breaking news
Women’s Asia Cup T20
-
మహిళా ఆసియా కప్-2026 ఫైనల్లో భారత్ గెలుపు.. ట్రోఫీ వేళ ట్విస్ట్!
దుబాయ్: మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ట్రోఫీ అందుకునే సమయంలో మాత్రం వేదిక వద్దకు రాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినట్లు సమాచారం. దీంతో గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లో చోటుచేసుకున్న పరిస్థితే మరోసారి కనిపించింది.అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మ్యాచ్ అనంతరం ఎప్పటిలాగే సంబరాలు చేసుకుంది. ప్రసార సంస్థకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన 15–20 నిమిషాల్లో బహుమతుల ప్రదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గంటకుపైగా ఆలస్యమైంది. ఈ సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆటగాళ్లతో మైదానం పక్కన మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే జట్టు సభ్యులకు పతకాలు అందజేసినట్లు సమాచారం.ఏసీసీ అధ్యక్షుడి హోదాలో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అందజేసేందుకు స్టేడియానికి వచ్చినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపత్తుకు ఆయన బహుమతి చెక్కును అందజేశారు. అయితే భారత జట్టు, కోచ్, అధికారులు ట్రోఫీ ప్రధాన వేదిక వద్ద కనిపించలేదు. దీంతో భారత జట్టు ట్రోఫీని తీసుకోకపోతే దానిని మరోసారి ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకుంది. భారత్ టైటిల్ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. మరో ఏసీసీ లేదా ఐసీసీ అధికారి చేతుల మీదుగా ట్రోఫీ అందజేయాలని కోరింది. అయితే నఖ్వీ అందుకు అంగీకరించకపోవడంతో అప్పట్లో బహుమతి ప్రదాన కార్యక్రమం వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఆయన ట్రోఫీని తీసుకుని ఏసీసీ కార్యాలయానికి వెళ్లారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో గతేడాది ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల సందర్భంగా సంప్రదాయ హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడాన్ని భారత జట్టు వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నఖ్వీ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా చేసిన గత వ్యాఖ్యలు కూడా దీనికి కారణమని కథనాలు పేర్కొన్నాయి. తాజాగా మహిళల ఆసియా కప్ ఫైనల్లోనూ దాదాపు అదే పరిస్థితి కనిపించడంతో ట్రోఫీ ప్రదానంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: పోలాండ్ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో రష్యా డ్రోన్ దాడి -
IND vs PAK: పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్
మహిళల ఆసియాకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్‌లో ఉన్న హర్మన్ సేన.. పాక్‌తో పోరులోనూ సత్తాచాటాలని పట్టుదలతో ఉంది. మరోవైపు తమ మొదటి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను ఓడించిన పాకిస్తాన్.. భారత్‌లో మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాక్ ఓపెనర్ ఆయేషా జాఫర్ కీలక వ్యాఖ్యలు చేసింది. టీమిండియాతో మ్యాచ్ కోసం తామేమి ప్రత్యేక వ్యూహాలు రచించడం లేదని జాఫర్ తెలిపింది."భారత్-పాక్ మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మా దృష్టిలో ఇదీ ఒక సాధారణ మ్యాచ్ లాంటిదే. ఈ టోర్నీలో ఇది మాకు రెండో మ్యాచ్. ఇందులో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి విజయం సాధించడమే మా లక్ష్యం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించేందుకు శ్రమిస్తున్నాం. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదని మా మెంటార్ స్పష్టం చేశారు" అని ఆయేషా విలేకరుల సమావేశంలో పేర్కొంది.కాగా వైట్‌బాల్ క్రికెట్లో పాకిస్తాన్‌పై టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 17 టీ20లు జరగగా.. భారత్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా, పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. వన్డేల్లో అయితే 12 మ్యాచ్‌లు జరగగా.. మొత్తం అన్నింటిలోనూ టీమిండియానే గెలిచింది.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం
మహిళల ఆసియాకప్-2022లో పాకిస్తాన్ జట్టుకు థాయ్‌లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. షెల్లాట్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తమ టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌పై థాయలాండ్కు ఇదే తొలి విజయం. 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ మరో బంతి మిగిలూండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. థాయ్ ఓపెనర్ నటకన్ చంతమ్ 61 పరుగులు చేసి.. తమ జట్టు చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ బౌలర్లలో నిదా దార్, హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు థాయ్‌లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో అమీన్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక థాయ్ బౌలర్లలో టిప్పోచ్ రెండు, తిపట్చా పుట్టావాంగ్ ఒక్క వికెట్ సాధించారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న భారత్ తలపడనుంది. The sheer happiness after scoring those winning runs ✨The Thailand🇹🇭 Team won our hearts and the match today@ThailandCricket #ACC #AsiaCup2022 #WomensAsiaCup pic.twitter.com/atJwwG7wfh — AsianCricketCouncil (@ACCMedia1) October 6, 2022 చదవండి: IND VS SA: లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై నీలినీడలు -
ఆసియాకప్‌లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం
మహిళల ఆసియాకప్-2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షెల్లాట్ వేదికగా యూఏఈ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ ఆసియాకప్‌లో వరుసగా మూడో విజయాన్ని భారత్ తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(49 బంతుల్లో 64), రోడ్రిగ్స్( 45 బంతుల్లో 75) అర్ధ సెంచరీలతో చెలరేగారు. యూఏఈ బౌలర్లలో గౌర్, మొఘల్, కోట్టి, ఇషా రోహిత్ తలా వికెట్ సాధించారు. ఇక 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లో కవిషా ఎగోడాగే(30 నటౌట్), కుషీ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. కాగా భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ రెండు వికెట్లు, దయాలన్ హేమలత ఒక్క వికెట్ సాధించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్7న తలపడనుంది. చదవండి: LLC 2022: మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ -
ఆసియా కప్ టీ20: ఫైనల్లో భారత్
కౌలాలంపూర్: ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ గ్యాంగ్ తుది పోరుకు అర్హత సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఈ టోర్నీలో నాల్గో విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత్ సగర్వంగా ఫైనల్‌కు చేరింది. అంతకముందు మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక జట్లపై భారత్ విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మిథాలీ రాజ్ డకౌట్ నిష్క్రమించడంతో భారత్ పరుగుకే వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ(0) సైతం పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టింది. కాగా,స్మృతీ మంధాన(38), హర్మన్‌ప్రీత్ కౌర్(34 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ ఇంకా 23 బంతులుండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ క్రీడాకారిణుల్లో సనా మిర్(20 నాటౌట్), నహిదా ఖాన్(18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్ ఏక్తా బిస్త్ మూడు వికెట్లతో రాణించగా, శిఖా పాండే, అంజూ పటేల్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. -
పాకిస్థాన్‌తో మ్యాచ్.. చెలరేగిన భారత బౌలర్లు
కౌలాలంపూర్ : మహిళా ఆసియా కప్ టీ-20 సిరీస్‌లో భాగంగా మలేసియాలో దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 73 పరుగుల స్వల్ప లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఇటు భారత్, అటు పాకిస్థాన్ జట్లు చెరో మూడు విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. చావో-రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఏక్తా బిష్త్ తన నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీసుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి పాక్ వుమెన్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టడానికి నానాతంటాలు పడ్డారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత మహిళా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ.. పాక్ జట్టును 72 పరుగులకు పరిమితం చేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి.. భారత్ జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరే అవకాశం కనిపిస్తోంది.


