breaking news
Womens Police Station
-
‘ఖాకీ’ వివాదం..!
♦ చిక్కుల్లో పడిన మహిళా పోలీస్ స్టేషన్ అధికారి ♦ ఓ యువతితో కుటుంబ సభ్యులకు చిక్కిన వైనం ♦ పోలీస్ బాస్‌కు చేరిన వివాదం.. ♦ నేడు విచారణ చేపట్టనున్న సీపీ..? సాక్షి ప్రతినిధి, వరంగల్ : నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఓ వివాదాస్పద అధికారి మరో సారి చిక్కుల్లో పడ్డాడు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆయనే అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడినట్లు తెలిసింది. చెడు అలవాట్లకు అలవాటు పడిన ఆయన మంగళవారం రాత్రి ఓ యువతితో కలిసి హసన్‌పర్తి వైపు వెళ్తుండగా సొంత కుటుంబ సభ్యులు చూసినట్లు సమాచారం. ఆయన తీరుపై అనుమానం వచ్చి వారు వాహనాన్ని వెంబడించినట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన సదరు అధికారి కారును అందులో ఉన్న యువతిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆ యువతిని విచారించగా సదరు అధికారి లీలలు బట్టబయలు అయ్యాయని తెలిసింది. అయితే రాత్రి రోడ్డుపై చోటు చేసుకున్న ఈ వివాదం స్థానికంగా చర్చనీయాంశగా మారింది. చివరకు ఈ అంశం పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై నేడు సీపీ విచారించనున్నట్లు సమాచారం. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారే ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈయన పలు వివాదాల్లో పేరున్నట్లు పలువురు చర్చించుకోవడం కనిపించింది. -
సీఐ వేధిస్తున్నాడు..
మహిళాపోలీస్స్టేషన్ సిబ్బంది ఆవేదన సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిష నరేట్ పరిధిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిబ్బంది పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది బుధవారం పోలీస్ కమిషనర్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. విధి నిర్వహణ పేరుతో పరేడ్, డ్రెస్ ఇలా ఉండాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా డని మహిళా సిబ్బంది పోలీసు కమిషనర్‌కు చెప్పారు. విష్ణుమూర్తిని ఇన్స్పెక్టర్గా కొన సాగిస్తే మూకుమ్మడిగా సెలవులు పెట్టేందు కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణ జరిపి చర్య తీసు కుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. -
వెయ్యి బంధాల గుడి
వెయ్యి స్తంభాల గుడి ఎక్కడుందో చెప్పుకోండి! వరంగల్ కదా. అదొక అద్భుతమైన నిర్మాణ వైభవం. ఇక్కడి కల్యాణ మండపంలో ఏ స్తంభానికా స్తంభాన్ని తీసి మళ్లీ పేర్చగలం. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది కూడా! అంత మహా అద్భుతం అలవోకగా చేస్తున్న వరంగల్‌లో ఐదు నెలల క్రితం వెయ్యి బంధాల మండపం వెలిసింది. ఇక్కడ పెళ్లిళ్లు చేయరు... కాపురాలు నిలబెడతారు. కల్యాణమండపంలో స్తంభాలను మళ్లీ నిలబెట్టినట్టుగా ఇక్కడ కాపురాలు నిలబెడతారు. వరంగల్ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ ఈజ్ డెఫినెట్లీ ‘వెయ్యి బంధాల గుడి’! ‘జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నాం. దీనికో పరిష్కారం చూపండి’ అంటూ ఈ ఐదు నెలల కాలంలోనే వరంగల్ అర్బన్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో 1097 కేసులు నమోదయ్యాయి. కుటుంబ పెద్దల్లా వరంగల్ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, మంచి మాటలతో సర్దిచెప్పడంతో.. అందులో 977 జంటలు తిరిగి ఒక్కటయ్యారు. మరో 68 పిటిషన్లు కోర్టుకు వెళ్లగా.. 52 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. విడిపోదామని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినవారు.. కలిసుంటామని ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. రికార్డు స్థాయిలో ఘనత సాధించిన ఈ మహిళా పోలీస్‌స్టేషన్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సర్ది చెబుతున్నారు... ఏ కారణం చేత విడిపోవాలనుకున్నా అది వారికే క్షేమకరం కాదని, సమాజంలో కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత, కుటుంబంలో ఉండటం వల్ల వచ్చే సంతోషం, కలిగే సంతృప్తి... జీవితంలో ఎంత అమూల్యమైనవో మంచి మాటలతో సర్దిచెబుతున్నారు ఈ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది. వీరిలో సి.ఐ. రాయల ప్రభాకర్‌రావు, ఎస్.ఐ. సుజాత, ఎస్.ఐ. నస్రీన్ సుల్తానా, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హోమ్గార్డ్స్ ఉన్నారు. ‘కొన్ని సార్లు పిటిషనర్లు చెప్పే సమస్యలను నాలుగైదు గంటల పాటు విన్న సంఘటనలూ ఉన్నాయి. వారి సమస్యను శ్రద్ధగా వింటున్నామనే నమ్మకం పిటిషనర్‌కి కలిగితే సగం సమస్య పరిష్కారమయినట్లే’ అని తెలిపారు సి.ఐ. రాయల ప్రభాకర్‌రావు. దంపతుల్లో ఇద్దరూ చెప్పేదాంట్లో సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకొని, ఇద్దరిలో ఉన్న ప్రతికూల అంశాలను సరిదిద్దుకోవాల్సిందిగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మత విశ్వాసాలను గౌరవిస్తూ వారికి సంబంధించిన మతస్తులతోనే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. అలాగే తాగుడు అలవాటు ఉండి భార్యలను ఇబ్బంది పెట్టే భర్తలను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇరువైపుల తల్లితండ్రులకూ కౌన్సెలింగ్... పెళ్లై అత్తవారింట్లో ఉన్న కూతురితో క్షేమ సమాచారం కోసం తల్లులు నిరంతరం మాట్లాడుతుండటం ఇబ్బందులకు దారి తీస్తోంది. కోడలిపై పై చేయి సాధించాలనే లక్ష్యంతో అవసరం ఉన్నా లేకపోయినా కోడలిని తక్కువ చేస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన పోలీసు సిబ్బంది భార్యాభర్తలకే కాకుండా, వారి వారి తల్లితండ్రులనూ పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కౌన్సెలర్ దయాకర్ ఈ విషయంపై స్పందిస్తూ - ‘‘ పిల్లల సంసారంలో పెద్దల జోక్యం ఎంతవరకు అవసరమో...ఎంత వరకు అనవసరమో చెబుతున్నాం. పిల్లలు కలిసి ఉంటేనే, పెద్దలకు ఆనందం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. సలహాలు, సూచనలు ఇస్తున్నాం’’ అని తెలిపారు. - తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, హన్మకొండ ఫోటోలు : పెద్దపెల్లి వరప్రసాద్ వివాహ బంధాన్ని కొనసాగించలేక విడిపోదామనుకుంటున్న వెయ్యి జంటలు చెబుతున్న కారణాలలో ఇవే ప్రధానమైనవి... భర్తలు... నా భార్య, నా తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. వాళ్లకు సమయానికి తిండి పెట్టడం లేదు. వాళ్లు వచ్చినప్పుడు లేచి నిల్చుని గౌరవం ఇవ్వట్లేదు. అమ్మానాన్నలను తిడుతోంది. వాళ్లకు సంబంధించిన చిన్నచిన్న పనులూ సక్రమంగా చేయడం లేదు. భార్యలు... నా భర్త , ఆయన తల్లిదండ్రుల మాటే వింటాడు. నా మాటకు విలువ లేదు. నన్నసలు పట్టించుకోడు. అత్తామామల మాట విని నన్ను కొడతాడు. ఆడబిడ్డల ముందు నన్ను తిడతాడు. సమస్యను పూర్తిగా వినాలి జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ ఝా, క్రైం డీఎస్పీ ఈశ్వర్రావు పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చేవారికి పరిష్కారం చూపిస్తున్నాం. సమస్య తీవ్రతను అనుసరించి కౌన్సెలింగ్ ప్రక్రియలో సర్వోదయ స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్ సభ్యుల సహకారం తీసుకుంటున్నాం. - రాయల ప్రభాకర్‌రావు,సర్కిల్ ఇన్స్పెక్టర్,మహిళా పోలీస్ స్టేషన్ వరంగల్ అర్బన్ ప్రతిదీ రికార్డు చేస్తాం... ప్రతి కేసుకు సంబంధించి ఫైల్‌ను మెయింటెయిన్ చేస్తాము. తొలిసారి పిటిషన్ ఇచ్చింది మొదలు- పరిష్కారం అయ్యే వరకు మేం చేపట్టిన అన్ని అంశాలను ఆ ఫైలులో పొందుపరుస్తాం. పిటిషనర్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫైలు ఆధారంగా గతంలో చెప్పినవి.. ఇప్పుడు జరుగుతున్న అంశాలను బేరీజు వేసుకుని పరిష్కార మార్గాలు వెతుకుతాం. - సుజాత, సబ్ ఇన్స్పెక్టర్,మహిళా పోలీస్ స్టేషన్ వరంగల్ అర్బన్ జీవితంలో వెలుగు... నేను, నా భర్త ఇద్దరం విద్యావంతులమే. ఆయన మా పుట్టింటి వాళ్లను ఇంటికి రానిచ్చేవారు కాదు. ఎవరితోటీ మాట్లాడవద్దనేవారు. ఏ పని చేసినా అనుమానంగా చూస్తూ నిందలు మోపేవారు. అకారణంగా నన్ను కొట్టేవాడు. ఎందుకు కొడుతున్నాడో, ఏ కారణంతో తిడుతున్నాడో అర్థమయ్యేది కాదు. మధ్యమధ్యలో అబార్షన్లు. గతంలో ఓ సారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం అవకపోగా కష్టాలు రెట్టింపు అయ్యాయి. కానీ రోజురోజుకి ఇబ్బందులు పెరిగిపోవవడంతో మహిళా పోలీస్ స్టేషన్, వరంగల్ అర్బన్‌ను ఆశ్రయించాను. నేను ఆయనతో బతకలేను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండని వేడుకున్నాను. ఫిబ్రవరిలో నాకు , నా భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అప్పటి నుంచి నాభర్తలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం నేను గర్భిణిగా ఉన్నాను. మధ్యలో ఆగిపోయిన నా చదువు కొనసాగించాలని నా భర్తే అంటున్నాడు. నా జీవితంలో ఇది ఊహించని మార్పు. - సుమతి (పేరుమార్చాం) ఇరువైపులా కౌన్సెలింగ్... చిన్న సమస్యలను పరిష్కరించుకోలేక నేడు విడిపోయేందుకు ఎన్నో జంటలు సిద్ధపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య పెద్ద అగాథం ఏర్పడుతోంది. సర్దిచెప్పాల్సిన పెద్దలు కూడా సరైన బాధ్యత తీసుకోవడం లేదు. అందుకే, భార్యాభర్తలు ఇద్దరికే కాకుండా ఇరువైపుల తలిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.. - దయాసాగర్, కౌన్సెలర్ -
మహిళా పోలీసు స్టేషన్ ఎక్కడ..?
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: విజయనగరంలో మహిళా పోలీసు స్టేషన్ ఎక్కడుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ మేడపై మహిళా పోలీసు స్టేషన్ ఉండేది. అయితే ఇప్పుడు పద్మావతి నగర్లో రూ.లక్షలు ఖర్చుచేసి మహిళా పోలీస్ స్టేషన్ కోసం నూతన భవనాన్ని నిర్మించారు. సాధారణంగా చదువుకున్నవారికే నేమ్‌బోర్డు ఉంటేనే గాని పోలీసు స్టేషన్ గురించి తెలియదు. అందులోనూ ఇప్పుడు పట్టణంలో పెద్దపెద్దభవంతులు, ఇళ్లు వెలిశాయి. రంగురంగుల భవనాలు ఉన్న పద్మావతినగర్ 2వ లైన్లో మహిళా పోలీసు స్టేషన్‌ను నిర్మించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో పోలీస్ స్టేషన్‌ను ఇక్కడికి మార్చారు. దాదాపు మూడు నెలల దాటినా పోలీసు అధికారులు స్టేషన్‌కు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఒకటో పట్టణ, రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని మహిళలు డెరైక్ట్‌గా మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. డెంకాడ, నెల్లిమర్ల, రూరల్ పోలీసు స్టేషన్‌కు సంబంధించిన మహిళల ఫిర్యాదులపై కేసులు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదు చేసి తదుపరి చర్యల కోసం మహిళా పోలీసు స్టేషన్‌కు పంపిస్తారు. విజయనగరంలో ఉన్న మహిళలకే మహిళా పోలీసు స్టేషన్ ఎక్కడుందో తెలియకపోతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పోలీసు స్టేషన్ల నుంచి వచ్చే మహిళలకు ఎలా తెలుస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మహిళా పోలీసు స్టేషన్‌కు నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.