మీసం మెలేసిన కొమురెల్లి | Distance of 150 meters 2 cars with Whiskers moved | Sakshi
Sakshi News home page

మీసం మెలేసిన కొమురెల్లి

Aug 31 2015 3:41 AM | Updated on Sep 3 2017 8:25 AM

మీసం మెలేసిన కొమురెల్లి

మీసం మెలేసిన కొమురెల్లి

వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొమురెల్లియాదవ్ తన మీసాలతో ఆదివారం రెండు మారుతీ కార్లను..

2 కార్లను 150 మీటర్లు లాగిన వైనం
తొర్రూరు: వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొమురెల్లియాదవ్ తన మీసాలతో ఆదివారం రెండు మారుతీ కార్లను సుమారు 150 మీటర్ల దూరం వరకు లాగాడు. ఏదో సాధించాలనే తపనతో మీసాలు పెంచిన కొమురెల్లి పట్టణంలో లారీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మొదటిసారి గ్యాస్ సిలిండర్‌ను రెండు ఫీట్ల పైకి లేపాడు. ఏడాది తర్వాత మారుతీ కారును 100 మీటర్లు లాగాడు.

తాజాగా వరంగల్- ఖమ్మం రహదారిపై రెండు కార్లను లాగాడు. ఈ సందర్భంగా ఎర్రబోయిన కొమురెల్లి మాట్లాడుతూ తన మీసంతో డీసీఎం, లారీలను లాగి తెలంగాణ నుంచి గిన్నిస్ రికార్డు సాధిస్తానని చెప్పాడు. రెండు కార్లను మీసంతో లాగే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement