breaking news
weight effect
-
ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..!
వెయిట్ లాస్ జర్నీలలో చాలామంది తమ కిష్టమైన హాబీలతోనూ..ఇతరులను స్ఫూర్తిగా చేసుకుని తగ్గారు. కొందరూ ప్రోటీన్ డైట్ ఫాలో అయితే..మరికొందరు అనారోగ్య భయంతో బరువు తగ్గారు. కానీ ఈ న్యూట్రిషన్ కోచ్ తాను ఎందువల్ల బరువు పెరిగానో కారణాలను విశ్లేషించి ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ బరువు తగ్గింది. పైగా తనలా ఎవ్వరూ ఆ తప్పులు చెయ్యొద్దని, దాని వల్ల కలిగే అనర్థాలేంటో వివరిస్తూ..ప్రేరణగా నిలిచింది. ఆమె కొన్ని నెల్లల్లోనే స్లిమ్‌గా మారి బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించింది. ISS సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్ కోచ్ రక్షా భలవి ఒకప్పుడామె దాదాపు వంద కిలోలు పైనే బరువు ఉండేది. ఊబకాయం సమస్యతో చర్మం, జుట్టు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం ఆమెకున్న జంక్‌ఫుడ్ వ్యనసం. దాదాపు ప్రతిరోజు చిప్స్, చాక్లెట్లు లేకుండా ఆమె రోజు ఉండేది కాదు. అలా ఆమె 116 కిలోలు బరువుతో ఇబ్బందులు పడింది. తన ఆకృతి కారణంగా ఎదుర్కొన్న బాడీ షేమింగ్లు, మరోవైపు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలతో బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఎలాంటి క్రాష్డైట్లు జోలికిపోకుండా పోషకాహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. ముందుగా ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ.. తన బరువులో వస్తున్న మార్పులను గమనించింది. అలాగే తాను స్కూల్ డేస్‌లో మధ్యాహ్న భోజనానికి పరాఠాలు తినడంతో ఎలా తాను బరువు పెరిగింది అర్థం చేసుకుంది. దానిలో ఉండే అధిక కార్బ్, అధిక కొవ్వు గలిగిన ఆహారం బొడ్డు కొవ్వుకు కారణమవుతుందని తెలుసుకుంది. అందుకనే తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సమతుల్య ఆహారాలకే పెద్దపీటవేసి..ఫైబర్ కోసం పండ్లు, ప్రోటీన్ కోసం గుడ్లు లేదా పనీర్, కార్బ్ల కోసం గోధుమ రోటీ లేదా బ్రెడ్ వంటివి తీసుకునేది. అలాగే తాను చదువుతున్నప్పుడూ బాగా ఒత్తిడికి గురయ్యేది. అందువల్ల తాను తెలియకుండా ఎలా ఎక్కువగా ఫుడ్ తీసుకుందో కూడా చెప్పుకొచ్చింది రక్ష. అలాగే అధిక ఉప్పు, చక్కెరతో ఉండే స్నాక్స్‌కి దూరంగా ఉండేది. వాటి బదులు మఖానా, తాజా పండ్లతో స్నాక్స్‌ని భర్తీ చేసింది. అలాగే రోజంతా శారీరక శ్రమ లేకుండా ఉండటాన్ని నివారించింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని.. ఆటలు లేదా వ్యాయామాలకు సమయం కేటాయిస్తూ..మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చూసుకునేది. చివరగా తాను చెడ్డ ఆహారపు అలవాట్ల వల్లే బరువు పెరుగుతున్నానని చాలా ఆలస్యంగా గ్రహించానని, తనలా మరెవ్వరూ చెయ్యొద్దని సూచిస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తి శాకాహారి. అలాగే తన డైట్‌ప్లాన్‌ని కూడా షేర్ చేసుకున్నారామె.(చదవండి: Nozempic Diet: 130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే..)ఆ కోచ్ ఏమి తీసుకునేదంటే..ఉదయం: చియా సీడ్ నీరువ్యాయామం చేయడానికి ముందు: 7 నానబెట్టిన బాదం, 10 గ్రా వేరుశెనగ వ్యాయామం తర్వాత: ప్రోటీన్ పౌడర్ పానీయం (1 స్కూప్), 1 గిన్నె మస్క్మెలోన్ భోజనం: స్టైర్-ఫ్రైడ్ క్యాప్సికమ్‌తో గిన్నె క్వినోవా టోఫురాత్రి భోజనం: 2 బేసన్ చీలాస్, 1 కప్పు పప్పు, 100 గ్రా క్యాబేజీ సబ్జీ, 1 ప్లేట్ దోసకాయ-క్యారెట్ సలాడ్, 30 గ్రా కాల్చిన సోయా ముక్కలు View this post on Instagram A post shared by Raksha Bhalavi | Nutrition & Weight Loss Coach (@fitwithraksha_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!) -
పొట్ట రాకూడదా? పొట్టు తియ్యద్దు మరి!
పొట్టు తీయని ధాన్యాల (హోల్ గ్రేయిన్స్)లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. ఈ పొట్టు కారణంగానే అవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే వాటిల్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్లు రక్తంలో నెమ్మదిగా కలుస్తుంటాయి. ఫలితంగా ఒంట్లోకి విడుదలయ్యే చక్కెర మోతాదులూ ఆలస్యమవుతాయి. పొట్టుతీయని వరి విషయంలో ముడి బియ్యం మాదిరిగానే పొట్టు తీయని ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని అలాగే తీసుకోవడం వల్ల పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువగా బరువు పెరుగుతారని, అందువల్ల ఇన్సులిన్ విడుదల యంత్రాంగం కూడా నియంత్రితంగా పనిచేస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. ∙ఇలా తినడం వల్ల ఊబకాయం తగ్గడంతో ΄ాటు స్థూలకాయంతో వచ్చే అనేక అనర్థాలనూ తగ్గించుకోవచ్చన్నది పరిశోధకుల మాట. -
బరువు తగ్గడం..అంత బరువేం కాదు!
కొంతమంది శరీరతత్వాన్ని బట్టి బరువు పెరగడం, తగ్గడమనేది పెద్ద టాస్కే. మంచి పౌష్టికాహారం, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇందుకు చాలా మంది సినీ తారలు కూడా నిదర్శనం. నిత్యం యోగా చేసే సినీతారలు, తదితర వంటి సెలబ్రిటీలే ఇంత కష్టపడుతుంటే.. మనలాంటి సామాన్యులు బరువు తగ్గడం సాధ్యమేనా అని నిరాశ పడొద్దు. బిజీ లైఫ్ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం చిక్కదు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగ పడవచ్చు. స్పీడ్‌గా బరువు తగ్గాలంటే.. మంచి నీటిని తరచు తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. 12 వారాలపాటు చేసిన ఓ అధ్యయనంలో భోజనానికి ముందు నీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతార ని తేలింది. అలాగే కంటినిండా నిద్ర పోయినా బరువు తగ్గతారని పరిశోధనలో తేలింది టీవి చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూ కూడా తిన్న బరువు పెరుగుతారట. ఇలాంటి అలవాటును మానుకునే యత్నం చేసినా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ మూడు టెక్నిక్‌లు ఫాలో అయితే స్పీడ్‌గా బరువు తగ్గొచ్చు ఈజీగా బరువు తగ్గేందుకు ఏం చేయాలో..ఏం చేయకూడదో చూద్దాం. ఆహారాన్ని కంగారుగా తినకూడదు. నెమ్మదిగా నమిలి తినాలి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. నెమ్మదిగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. మీరు రోజూ తీసుకొనే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి. జీఎల్పీ–1, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రొటీన్లు ప్రభావం చూపడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తియ్యని శీతలపానీయల జోలికి వెళ్లొద్దు. సోడా కలిగిన డ్రింక్స్ వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. కంటి నిండా నిద్రలేకపోయినా సరే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక రుగ్మతలు వస్తాయి. యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, చికెన్ బ్రెస్ట్, చేపలు, ఆల్మండ్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. మొక్కల నుంచి లభించే విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. బీన్స్, ఓట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్ ఉంటుంది. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. కంచం నిండుగా భోజనం చేస్తే బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతారు. ఆకలి వేసినప్పుడు మధ్య మధ్యలో బాదం తదితర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు.ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు కాబట్టి తింటున్నా అన్న భావనతో తినడం మంచిది. (చదవండి: ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?) -
బరువు తగ్గకపోవడానికి కారణం ఇదా?
ఒక్కోసారి లేనిపోని వందంతులతో అసలు విషయాలు మరుగున పడిపోతుంటాయి. సంబంధిత వ్యక్తులు చెబితే గానీ నిజాలు నిగ్గుతేలవు. నటి అనుష్కది ఇదే పరిస్థితి. ఈ తరం నటీమణుల్లో కథానాయకి ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నటి అనుష్క అని చెప్పవచ్చు. అరుంధతి చిత్రం ఆ తరహా చిత్రాలకు దారి చూపింది. కాగా అనుష్క అలా నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ఇంజిఇడుప్పళగి తెలుగులో జీరోసైజ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అనుష్క తన బరువును 80 కిలోలకు పైగా పెంచుకుని నటించి త్యాగం చేసిందనే చెప్పాలి. అంత కష్టపడి నటించినా ఫలితం దక్కలేదు. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. అంతే కాదు తదుపరి నటించాల్సిన బాహుబలి చిత్రంపై అనుష్క బరువు ఎఫెక్ట్ పడింది. అయినా ఈ యోగా సుందరి బరువు తగ్గడానికి శాయశక్తులా ప్రయత్నించి కాస్త తగ్గారట. అయితే పూర్తి నాజూగ్గా మారలేకపోయారు. దీనికి కారణం ఇంజిఇడుప్పళగి చిత్రం అనే ప్రచారం జరిగింది. అంతే కాదు బాహుబలి–2లో అనుష్కను అందంగా చూపడానికి ఆ చిత్ర దర్శకుడు అధికంగా వీఎఫ్ఎక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవలసి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ విషయం అలా ఉంచితే అనుష్క బరువు తగ్గలేకపోవడానికి అసలు నిజం వేరే ఉందట. దీని గురించి అనుష్క పెదవి విప్పారు. ఆమె తెలుపుతూ తనకు బరువు పెరగడం, తగ్గడం పెద్ద సమస్య కాదన్నారు. ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జరిగిందని చెప్పారు. అదే విధంగా బాహుబలి–2 చిత్రం కోసం చాలా వరకు బరువు తగ్గానని, అయితే సింగం–3 చిత్ర షూటింగ్ సమయంలో అనుకోకుండా విపత్తుకు గురవడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడి బరువు తగ్గడానికి యోగా, కసరత్తులు చేయలేకపోయానన్నారు. ప్రస్తుతం మళ్లీ శారీరక వ్యాయామం లాంటి కసరత్తులు చేస్తున్నానని, త్వరలోనే తనను స్లిమ్‌గా చూస్తారని అనుష్క పేర్కొన్నారు.