breaking news
writing competetions
-
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ!
తెలుగు వారి ఉగాది పండుగను విదేశాల్లో ఉన్న భారతీయ తెలుగు ప్రజలు కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని ఈ పండుగ సందర్భంగా భారత్‌లో జరిగినట్లే కవి సమ్మేళనాలు, రచనల పోటీలు వంటి వాటిని విదేశాల్లోని తెలుగు ప్రజల కమ్యూనిటీలు నిర్వహిస్తున్నాయి. పైగా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సగర్వంగా చేసుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాలనే అమెరికాలోని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించి ఉగాది వేడుకులను ఘనంగా చేసుకున్నారు. ఈ మేరకు క్రోధి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ఉగాది ఉత్తమ రచనలు పోటీలు నిర్వహించారు. ఇలా ప్రతి ఏడాది పెట్టడం జరుగుతుంది. ఈసారి జరిగినవి 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీలు. ఈ పోటీల్లో ఉత్మ రచనలుగా ఎంపికయ్యిన వాటి వివరాలను వెల్లడించారు నిర్వాహకులు. ఇక ఈ పోటీల్లో అమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా మొదలైన పలు దేశాల నుంచి భారతీయులు పాలు పంచుకోవడం విశేషం. ఈ పోటీల్లో “నా మొట్టమొదటి కథ”, “నా మొట్టమొదటి కవిత” విభాగాలకు ఎక్కువమంది పోటీపడడ్డారు. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ..అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, ‘మధురవాణి. కామ్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించడం జరుగుతుంది. ఈ పోటీకి ఆర్ధిక సహకారం అందించిన మునుగంటి జితేందర్ రెడ్డి (హ్యూస్టన్)కి అందరి తరఫునా ధన్యవాదాలు అని చెప్పారు. కాగా, ఈ పోటీల్లో ఎంపికైన రచనలు, కవితలు, కథల వారిగా వివరాలు ఇలా..! ఉత్తమ కథానిక విభాగం విజేతలు ‘ఓర్నీ అమ్మ’’- శర్మ దంతుర్తి (Elizabeth Town, OH) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) “అసంకల్పిత ప్రతీకారాలు”- పాణిని జన్నాభట్ల (Boston, MA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) ‘వలస కూలీలు’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL- ప్రశంసా పత్రం ‘వైకుంఠపాళీ’- మధు పెమ్మరాజు (Katy, TX) -ప్రశంసా పత్రం ఉత్తమ కవిత విభాగం విజేతలు “కవిత్వం” - గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) “పశ్ర్న”- శ్రీధర్ బిల్లా, Fremont, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) “ఎంకి నాయుడు బావ”- మణి మల్లవరపు (Vancouver, Canada) ప్రశంసా పత్రం “మొట్టమొదటి రచనా విభాగం” -16వ సారి పోటీ “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు ‘వేలెత్తి చూపిన పిల్లి’ - జీ.కే. సుబ్రహ్మణ్యం ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) ‘రేసు గుర్రం - కోరుకొండ దుర్గాబాయి ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) పల్లెకు పోదాం ఛలో, ఛలో- రాపోలు సీతారామరాజు - ప్రశంసా పత్రం "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు “విరహ ప్రస్థానం”- దాసశ్రీ (దేవేంద్ర దాసరి) పెద్దహరివనం, కర్నూలు ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) “నీవు ఎవరు? కాస వైశ్విక (తిర్మలాపూర్, జగిత్యాల జిల్లా) ($116 నగదు పారితోషికం (ప్రశంసా పత్రం) కాలంతో కరచాలనం రిషిత్ సిరికొండ గొల్లపల్లి, జగిత్యాల జిల్లా (ప్రశంసా పత్రం) తదితర రచనలు, కవితలు,క థలను ఎంపికయ్యాయి. ఇక ఈ పోటీలకు సహకరించిన న్యాయ నిర్ణేతలకి, అలాగే ఇందులో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలని చెప్పారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేసినవారు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు తదితరులు. (చదవండి: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!) -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.. ఉగాది ఉత్తమ రచనల పోటీ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి. ప్రధాన విభాగంలో భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుంచి అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నారు. కథలు, కవితల విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చు. బహుమతిగా 116 డాలర్లు అందిస్తారు. యూనికోడ్ ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించాలి. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. చేతివ్రాతలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదిస్తారు. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు. ఏప్రిల్ 1న విజేతల వివరాలు 2022 ఏప్రిల్ 1న ఉగాది పండుగ రోజు లేదా అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం. 2022 మార్చి 15లోగా ఎంట్రీలు పంపాలి. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణ కి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. ఆసక్తి ఉన్న వారు తమ రచనలను sairacha@gmail.com, vangurifoundation@gmail.com ఈమెయల్ చేయగలరు. -
యూఏఎన్ మూర్తి కథల పోటీలు
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీ జరుగుతోంది. విదేశాలలో ఉన్న తెలుగువారు తమ కథ, కవితలను ఈ పోటీకి పంపించవచ్చు. ప్రవాసులు తమ రచనలను telugusac@yahoo.com కు పరిశీలన కోసం పంపవచ్చు. కవితలు, రచనలు 2021 నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. -
19న జిల్లా స్థాయి హిందీ వ్యాసరచన పోటీలు
తాడిపత్రి టౌన్ : అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 19న హిందీ సేవా సదన్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి హిందీ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు హిందీ సేవా సదన్ కో–అర్టినేటర్, హిందీ ప్రచార సభ రాయలసీమ, కోస్తా జిల్లాల కో–కన్వీనర్ హాజీవలి తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికలకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూనియర్స్ విభాగంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులు, సీనియర్స్ విభాగంలో 9, 10 తరగతుల వారికి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 18లోగా సెల్: 9032323570 నంబర్‌కు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.