breaking news
West Sumatra
-
సుమత్రా స్టైల్లో జల్లికట్టు.. ఎవరినీ విజేతగా ప్రకటించరు!
ఆ బురద, అందులో పరుగెత్తుతున్న ఎడ్లు, చుట్టూ జనాలను చూస్తుంటే ఇదేదో జల్లికట్టు పోటీలాగుందే.. అనిపిస్తోంది కదా. అవును అలాంటిదే. అయితే జరిగింది మాత్రం ఇండోనేసియాలోని పశ్చిమ సుమత్రాలో. ఆట పేరు ‘పాకు జావి’. కరోనా వల్ల ఆగిన ఈ క్రీడకు మళ్లీ అక్కడి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ నెలలో పోటీలు మొదలయ్యాయి. అక్కడి తనహ్ దాతర్ ప్రాంతంలో ఏటా వరి కోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఓ వరిపొలంలో దాదాపు 60 నుంచి 250 మీటర్ల మేర బురద ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు. రెండు ఎడ్లను ఓ నాగలికి కట్టి దానిపై ఎడ్లను నడిపే వ్యక్తి నిలబడతాడు. కింద పడకుండా ఎడ్ల తోకలను పట్టుకుంటాడు. పేరుకే ఇది ఎద్దుల పోటీ అయినా ఇందులో నేరుగా ఎద్దులేమీ పోటీ పడవు. ఎవరినీ విజేతగా ప్రకటించరు. (చదవండి: పెంపుడు పంది కోసం న్యాయపోరాటం) అయితే ఆ పోటీని చూడటానికి వచ్చిన వాళ్లు ఎడ్ల వేగం, సామర్థ్యం లెక్కగట్టి వాటిని సాధారణం కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. తనహ్ దాతర్ ప్రాంతంలోని ప్రజలు ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా సర్కారు మద్దతుతో ఈ ఆటను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా వస్తున్నారు. (క్లిక్: వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’) -
ఇండోనేషియాలో మళ్లీ భూకంపం
జకార్తా : ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం పశ్చిమ సుమత్ర దీవుల్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు అయింది. ఈ మేరకు ఆ దేశ వాతావరణ, భూవిజ్ఞాన సంస్థ వెల్లడించింది. ఇండోనేషియా రాజధాని జకార్తాకు నైరుతీ ప్రాంతంలోని మెంట్వాయి ద్వీపంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఇండోనేషియాలో బుధవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదు అయిన విషయం విదితమే.