breaking news
World Anti Tobacco Day
-
పొగతాగడం మానేస్తే ఎన్ని లాభాలో తెలుసా? దెబ్బకి మానేస్తారు!
పొగాకు వినియోగం అనేక రకాలుగా జరుగుతుంటుంది. ఉదాహరణకు సిగరెట్, బీడీ, చుట్ట, హుక్కా, పైప్, వేపింగ్... ఇలాంటి పొగ పీల్చేవీ; వాటికి తోడు జర్దా, ఖైనీలంటూ ముసుగులో పొగాకు నమిలేవీ ముక్కుతో పీల్చే నశ్యం వంటివి... ఇలా ఎన్నెన్నో రూపాల్లో పొగాకు వినియోగం జరుగుతుంటుంది. వీటితో ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసుకుంటే పొగాకు గురించి తలచుకుందామన్నా భయమేస్తుంది. పొగలో ఉండే విషాలివే... పొలోనియమ్ : రేడియోధార్మిక పదార్థాల్లోని రేడియో యాక్టివ్ మెటీరియల్ క్యాన్సర్‌కు కారణమవుతుందన్న విషయం తెలిసిందే. సిగరెట్ పొగలో ఈ రేడియో ధార్మిక పదార్థం ఉంటుంది. అది క్యాన్సర్ కారకం. బెంజీన్ : మనం రోజూ వాడే పెట్రోలు, గ్యాస్లలోంచి వెలువడే అత్యంత వ్యర్థపదార్థమిది. ఫార్మాల్డిహైడ్ : సిగరెట్ పొగలోని ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని మృతదేహాలను సంరక్షించేందుకు వాడతారు. అనేక జువాలజీ ల్యాబ్‌లలో జీవుల మృతదేహాలను గాజుకుప్పెల్లో భద్రపరిచేందుకు వాడే రసాయన పదార్థం ఫార్మాల్డిహైడ్ ద్రావణమే. వినైల్ క్లోరైడ్ : ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ పదార్థాలు తయారు చేయడానికి వినైల్ క్లోరైడ్ వాడతారు. సిగరెట్ తాగడం అంటే ఈ ప్లాస్టిక్‌ను దేహంలోకి తీసుకోవడమే. ఇది కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే అంశాల్లో ఒకటి. ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయంటే... నోటి ద్వారా పొగపీల్చే ΄ పొగాకుతో నోటి (ఓరల్) క్యాన్సర్లు, గొంతు (ఓరో ల్యారింగ్స్, ఓరో ఫ్యారింగ్స్, హై΄ోఫ్యారింగ్స్) క్యాన్సర్లు, పొగ నేరుగా వెళ్లే ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్లు ప్రధానంగా వచ్చే అవకాశముంది. దీంతో పాటు పరోక్షంగా కడుపు క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లతో పాటు మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ గ్రంథికి వచ్చే క్యాన్సర్లు ముఖ్యం. పొగ కారణంగా వచ్చే క్యాన్సర్లు దేహంలోని ఏ భాగాన్నీ వదిలిపెట్టవంటే అది అతిశయోక్తి కాదు. పొగాకు తెచ్చిపెట్టే మరికొన్ని వ్యాధులు.. ΄ పొగతాగడం కేవలం క్యాన్సర్లనే కాకుండా... చాలా రకాల వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. గుండె΄ోటు, రక్త΄ోటు, పక్షవాతంతో ΄ాటు మధుమేహమూ వచ్చేలా చేస్తుందీ అలవాటు. మామూలు వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో టైప్–2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు 30 నుంచి 40 శాతం మేరకు ఎక్కువ. ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుధూమపానం మానేస్తే కలిగే ప్రయోజనాలివి... ఆహారం రుచి తెలియడం వాసన గ్రహించే శక్తి సాధారణ స్థాయికి రావడం ∙చెమట, శ్వాస, జుట్టు, బట్టలు తాజా వాసనతో ఉండటం, పళ్లు, గోళ్లు పచ్చబారకుండా ఉండటంమెట్టెక్కేటప్పుడు, దిగే సమయంలో, చిన్న చిన్న పనులకు ఆయాసం లేకుండా తేలిగ్గా చేయగలగడం. దీర్ఘకాలిక ప్రయోజనాలు...సిగరెట్ మానేసిన తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడతాయి. దేహంలో ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్ ముప్పు తగ్గుతుంది. పొగతాగడం మానేసిన ఏడాది తర్వాత కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అందుకే ఈరోజు నుంచే పొగతాగడమే కాదు... ΄పొగాకును ఏ రూపంలో వినియోగిస్తున్నా మానేయడమే మంచిది. ఇదీ చదవండి: World Anti Tobacco Day: 1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా!ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఒకరు సిగరెట్ తాగినా అది ఇంటిల్లిపాదీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పక్కనుండేవారు తాగే సిగరెట్ పొగను ఇతరులు పీల్చాల్సి వస్తుండటాన్ని ‘ప్యాసివ్ స్మోకింగ్’ అంటారు. నేరుగా ΄ పొగతాగడం వల్ల కలిగే హాని ఎంతో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా అంతే హాని జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ప్రతి ఏడాదీ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల 34వేలమంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనూ, 46,000 మంది గుండెజబ్బులతోనూ మృత్యువాత పడుతున్నారని తేలింది. అంతేకాదు... ఇంట్లో ఇతరులు తాగే సిగరెట్‌తో కలిగే ఈ ప్యాసివ్ స్మోకింగ్ ప్రభావం వల్ల ఇంట్లోని పొగతాగని ఇతర కుటుంబ సభ్యులకు... ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు వంటి అనారోగ్యాలు కలుగుతున్నా యని స్పష్టమైంది.డా. బట్టు చైతన్య, సీనియర్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ -
1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా!
దేహం ఎంత ధృఢంగా ఉన్నా.. సిగరెట్, బీడీ అలవాటు ఉంటే చాలు పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ"కూర్చిన" రచయితలు, కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.ఒక్కటి చాలు అంటూ మెల్లిగా మొదలెట్టి 2, 3, 4 అలా రోజూ డబ్బా, ఇలా పర్సు ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు. సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.. దమ్ము కొట్టినపుడు సిగరెట్లో పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డీఎన్ఏను నాశనం చేసే పనిలో పడతాయి. సరళంగా చెప్పాలంటే ఓ వ్యక్తి జాతకాన్ని.. ధూమపానికి ముందు, తర్వాత అని చెప్పొచ్చు.అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో గుట్టుగా సిగరెట్‌కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండిగా పైసలున్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటుకు "దగ్గర" అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతేగాక కొన్ని సినిమాల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్లు సైతం యువతను అటువైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. "బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్" అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.సిగరెట్, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఉక్కు లాంటి కండరాల్ని తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్) అడ్డగోలుగా పెరగడానికి కారకం అవుతాయి. తద్వారా కేన్సర్‌కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డిఎన్ఏను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో, మనిషి ఆరోగ్యానికి కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.చదవండి: NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లుసిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డీఎన్ఏను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు.. రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి. దేహ పోరాట పటిమను సమాధి చేస్తాయి. వెరసి కణాలపై రాక్షసంగా దండయాత్ర చేసి.. దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణిలా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి?ధూమపానానికి దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మన దగ్గరే ఉంటుంది.- మాచన రఘునందన్పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీతతెలంగాణ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్