breaking news
WestBengal governor
-
బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం గవర్నర్ జగ్దీప్ ధన్కర్ బీజేపీ సభ్యుల నిరసనల మధ్య తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. కొత్తగాఎన్నికైనఅసెంబ్లీలో గవర్నర్ ధన్కర్ ప్రసంగం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలైంది. ప్రసంగంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల ప్రస్తావన లేదంటూ ప్రధాన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని, నినాదాలకు దిగారు. ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరటంతో ఆయన 2.04 గంటలకు ప్రసంగాన్ని ఆపేసి, బయటకు వెళ్లిపో యారు. అనంతరం ప్రతిపక్ష నేత సువేందు అధికా రి మీడియాతో మాట్లాడుతూ..మరో మార్గం లేకనే ఆందోళనకు తాము దిగాల్సి వచ్చిందంటూ గవర్నర్ ప్రసంగ పాఠం ఉన్న ప్రతులను చూపారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై ఎలాం టి హింస, అత్యాచారం, దాడి జరగలేదంటూ అధికార టీఎంసీ చెప్పుకుంటోంది. నిజాలను దాచిపెడుతోంది. అందుకే, నిరసన తెలిపాం’అని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోసువేందు అధికారితో భేటీ అయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను తొలగించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం ప్రధానిమోదీకి లేఖ రాసింది. -
పశ్చిమబెంగాల్ గవర్నర్ రాజీనామా
-
పశ్చిమబెంగాల్ గవర్నర్ రాజీనామా
కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తన పదవికి రాజీనామా చేశారు. జాతీయ భద్రత సలహాదారుగా పనిచేసని నారాయణన్ యూపీఏ హయాంలో గవర్నర్గా నియమితులయ్యారు. గత కొంతకాలంగా ఆయన రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వంలో నియమితులైన గవర్నర్లు వైదొలగాలని చేయాలని కేంద్ర హోం శాఖ సూచించడంతో నారాయణన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో సీబీఐ ఇటీవల ఆయనను ప్రశ్నించింది. యూపీఏ ప్రభుత్వం నియమించిన కొందరు గవర్నర్లు ఇటీవల వైదొలగగా, మరికొందరు రాజీనామా చేసే అవకాశముంది.