breaking news
Weapons import
-
సవాళ్లను ఎదుర్కొనేవాళ్లకే భవిష్యత్తు
అమెరికాతో ఆయుధ కొనుగోళ్ల ఒప్పందం ముగిసిన నెల రోజుల్లోనే మళ్ళీ అదే పని మీద మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. జూలై 14న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్ మెక్రాన్‌తో 26 రఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్, మూడు స్కార్పియన్ డీజిల్ –ఎలక్ట్రిక్ సబ్ మెరైన్స్ కొనుగోలుకు ఒప్పందం జరిగింది. భారత ప్రభుత్వం వీటిని మన నౌకాదళం (నేవీ) అవసరాల కోసం సమకూర్చుకో బోతున్నది. యుద్ధ సమయంలో వినియోగించే డాక్ షిప్స్ ‘ల్యాండింగ్ ఫ్లాట్ ఫారమ్స్’ నిర్మాణానికి, ఫ్రాన్స్ తరఫున – ‘ఎల్ అండ్ టీ’, ఇక్కడ మన విశాఖపట్టణం ‘హిందుస్థాన్ షిప్‌యార్డ్’ రెండూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండు దేశాల పర్యటనల్లో కొన్ని ఇతర అంశాలు ఉన్నప్పటికీ, ఈ దేశాలతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు ఇక్కడ ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. గత నెల 20–24 తేదీల్లో జరిగిన మన ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో అమెరికాకు చెందిన ‘జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ’, మన ‘హెచ్ఏఎల్’తో కలిసి– ఫైటర్ జెట్స్ తయారీకీ, మన సముద్ర తీరంలో వినియోగానికీ 3 బిలియన్ డాలర్ల వ్యయంతో 31 ‘సీ– గార్డియన్ డ్రోన్స్’ కొనడా నికీ ఒప్పందం కుదిరింది. ‘ఇండో–పసిఫిక్’ రీజియన్ (ఇది మన దేశం చుట్టూ ఉంది) సముద్ర జలాల్లో అమెరికా యుద్ధనౌకలు ఉన్నప్పుడు– వాటి సర్వీస్, మరమ్మత్తులు మనదేశంలోని ‘కట్టు పల్లి’ షిప్ యార్డ్ (చెన్నై), ‘మెజగాంవ్’ డాక్ (ముంబై), ‘గోవా’ షిప్ యార్డ్‌లలో చేయడానికి అమెరికాతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు సముద్ర జలాలతో ముడిపడినవి కావడంతో, మున్ముందు ఇందుకు సంబంధించిన పర్యవసానాలు, ఇండి యాలో రెండవ పెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రంగా ఏపీని అవి నేరుగా తాకే అంశం. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే సముద్రం మీద నుంచి ఉగ్రదాడి జరిగితే ఎలా స్పందించాలనే మాక్ డ్రిల్ తూర్పు నౌకాదళం, మెరైన్ పోలీసులూ కలిసి ఏపీ తీరంలో నిర్వహించారనే వార్త రావడం ఇక్కడ గమనార్హం. అంతర్జాతీయ సంబంధాలలోకి ‘జియో–పాలిటిక్స్’ వచ్చాక, మారిన కొత్త దృశ్యం ఇప్పుడు అన్ని ఆసియా దేశాల్లో కనిపి స్తున్నది. పదేళ్ల వెనక్కి వెళితే అప్పటి పరిస్థితి ఏమిటి? 2013 జనవరి 1న అమెరికా న్యూస్ ఏజెన్సీ– ‘రాయిటర్’ కాలమిస్ట్ ‘జిమ్ ఉల్ఫ్’ ఆసక్తికరమైన వ్యాసం రాశారు. అందులో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా– ‘ఇండో–పసిఫిక్’ విషయంలో తీసు కున్న వైఖరితో– ‘మన పరిశ్రమలకు మంచి రోజులు రాబోతు న్నాయి; చైనా రక్షణ వ్యయం కారణంగా అమెరికా ఆయుధాల వ్యాపారం ఆగ్నేయ – ఆసియాలో పెరగనుంది’ అని అమెరికా ‘ఏరో స్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ వైస్–ప్రెసిడెంట్ ‘ప్రైడ్ డౌనీ’ అన్నట్టుగా ఆ కాలమిస్ట్ రాశారు. సరే 21వ శతాబ్ది నాటికి ‘జియో పాలిటిక్స్’ కీలకమైంది. మనం ఒకందుకు వాళ్లొకందుకు అన్నట్టుగా సాగిన ఈ వ్యవహా రంలో, ఎప్పుడెతే అమెరికాతోపాటు యూరప్‌లోని అగ్రదేశాల విదేశాంగ విధానం– ‘ఇండో–పసిఫిక్’ కేంద్రితం అయిందో; అప్పట్లోనే అంటే యూపీఏ –2 నాటికే ‘రీ మ్యాపింగ్ ఇండియా’ అవసరం మనకు అనివార్యం అయింది. గడచిన రెండు దశాబ్దాల పరిణామాలు చూశాక, జూన్ రెండవ వారంలో సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ హోం శాఖ సహాయమంత్రి సీహెచ్ విద్యాసాగరరావు–‘డా‘‘ అంబేడ్కర్ చెప్పినట్టుగా హైదరాబాద్‌ను ఇండియాకు రెండవ రాజధాని చేయాలి’ అని కోరడాన్ని మన దేశం– ‘రీ మ్యాపింగ్’ అవస రాలకు అదనపు కొనసాగింపుగా చూడాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఆగ్నేయ–ఆసియా అవసరాలు దృష్ట్యా ఢిల్లీ పర్యవేక్షణ దక్షిణ కేంద్రితంగా ఉండాల్సిన అవసరం కనుక ఏర్పడితే, దేశీయంగా కూడా ‘జియో–పాలిటిక్స్’ వైఖరి ప్రయోజనకరం కావొచ్చు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ భవన సముదాయం అందుకు ధీటైన తోడ్పాటు అవుతుంది. జనరల్ ఎన్నికలకు సమీపాన ఇప్పుడు మనం చూస్తున్నవి విజయాలు అనిపిస్తే, ఇదేదో ప్రధాని నరేంద్ర మోదీ, తీరాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభావం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఒకానొక కాలం నాటికి ఎలా పరిణమించాయి అనేది ఇక్కడ ప్రధానం. అప్పటికి అక్కడ వాటిని ఎదుర్కోవలసిన ప్రభుత్వాలు ఏ మేరకు మారినా – ‘జియో–పొలిటికల్’ వేడిని తట్టుకోవడానికి తగినంత సంసిద్ధత ఏ మేరకు ఉంది? అనేదే ఇక్కడ ప్రధానం. ఎందుకంటే... ప్రజలు, ప్రాంతం, సార్వభౌమత్వం అనే ‘రాజ్యం’ ఉపాంగాల భద్రత కోసం కాలానుగుణంగా ‘ప్రభుత్వం’ తనను తాను ‘రీ–మ్యాపింగ్’ చేసుకోవలసి ఉంటుంది. ఇటువంటి అవసరం పడిన తర్వాత, మన వద్ద మొదట 2014లో రాష్ట్ర విభజన రూపంలో జరిగితే, సూక్ష్మస్థాయిలో మరోసారి అది 2022లో కొత్త జిల్లాల ఏర్పాటుగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎమ్ఓ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం తరచూ అంటూఉండే – ‘కోర్స్ కరెక్షన్’ ప్రక్రియను మన మారబోయే అవసరా లకు íసిద్ధంగా ఉండటంగా చూడాల్సి ఉంటుంది. పదేళ్ల విభజన తర్వాత, జరగనున్న జనరల్ ఎన్నికల్లో ప్రజల ఎంపిక ఎలా ఉండాలి? అన్నప్పుడు మన రాష్ట్రం సరిహద్దుల్లో వేగంగా మారుతున్న ‘గ్లోబల్’ పరిణామాలను ఎదుర్కోవడానికి పటిష్ఠమైన ‘గవర్నెన్స్’తో సిద్ధమవుతున్నది ఎవరు? అనేదే కొలమానం. -జాన్సన్ చోరగుడి , వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దిగుమతులపై నిషేధం- డిఫెన్స్ షేర్ల హవా
ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర రక్షణ శాఖ వివిధ డిఫెన్స్ పరికరాల దిగుమతులపై దృష్టి పెట్టింది. తద్వారా 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధానికి తెరతీసింది. 2020 ముసాయిదా విధానం కింద వారాంతాన 101 ప్రొడక్టులతో కూడిన జాబితాను రూపొందించింది. ఆయుధాలు, విభిన్న పరికరాలు తదితర 101 ప్రొడక్టులపై రక్షణ శాఖ దశలవారీగా నిషేధాన్ని విధించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వీటిలో చాల ప్రొడక్టులను దేశీయంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2020-2024 మధ్యకాలంలో దశలవారీగా పలు ప్రొడక్టుల దిగుమతులను నిషేధించే యోచనలో ప్రభుత్వమున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీ కంపెనీలు సొంత డిజైన్, తయారీ సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకునే వీలు చిక్కనున్నట్లు వివరించాయి. కాగా.. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ఆయుధాల తయారీకి వీలుగా రానున్న 6-7ఏళ్లలో రూ. 4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులకు అవకాశమున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహం లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగ సంబంధిత కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్ఏఎల్ దూకుడు రక్షణ రంగ పరికరాల దిగుమతులపై నిషేధ వార్తలతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ షేరు 11.5 శాతం దూసుకెళ్లి రూ. 1058ను తాకింది. డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ 5.2 శాతం పెరిగి రూ. 963 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో డైనమాటిక్ టెక్నాలజీస్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ. 596 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదేవిధంగా వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ 5 శాతం ఎగసి రూ. 55 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో భారత్ ఎలక్ట్రానిక్స్ దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 108 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఫోర్జ్ దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 423ను తాకగా.. మిశ్రధాతు నిగమ్(మిధానీ) 4 శాతం పెరిగి రూ. 213కు చేరింది. ఇక ఆస్ట్రా మైక్రోవేవ్ 5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద, భారత్ డైనమిక్స్ 5.2 శాతం పురోగమించి రూ. 441 వద్ద ట్రేడవుతున్నాయి. -
ఆ విధంగా దగ్గరవుతోన్న చైనా- పాక్
ఇస్లామాబాద్: ఓవైపు బలూచిస్టాన్ ప్రాంతంలో ఆర్థిక కారిడార్ నిర్మించాలనుకుంటున్న చైనా.. పాకిస్థాన్ తో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రక్షణ రంగ సహకారంలో భాగంగా మంగళవారం పాక్ ఎనిమిది చైనీస్ జలాంతర్గాముల దిగుమతికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 34 వేల కోట్లు. 2028 నాటికి మెత్తం ఎనిమిది చైనీస్ సబ్ మెరైన్లు పాక్ నౌకాదళంలో చేరనున్నాయి. పాక్ జలాంతర్గాముల ప్రాజెక్టు అధిపతితో పాటు సీనియర్ నౌకాదళ అధికారులు ఆగస్టు 26న జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఒప్పించినట్లు పాక్ జాతీయ మీడియా వెల్లడించింది. మరో విశేషం ఏమంటే పాకిస్థాన్ కు అతి తక్కువ వడ్డీపై దీర్ఘకాలిక రుణం మంజూరు చేసేమరీ చైనా ఈ జలాంతర్గాములను అమ్ముతోంది. అయితే ఏ రకం జలాంతర్గాములపై ఒప్పందం చేసుకున్నారనే విషయాన్ని ఇరుదేశాలు రహస్యంగా ఉంచాయి. ప్రచారంలో ఉన్నట్లుగా టైప్ 039, టైప్ 041 యువాన్ తరగతికి చెందిన ఎటాక్ సబ్‌మెరైన్స్‌ను అందజేసే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.