breaking news
Wuhan Open semis
-
ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదు : చైనా వైరాలజిస్ట్
న్యూయార్క్: చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకయిందని, దీనిపై మరింత లోతైన విచారణ అవసరమని అమెరికా సహా ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ ల్యాబ్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి, చైనా బ్యాట్‌వుమెన్‌గా ప్రసిద్ధి చెందిన షి ఝెంగ్లి తొలిసారిగా పెదవి విప్పారు. చైనా ప్రభుత్వం ఎప్పట్నుంచో చెబుతున్నట్టుగానే ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదని పేర్కొన్నారు. ఎప్పుడూ మీడియాతో మాట్లాడని ఆమె న్యూయార్క్ టైమ్స్‌కు ఈ మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అవలేదన్నది వాస్తవం. ఈ భూమ్మీద ఆధారాలు లేని విషయానికి ఎవరైనా ఆధారాన్ని ఎలా చూపిస్తారు’’అని ఆమె ప్రశ్నించారు. ‘‘అమాయకులైన శాస్త్రవేత్తలపై ప్రపంచం ఎందుకిలా నిందలు వేస్తోంది’’అని షి ఝెంగ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: చైనాలో మరో విపత్తు! -
సెమీస్‌లో సానియా జోడి
వుహాన్: వరుస విజయాలతో జోరు మీదున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వూహాన్ ఓపెన్ డబ్ల్యుటీఏ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-2తో ఐదోసీడ్ రాక్వెల్ కోప్స్ జోన్స్-అబిగలి స్పీయర్స్ (అమెరికా)పై నెగ్గారు. తొలిరౌండ్లో బై పొందిన భారత్-స్విస్ ద్వయం ప్రిక్వార్టర్స్‌లో 6-3, 6-2తో క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలెండ్)-అనాస్టాసియా రొడినోవా (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.