breaking news
wide campaign
-
వరంగల్‌లో రోజ విస్తృత ప్రచారం
-
కళ్లెదుటే వృథా
- కృష్ణసాగరం, అసర్ల సాగర జలాల పరిరక్షణ శూన్యం - ఏళ్లు గడుస్తున్నా... తీరని మినీ రిజర్వాయర్ కల పాతపట్నం : ‘ప్రతీ నీటిబొట్టూ ఒడిసిపట్టు’ అంటూ విస్తృత ప్రచారం చేసే అధికారులు ప్రకృతి ప్రసాదించిన సాగర జలాలను పరిరక్షించుకోవడంలో విఫలమవుతున్నారు. వేలాది ఎకరాలకు సరిపడా నీరు ఏటా వృథా అయిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. పాతపట్నం మండలంలోని బి.గోపాలపురం వద్ద కృష్ణ సాగరం, తెంబూరు వద్ద అసర్ల సాగరాల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వీటిని రిజర్వాయర్లుగా మారిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందుతుందన్న విషయం తెలిసినా అధికారులు ఎందుకో ఆ దిశలో ఆలోచించట్లేదు. మండలంలోని గంగువాడ, బడ్డుమర్రి ప్రాంతాలకే కాకుండా వందలాది ఎకరాలకు కృష్ణజలసాగరమే ఆధారం. పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజక వర్గాల్లో సుమారు 2600 ఎకరాలకు పైగా పంట భూములకు అసర్ల సాగరం నీరందిస్తోంది. వర్షాలు పడితే ఈ సాగరాల్లోని నీరంతా వృథా అయిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని మినీ రిజర్వాయర్లుగా అభివృద్ధి పరిస్తే నీటిని ఆదా చేసుకోవచ్చని వారంటున్నారు. దీనిపై గతంలో అనేకసార్లు వినతి పత్రాలు అందించామని, ఓ సారి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందనీ పేర్కొన్నారు. బి.గోపాలపురం వద్ద ఉన్న కృష్ణ సాగరాన్ని మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి పరచాలన్న ప్రజల ఆకాంక్షను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక బృందం పరీశీలించింది. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపింది. అది ఏమైందో ఇప్పటికీ తెలీడం లేదు. రైతులు వర్షాకాలంలో వచ్చే వరదనీరు క్రిష్ణ సాగరంలోకి చేరుతున్నప్పటికి ఆ నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టడంతో వృథా అవుతోంది. రిజర్వాయర్‌గా మారిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకునే వీలుంటుందని గంగువాడ ఎంపీటీసీ సభ్యుడు మిరియాబిల్లి బాబూరావు, తెంబూరు సర్పంచ్ బమ్మిడి సింహాచలం అభిప్రాయ పడ్డారు. అలాగే 750 ఎకరాల విస్తీర్ణం కలిగిన అసర్ల సాగరానికి ఇప్పటికే ఒకే స్లూయిజ్ ఉన్నప్పటికీ పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు 2600 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అయితే అసర్ల సాగరాన్ని రిజర్వాయర్‌గా స్థాయి పెంచితే మరింత ఆయకట్టుకు మేలు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు. -
గిరిజన మాండలికాల్లో ప్రసారాలు
న్యూఢిల్లీ: గిరిజన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడానికి రేడియో కార్యక్రమాల్లో మరిన్ని గిరిజన మాండలికాలను చేర్చాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీని కోసం ఆలిండియా రేడియో, గిరిజన సంక్షేమ శాఖలను సంప్రదించి, ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారు. గిరిజనులు తమ భాషకాని భాషకు అర్థం చేసుకోలేరని, అందుకే షార్ట్వేవ్ కార్యక్రమాల ద్వారా కొండ, అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను వారి మాండలికాల ప్రసారాల ద్వారా చేరుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. -
భవానీ దీక్షలకు స్వాగతం
నేటి నుంచి భవానీ దీక్షల స్వీకరణ ఇంద్రకీలాద్రిపై మాల ధరించనున్న 25వేల మంది భక్తులు డిసెంబర్ 12-16 వరకు దీక్ష విరమణ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న దుర్గగుడి అధికారులు అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తూ.. అమ్మకు నిత్య పూజాకైంకర్యాలు సమర్పిస్తూ.. ఆనంద జ్యోతులు వెలిగించే భవానీ దీక్షకాలం నేటి (ఆదివారం) నుంచి ప్రారంభంకానుంది. మండలకాలం పాటు అమ్మను భక్తితో పూజించే భవానీ మాల ధరించడం పుణ్యకార్యమని, పూర్వజన్మ సుకృతమని పండితులు చెబుతారు. ఎవరైతే నిత్యం దుర్గమ్మ నామస్మరణతో మనసును దైవాధీనం చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారో వారే జగజ్జనని అనుగ్రహం పొందుతారని పేర్కొంటారు. సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల స్వీకరణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఆరు లక్షలమంది భవానీలు దీక్షలు స్వీకరించేందుకు సన్నద్ధమయ్యూరు. దీక్షల స్వీకరణ ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు జరుగుతుంది. డిసెంబరు 12 నుంచి 16వ తేదీ వరకు దీక్ష విరమణ జరుగుతుందని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన వైదిక కమిటీ ప్రకటించింది. దీక్షలు సాగేదిలా.. మండల దీక్షలు ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు, అర్ధమండల దీక్షలు 22 నుంచి 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ భక్తులంతా వచ్చేనెల 12 నుంచి 16వ తేదీలోగా ఇంద్రకీలాద్రికి వచ్చి దీక్షలు విరమించాలి. ఈ సమయంలో ఆలయంలో చండీయూగం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో కలశజ్యోతి ప్రదర్శన నిర్వహిస్తారు. డిసెంబర్ ఐదోతేదీ పౌర్ణమినాడు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణక్షేత్రం నుంచి ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 దీక్షల విరమణకు ఆఖరు రోజు కావడంతో అదేరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. విస్తృత ప్రచారం ఉత్తరాంధ్ర భక్తులు భవానీ దీక్షలు ఎక్కువగా స్వీకరిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారు మండలకాలం పాటు కఠోర నియమాలతో దీక్షలు పాటిస్తారు. అనంతరం కాలినడకన దుర్గమ్మ దర్శనానికి వస్తారు. ఈ భక్తుల కోసం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ప్రచార రథం ద్వారా గత నెలలోనే అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. హుదూద్ ప్రభావం ఎంత? ఈ ఏడాది హుదూద్ తుపానుకు ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోరుుంది. ఈ నేపథ్యంలో సర్వం కోల్పోయిన భక్తులు దీక్షలు ఎంతమేరకు తీసుకుంటారోనన్న సందేహం వ్యక్తమవుతోంది. అరుుతే, ప్రకృతి వైపరీత్యాన్ని ఎదురొడ్డి నిలబడిన భక్తులు అకుంఠిత భక్తితో అమ్మవారి దీక్షలు స్వీకరిస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. 25వేల మంది భవానీ భక్తుల రాక కేవలం జిల్లాలోని భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల్లోని వారు కూడా భవానీదీక్షలు స్వీకరించేందుకు ఇంద్రకీలాద్రి వస్తారు. దేవస్థానంలోని అర్చకుల వద్ద సుమారు 10వేల మంది, ఇంద్రకీలాద్రిపై సుమారు 500 మంది, గురుస్వాముల ఆధ్వర్యంలో మరో 15వేల మంది భక్తులు దీక్షలు స్వీకరిస్తారని అంచనా. ఐదు రోజులు సాగే ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భవానీ దీక్ష మండపంలో ఆదివారం ఉదయం అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించి.. అనంతరం మండపారాధన, కలశస్థాపన చేస్తారు. ఆ తరువాత భవానీ దీక్షల స్వీకరణ ప్రారంభమవుతుంది. మాలధారణ అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్య వి.శివప్రసాద్ మాట్లాడుతూ దీక్షలు స్వీకరించే భక్తులకు నియమాలను తెలియజేస్తామని, వారి సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు.