breaking news
Women cops
-
కమిషనరేట్‌లో భారీగా పెరిగిన మహిళా అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో మహిళా ఉన్నతాధికారుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీ ఆపై స్థాయిలో పోస్టుల సంఖ్య 27 ఉండగా వీటిలో ఆరు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 21 పోస్టుల్లో పది మంది ఉమెన్ ఆఫీసర్లు ఉన్నారు. దీంతో ఉన్నతాధికారుల్లో మహిళల శాతం 50కు చేరుకుంది. సంయుక్త పోలీసు కమిషనర్ (పరిపాలన విభాగం) సహా ఇప్పటికే తొమ్మిది మంది మహిళా ఉన్నతాధికారులు ఉన్నారు. తాజాగా నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌కు అపూర్వ రావును నియమించడంతో బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించి పూర్తి స్థాయి ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుదీర్ఘ కాలం పాటు లేని అవకాశం... ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగర పోలీసులో సుదీర్ఘ కాలం వరకు మహిళా ఉన్నతాధికారులకు ఆస్కారం ఉండేది కాదు. పోలీసు విభాగంలో వీరి సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు ఉన్నత స్థాయిలో లేకపోవడం దీనికి ఒక కారణం. అయితే కాల క్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో ఉన్న సున్నిత పరిస్థితులు, ఇతర కారణాల నేపథ్యంలో మహిళా అధికారులకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చే వారు కాదు. ఇక్కడ హఠాత్తుగా తలెత్తే పరిణామాలతో పాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది.కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళా ఉన్నతాధికారి ఉండాలని డీజీపీ కార్యాలయంతో పాటు ప్రభుత్వం భావించింది. అయితే చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్‌జోన్‌కు మాత్రమే మహిళా అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్‌కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసు వింగ్‌లో మహిళ ఉన్నతాధికారి పోస్టు ఇది ఒక్కటే అనే భావన కొనసాగింది.ఉమెన్ సేఫ్టీ వింగ్ రాకతో... ఈ కారణంగానే 2014కు పూర్వం నగరంలో పని చేసిన మహిళ ఉన్నతాధికారులు అంతా నార్త్‌జోన్ డీసీపీగా వ్యవహరించిన వారే. ఒక్క ఏఆర్ అనురాధ మాత్రం అదనపు సీపీగా వ్యవహరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ–టీమ్స్‌కు రూపం ఇచ్చింది. దీంతో ఇందులో కచ్చితంగా మహిళ ఉన్నతాధికారులనే నియమించాల్సి వచ్చింది. ఈ పరిణామంతో నగరంలో మహిళా ఉన్నతాధికారుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చింది.ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో డీసీపీ ఆపై స్థాయిలో పది మంది మహిళలు ఉన్నారు. మరో ఆసక్తికరమైన కోణం ఏమిటంటే... తొలిసారిగా ‘లోకల్స్’కు ఎక్కువ సంఖ్యలో ఉన్నతాధికారులుగా పోస్టింగ్ దక్కింది. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సీసీఎస్ డీసీపీ శ్వేత, స్పెషల్ బ్రాంచ్ చీఫ్ అపూర్వ రావు, సౌత్ ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర వీరంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. సిటీ పోలీసులో మహిళా ఉన్నతాధికారులు వీరే.. పరిమళ నూతన్– పరిపాలన విభాగం సంయుక్త సీపీ రక్షిత మూర్తి– సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీ అపూర్వ రావు– స్పెషల్ బ్రాంచ్ డీసీపీ సాధన – నార్త్‌జోన్ డీసీపీ శ్వేత– డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ స్నేహ మెహ్రా– సౌత్ జోన్ డీసీపీ శిల్పవల్లి– మధ్య మండల డీసీపీ కవిత– ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య జాదవ్– ఉమెన్ సేఫ్టీ డీసీపీ పుష్ప– ఐటీ సెల్ డీసీపీచదవండి: దక్షిణమధ్య రైల్వేలో భారీ కుదుపు! -
వృద్ధుడనే కనికరం లేకుండా సొంత మావపై దాడికి పాల్పడ్డ మహిళా పోలీసు
న్యూఢిల్లీ: ఒక మహిళా పోలీసు సొంత మావపై బౌతిక దాడికి దిగింది. ఐతే ఈ ఘటనను మరొక పోలీసు వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీ నగరంలో నివాసం ఉంటున్న బాధిత వృద్ధుడి ఇంట్లో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక మహిళా పోలీసు పదేపదే తన మామాగారి చెంప చెళ్లుమనిపిస్తుంది. పైగా అందుకు ఆమె తల్లి కూడా మద్దతిచ్చింది. ఈ ఘటన జరగడానికి ముందు ఆమె తన తల్లితో కలిసి వృద్ధుడైన తన మావతో గొడవకు దిగింది. ఇద్దరి మద్య పెద్ద వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మరొక పోలీసు జోక్యం చేసుకునేలోపే ఆ మహిళా పోలీసు పదే పదే ఆ వృద్ధుడి చెంపపై కొట్టింది. సదరు మహిళా పోలీసు ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఘటన పై సీరియస్ అయిన పోలీసు అధికారులు సదరు మహిళా పోలీసుపై కేసు నమోదు చేయడమే కాకుండా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. #WATCH | Case registered under section 323/427 IPC after a video of Sub-Inspector thrashing her in-laws in Delhi's Laxmi Nagar went viral. Info shared with concerned authority to take suitable departmental action against the erring police official: Delhi Police (CCTV Visuals) pic.twitter.com/VUiyjVtZQl — ANI (@ANI) September 5, 2022 (చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో) -
దప్పికతోనే మహిళ పోలీసుల విధులు!
న్యూఢిల్లీ: మహిళా సాధికారిత సాధనలో భాగంగా పోలీసుశాఖలోనూ పెద్ద ఎత్తున మహిళలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో కనీస మౌలిక సౌకర్యాలు లేక మహిళా పోలీసులు అనుభవిస్తున్న కష్టాలను తాజాగా ఓ సర్వే వెలుగులోకి తెచ్చింది. విధులు నిర్వహించే ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకటికి వెళ్లకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగకుండా మహిళా పోలీసులు కర్తవ్యపాలన చేస్తున్నారు. దీనికితోడు పురుషుల శరీర దారుఢ్య కొలతలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ జాకెట్లు రూపొందిస్తుండటంతో అవి తాము ధరించినప్పుడు చాలా బిగుతూగా ఉండి.. ఊపిరి కూడా అందడం లేదని, చాలాబరువుగా కూడా ఉంటున్నాయని మహిళా పోలీసులు ఈ సర్వేలో వెల్లడించారు. గత ఏడాది జరిగిన పోలీసుశాఖలోని మహిళల 7వ జాతీయ సదస్సు సందర్బంగా ఈ సర్వే వివరాలు, సిఫారసులను అందజేశారు. పోలీసు రీసెర్చ్, అభివృద్ధి బ్యూరో, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే వివరాలు తాజాగా వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాల గురించి చర్చించి.. వాటి పరిష్కారం కోసం సలహాలతో కూడిన ఈ సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర బలగాల్లో 33శాతం పోస్టులను, సరిహద్దు భద్రతా దళాల్లో 15 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసుశాఖలోని మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.