breaking news
wesley college
-
హాస్టల్ నుంచి విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని కనిపించకుండాపోయిన ఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలానికి చెందిన ఎ.శ్రావణి (18) సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతూ కళాశాల ఆవరణలోని హాస్టల్ ఉంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ బ్యాగుతో సహా కాలేజీ నుంచి బయటికి వెళ్లిన శ్రావణి తిరిగి హాస్టల్‌కు రాలేదు. తల్లిదండ్రులకు సమాచారం అందించిన నిర్వాహకులు ఎటువంటి జాడ తెలియకపోవటంతో శుక్రవారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అలరించిన వెస్లీకాలేజీ ఫెయిర్‌వెల్ షో
హైదరాబాద్ సిటీ : జానపదం, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ లోని వెస్లీ బాలికల జూనియర్ కళాశాల ఉర్రూతలూగింది. శుక్రవారం నిర్వహించిన ఫెయిర్‌వెల్ పార్టీ కార్యక్రమం సందర్శకులను ఆద్యంతం అలరించింది. వెస్లీ జూనియర్ కళాశాల సీనియర్ బాలికలకు జూనియర్స్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నృత్యాలు, క్యాట్‌వాక్ జరుగుతున్నంత సేపు కళాశాల ఆడిటోరియం సహా విద్యార్థినుల కేరింతలు, చప్పట్లతో మార్మోగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రిసిల్లా సుహాసిని మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఫెయిర్‌వెల్ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వెస్లీ కాలేజీతో ఉదయ్ కిరణ్ స్మృతులు