breaking news
womans stomach
-
ప్రసవం చేసి.. గర్భసంచిలో సూదిని పెట్టి
సాక్షి, చెన్నై: ప్రసవ సమయంలో వైద్యులు చేసిన తప్పిదం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. చికిత్స చేసిన వైద్యులు కడుపులో సూదిని వదిలేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లికి చెందిన కార్తిక్ కట్టడ నిర్మాణ కార్మికుడు. అతని భార్య రమ్య (21). గర్భిణిగా ఉన్న ఆమెకు గత 19న ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం అయ్యింది. తరువాత రమ్యకు కడుపు నొప్పి, రక్త స్రావం ఏర్పడడంతో బంధువులు ఆమెను బుధవారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రమ్యకు స్కాన్ చేసి చూడగా కడుపులో సూది ఉన్నట్టు గుర్తించారు. ప్రసవం సమయంలో సూదిని లోపలే ఉంచి కుట్లువేసినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆపరేషన్ కోసం ఆమెను మదురై ఆసుపత్రికి తీసుకెళ్లారు. రమ్యకు శస్త్రచికిత్స మూలంగా సూదిని తొలగించనున్నారు. ప్రసవ సమయంలో మహిళ కడుపులో సూదిని పెట్టి కుట్లు వేయడాన్ని ఖండిస్తూ ఆమె బంధువులు ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రిని ముట్టడించారు. ప్రసవం చేసిన సమయంలో కుట్లు వేసిన నర్సులు సూదిని లోపల పెట్టడం ఏమిటని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వీరరాఘవరావు మదురై ఆసుపత్రి డీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వైద్యులను, నర్సులను విధుల్లోనుంచి తొలగించారు. -
మహిళ కడుపులో 15 కిలోల కణితి
హయత్‌నగర్: కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో పెరిగిన సుమారు 15 కిలోల బరువైన కణితిని బుధవారం హయత్‌నగర్‌లోని టైటన్ బ్రిజిల్ కోన్ ఆసుపత్రి వైద్యులు తొలగించారు. ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ అధికారి డా. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... మంచాల మండలం తిప్పాయిగూడకు చెందిన ఎస్.కమలమ్మ (55) గత మూడు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతుంది. పలు ఆసుపత్రులలో చికిత్స చేసుకున్నా నయం కాలేదు. ఈ నెల 23న హయత్‌నగర్‌లోని టైటన్ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు సిటీ స్కానింగ్ పరీక్ష ద్వారా ఆమె కడుపులో బరువైన కణితి పెరిగినట్లు గుర్తించారు. బుధవారం ఉదయం లాప్రోస్కోపీ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కార్తిక్, సరిత టీంలు కమలమ్మకు శస్త్ర చికిత్స చేసి కడుపులో పెరుగుతున్న కణితిని తొలగించారు. కణితి బరువు సుమారు 15 కిలోలు ఉందని అరుదుగా ఇలాంటి కణితి పెరుగుతుందని, ప్రస్తుతం కమలమ్మ కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.