Whiskers
-
అభినందన్ మీసకట్టుకు 50 శాతం డిస్కౌంట్
బొమ్మనహళ్లి : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మీసకట్టు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అనేక మంది యువత ఆయన తరహా మీసాలను ఇష్టపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం శత్రుదేశ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలెట్ అభినందన్ వర్ధమాన్ ధైర్య సాహసాలు, మీసాలు ఆయన స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి. బెంగళూరు యువతలో అభి మీసాల క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరహా మీసకట్టు కోసం క్షౌరశాలలకు వెళ్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నగరానికి చెందిన ఓ సేల్స్‌మెన్ చాంద్ మహ్మద్ అభినందన్ ఫ్యాన్‌గా మారిపోయాడు. దీంతో ఆయన లాగా మీసాలను సెట్ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ... అభినందన్ ధైర్య, సాహసం ఆయన మీసకట్టులోనే ఉందని, చివరకు పాక్ సైనికులు కూడా భయపడ్డారని అన్నారు. గతంలో బాలీవుడ్ హీరోల తరహాలో గడ్డం, మీసాలు ఉండేవని, ఇప్పుడు రియల్ హీరో అభినందన్ స్పూర్తితో ఆయన తరహా మీసకట్టు పెట్టుకున్నట్లు తెలిపారు. హెయిర్ సెలూన్ యజమాని సమీర్ ఖాన్ మాట్లాడుతూ... తన వద్దకు రోజు 15 మందికి పైగా యువత అభినందన్ మీసకట్టు చేయించుకుని వెళ్తున్నారని అన్నారు. అభినందన్ మీసకట్టు కోసం వచ్చే వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. -
మహా మీసం
తిక్క లెక్క ఫొటోలో కనిపిస్తున్న ఈ జర్మన్ మీసగాడి పేరు కార్ల్ హీన్జ్ హిల్లే. మూతిమీద మీసం మొలిచినప్పటి నుంచి మీసం మీద తెగ మక్కువ పెంచుకున్నాడు. అక్కడితో ఆగకుండా, ఏపుగా పెంచి, నిమ్మకాయలు నిలబెట్టే స్థాయిలో మెలితిప్పి, చక్కగా తీర్చిదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో ఎక్కడ మీసాలు గడ్డాల పోటీలు జరిగినా ఠంచనుగా హాజరయ్యేవాడు. ఈ మీసగాడి శ్రమ వృథా పోలేదు. 1999-2011 వరకు జరిగిన ప్రపంచస్థాయి మీసాలు, గడ్డాల పోటీల్లో ప్రతిఏటా విజేతగా నిలిచి బహుమతులు సాధించాడు. వాటితో పాటు అదనంగా మీసాలు, గడ్డాల పోటీల్లో అత్యధిక బహుమతులు సాధించినందుకు గిన్నెస్ రికార్డునూ దక్కించుకున్నాడు. -
మీసం మెలేసిన కొమురెల్లి
2 కార్లను 150 మీటర్లు లాగిన వైనం తొర్రూరు: వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొమురెల్లియాదవ్ తన మీసాలతో ఆదివారం రెండు మారుతీ కార్లను సుమారు 150 మీటర్ల దూరం వరకు లాగాడు. ఏదో సాధించాలనే తపనతో మీసాలు పెంచిన కొమురెల్లి పట్టణంలో లారీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మొదటిసారి గ్యాస్ సిలిండర్‌ను రెండు ఫీట్ల పైకి లేపాడు. ఏడాది తర్వాత మారుతీ కారును 100 మీటర్లు లాగాడు. తాజాగా వరంగల్- ఖమ్మం రహదారిపై రెండు కార్లను లాగాడు. ఈ సందర్భంగా ఎర్రబోయిన కొమురెల్లి మాట్లాడుతూ తన మీసంతో డీసీఎం, లారీలను లాగి తెలంగాణ నుంచి గిన్నిస్ రికార్డు సాధిస్తానని చెప్పాడు. రెండు కార్లను మీసంతో లాగే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు ప్రారంభించారు.