేక్ ఈవెన్) చేరుతుందని మైక్రోసాఫ్ట్ అంచనా వేస్తోంది.


