breaking news
working toilet
-
ఈ అవకాశం అమెరికన్లందరికీ..
-
ఈ అవకాశం అమెరికన్లందరికీ..
న్యూయార్క్: ఏంటీ.. ఏదో సరదా కోసం దీన్నిలా డిజైన్ చేశారనుకుంటున్నారా? అదేంకాదు.. దీనిని ఉపయోగించుకోవచ్చు. అచ్చంగా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన దీనిని ఉపయోగించుకునేందుకు అమెరికన్లందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు గుగెన్ హీమ్ మ్యూజియం ప్రకటించింది. ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మారిజియో క్యాటెలాన్.. మ్యూజియంలోని నాలుగో అంతస్తులోని ఓ రెస్ట్ రూమ్లో ఏర్పాటు చేశాడు. కేవలం చూసేందుకే కాకుండా ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది. 2011 నుంచి ఇలాంటివాటిని తయారు చేస్తున్నా.. తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది మాత్రం దీనినే. ఇటువంటి కళాఖండాల గురించి మరింత ప్రచారం కల్పించేందుకే ప్రజలందరికీ దీనిని ఉపయోగించే అవకాశం కల్పించామని, ఆర్ట్ మార్కెట్కు ఆదరణ పెరగడానికి ఇటువంటి చర్యలు ఉపయోగపడతాయని మ్యూజియం తన వెబ్సైట్లో పేర్కొంది.