breaking news
World AIDS Prevention Day
-
World AIDS Day: హెచ్ఐవీని ఇలా గుర్తించొచ్చు.. ఈ సూత్రాలు పాటించాలి
హెచ్ఐవీ భూతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. మందు లేని ఈ మాయరోగానికి నిండు జీవితాలు బలైపోతున్నాయి. అవగాహనా లోపం, నిర్లక్ష్యం మూలంగా కొందరు వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండంతో వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. హెచ్ఐవీపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే ఉద్ధేశంతో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. హెచ్ఐవీని ఇలా గుర్తించొచ్చు ►హెచ్ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)ను గుర్తించడానికి ఏఆర్టీ సెంటర్లో కొంబెడ్స్, ట్రై లైన్, ట్రై స్పాట్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో పాజిటివ్ వచ్చినట్లయితే హెచ్‌ఐవీగా నిర్ధారిస్తారు. ►దీర్ఘకాల వీరోచనాలు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి ఎక్కు వరోజులు ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి ►నెల రోజుల్లో శరీర బరువులో 10 శాతం తగ్గినా, నెల రోజులకు మించి జ్వరం, విరేచనాలు బాధించినా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి ►సీడీ- 4 టెస్ట్‌లో తెల్ల రక్తకణాల సంఖ్య 350 కంటే తక్కువగా ఉంటే వారికి జీవిత కాలం పాటు ప్రతి నెల ఉచితంగా ఏఆర్టీ సెంటర్లో మందులు అందిస్తారు. ఏబీసీ సూత్రం పాటించాలి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏబీసీ సూత్రాన్ని పాటించాలి. ఎ-ఎబ్స్టెన్సెస్(వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం), బి-బీ ఫెయిత్ ఫుల్ టూ లైఫ్ పార్టనర్(వివాహ జీవితంలో భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి). సీ- కాన్సిస్టెంట్ కరెక్ట్ యూజ్ ఆఫ్ కండోమ్( సరైన విధంగా ఎల్లప్పుడూ కండోమ్ వాడటం). ఈ మూడు సూత్రాలపై స్వచ్చంద సంస్థల సహాకారంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అప్రమత్తతే ముఖ్యం హెచ్ఐవీ వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది. ముఖ్యంగా విశృంఖల శృంగారం.. ఒకరికంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలతో ఎక్కువగా ఎయిడ్స్ బారిన పడుతున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్న వారి రక్తం ఇతరులకు ఎక్కించడం వల్ల, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఎయిడ్స్ రోగులు వినియోగించిన బ్లేడ్లు వాడడం వల్ల కూడా సంక్రమిస్తుంది. హెచ్ఐవీ సోకితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. ఆరోగ్యం క్షీణించినప్పుడు.. సీ డీ 4 పరీక్షలో కణాల సంఖ్య 200 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎయిడ్స్‌గా పరిగణిస్తారు. సెలూన్లలో కొత్త బ్లేడ్ వాడేలా చూసుకోవాలి. శారీరక సంబంధాల నియంత్రణ, ఇతర స్వీయ జాగ్రత్తలతో ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. సమాజాభివృద్ధికి నిరోధకంగా నిలుస్తున్న ఇటువంటి రుగ్మతలపై ప్రజానీకంలో విస్తృత అవగాహన కల్పించటంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. 2002లో 2.25 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి 2020 నాటికి 0.22 శాతంకు తగ్గింది. జిల్లాలో ప్రస్తుతం 21,332 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, మచిలీపట్నం, గుడివాడలో ఎక్కువగా హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నాయి. ఈ ప్రాంతాలపై ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాజిటివ్ రేటు తగ్గించేలా.. పాజిటివ్ రేటు తగ్గించే క్రమంలో బాధితులను సకాలంలో గుర్తించేలా హెచ్ఐవీ పరీక్షలను వేగవంతం చేశారు. జిల్లాలో 18 హెచ్ఐవీ నిర్ధారణ కేంద్రాలు, 164 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజానీకానికి 2020–21లో 1,04,482 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 1,170 మందికి హెచ్ఐవీ నిర్థారణ అయింది. 2021–22లో అక్టోబర్ వరకు 70,100 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 797 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. గర్భిణులకు 2020–21లో 82,086 మందికి పరీక్షలు చేయగా, ఇందులో మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా వెల్లడైంది. 2021–22లో అక్టోబర్ నెల వరకు 42,360 మందికి పరీక్షలు చేయగా, 53 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. జీవన ప్రమాణం పెరిగేలా... ∙ఎయిడ్స్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో మెరుగైన చికిత్స కోసమని హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం విజయవాడలోనే ‘వైరల్ లోడ్ ల్యాబ్’ అందుబాటులోకి వచ్చింది. రోగి ప్రాణాపాయం నుంచి తప్పించేలా(థర్డ్ లెవెల్ డ్రగ్) అవసరమైన మందులు సకాలంలో అందిస్తున్నారు. జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, విజయవాడలోని పాత, కొత్త ఆసుపత్రుల్లో ఏఆర్టీ కేంద్రాలు అందుబాటులోఉన్నాయి. వీటికి అనుబంధంగా జిల్లాలో 6 ఏఆర్టీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, మాదక ద్రవ్యాలను సూదుల ద్వారా ఎక్కించుకునే వారి ద్వారానే ఎక్కువగా హెచ్ఐవీ విస్తరిస్తున్నందున వీరికి అవగాహన కల్పించేందుకు జిల్లాలో 13 స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. -
బాధితులకు ఆసరా ఏదీ?
నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం ⇒ రూ.కోట్ల నిధులున్నా ప్రయోజనం మాత్రం సున్నా... ⇒ జిల్లాలో 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ⇒ 11వ స్థానంలో జిల్లా నెల్లూరు (వైద్యం): ఎయిడ్స్‌పై సమరం చేద్దాం.. మహమ్మారిని తరిమికొడదాం.. హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. బాధితులకు అండగా ఉంటాం... ఇవి పాల కులు నిత్యం చెబుతున్న మాటలు. ఏడాదిలో ఒకరోజు ఎయిడ్స్ నివారణ దినాన్ని జరిపి ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడం పాలకులు, అధికారులకు పరిపాటిగా మారింది. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కోట్లల్లో నిధులున్నా ప్రయోజనం శూన్యం. జిల్లాలో 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి కనీస వైద్య సదుపాయాలు, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. బాధితులకు కనీసం పెన్షన్కూడా సక్రమంగా అందించడం లేదంటే వీరిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. కోట్ల నిధులు స్వచ్ఛంద సంస్థల పరం ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన, నివారణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. నిధులు నేరుగా ఆయా స్వచ్ఛంద సంస్థలకు చేరుతున్నాయి. నిధులు సక్రమంగా బాధితులకు ఉపయోగపడుతున్నాయా...పక్కదారి పడుతున్నాయా అన్న వాటిపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. జిల్లా లో ఎయిడ్స్ నియంత్రణకు 8 స్వచ్ఛంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థలకు ఏ టా 10 నుంచి 15 లక్షల వరకు ఏపీ ఎ యి డ్స్ నియంత్రణ మండలి నుంచి నిధులు మంజూరవుతాయి. సంస్థలు ప్రభుత్వాలకు కాకి లెక్కలు చూపుతూ అందినకాడికి నిధులను దిగమింగడం పరిపాటిగా మారింది. నివారణకు కృషి ఎయిడ్స్‌వ్యాధి నివారణకు కృషిచేస్తున్నామని ఎయిడ్స నియంత్రణాధికారి రమాదేవి తెలిపారు. బాధితులకు కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. హైరిస్క్ ప్రాంతాలపై దృష్టి సారించి అక్కడివారికి చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాలుగా ‘ఆదరణ’ బిట్రగుంట:ముంగమూరు కూడలిలోని హెచ్ఐవీ పాజిటివ్ ఆదరణ కేంద్రం వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటగా 1999లో ముంగమూరు కూడలిలో ఏర్పాైటె న ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకూ సుమారు పదివేల మందికి పైగా బాధితులు సేవలు పొందుతున్నారు. జిల్లాతో పాటు ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి హెచ్ఐవీ పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఆదరణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం 32 మంది ఆశ్రయం పొందుతుండగా వారిలో 22 మంది చిన్నారులే ఉండడం గమనార్హం. వీరితో పాటు నాలుగు వేల మందికిపైగా ఔట్పేషెంట్లు ప్రతి నెలా కౌన్సెలింగ్, మందులు పొందుతున్నారు. ప్రాణం పోస్తున్న దాతలు ఆదరణ కేంద్రం నిర్వహణకు, ఆశ్రయం పొందుతున్న వ్యాధిగ్రస్తులకు వివిధ ప్రాంతాలకు చెందిన దాతలే జీవం పోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్కపైసా నిధులు అందకపోయినా దాతలే అన్నీ తామై ఆదుకుంటున్నారు. ఉప్పు, పప్పు వంటి నిత్యావసర వస్తువుల నుంచి వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు, మినరల్ వాటర్, బెడ్లు, పౌష్టికాహారం తదితర అవసరాలను ప్రతీనెలా దాతలే తీరుస్తున్నారు. వన్నెతెచ్చిన అవార్డులు ఆదరణ కేంద్రం సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా న్యూఢిల్లీలో ‘నేషనల్ సివిల్ సొసైటీ’ అవార్డును అందజేశారు. పదుల సార్లు కలెక్టర్లు, ఎస్పీ చేతుల మీదుగా రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవార్డులు అందజేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఆదరణ కేంద్రం సేవలు గుర్తించి 2013లో గవర్నర్ భరద్వాజ చేతుల మీదుగా ఆదరణ కేంద్రం నిర్వాహకులు సింహాద్రి రాావుకు గౌరవ డాక్టరేట్ బహుకరించింది. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అయితే ఆదరణ కేంద్రం అనుసరిస్తున్న విధివిధానాలనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది. వ్యాధిగ్రస్తులను ఆదరిద్దాం: సింహాద్రి రావు, కేంద్రం నిర్వాహకుడు హెచ్ ఐవీ పాజాటివ్ వ్యాధిగ్రస్తులను సమాజం ఆదరరించాలి. చక్కెర వ్యాధిలాగే ఇది కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ప్రస్తుతం వ్యాధిగ్రస్తులు అందరిలాగే సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన ఏఆర్టీ, ఆయుర్వేదం మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా బాధితులను అర్థం చేసుకోవాలి.