breaking news
winner revealed
-
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
హ్యూస్టన్: అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారత సంతతికి చెందిన కార్తీక్ నెమ్మాని(14) విజేతగా నిలిచాడు. టెక్సాస్‌లోని మెక్‌కిన్నీకి చెందిన కార్తీక్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి కృష్ణ నెమ్మాని హైదరాబాద్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు. కార్తీక్ తుది పోరులో భారత సంతతికే చెందిన నయాసా మోదీ అనే బాలికతో పోటీపడి విజయం సాధించాడు. తుదిపోరులో 'koinonia' అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి కార్తీక్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలిచిన కార్తీక్‌కు 40 వేల డాలర్లు, ట్రోఫీని ఇస్తారు. కార్తీక్‌కు మరియం–వెబ్‌స్టర్ నుంచి 2,500 డాలర్లు, న్యూయార్క్, హాలీవుడ్‌లలో ఉచితంగా పర్యటించే చాన్స్ ఇస్తారు. ఈ సారి పోటీలో మొత్తం 516 మంది విద్యార్థులు పోటీపడగా, ఫైనల్‌కు 16 మంది చేరుకున్నారు. వీరిలో 9 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. గత 11 ఏళ్లుగా భారత సంతతి విద్యార్థులే ఈ పోటీల్లో గెలుస్తున్నారు. -
వ్యాసరచన పోటీల విజేతల వెల్లడి
కడప కోటిరెడ్డి సర్కిల్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులలో చేనేత ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు జూలై 31న నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థుల వివరాలను సహకారశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సంబంధించి ‘భారత చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు’ అనే అంశంపై నిర్వహించిన పోటీలో గుండ్లూరు జెడ్పీ హైస్కూలుకు చెందిన బి.ఆనంద్ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే కడప ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన కె.శ్రీలిఖితేశ్వరి ద్వితీయ స్థానంలో, కడప సీఎస్ఐ హైస్కూలుకు చెందిన సాగర్ తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. అలాగే 6, 7 తరగతులకు సంబంధించి కడప రాయలసీమ హైస్కూలు విద్యార్థి ఆదికేశవులు ప్రథమ స్థానంలో, శ్రీ వెంకటేశ్వర హైస్కూలుకు చెందిన డి.ఉదయ్‌కుమార్ ద్వితీయ, రాయలసీమ హైస్కూలుకు చెందిన వి.విజయ్ తృతీయ స్థానంలో నిలిచారన్నారు. వీరికి ఈ నెల 7న కడప కళాక్షేత్రంలో జాతీయ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని చేనేత సహకార శాఖ సంచాలకులు జయరామయ్య, సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ రామ్మూర్తిరెడ్డి, చంద్రముని తెలిపారు.