breaking news
Water strikes
-
‘కరువుపై పోరు’ ధర్నాకు సంఘీభావంగా ర్యాలీ
కడప కార్పొరేషన్: ‘కరువుపై పోరు’ పేరుతో కడప కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు కడప అసెంబ్లీ యూత్ వింగ్ ఇన్చార్జి దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్, మీదుగా కొత్త కలెక్టరేట్ వద్ద ధర్నా శిబిరానికి చేరింది. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ కమలాపురంలో కరువును పారదోలడానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఆయన పోరాట ఫలితంగానే సర్వరాయ సాగర్‌కు నీరు విడుదలయ్యాయని, ఇప్పుడు పాపాఘ్నినదికి నీటి విడుదల కోసం చేస్తున్న ధర్నాకు తమ వంతు తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు ఆదర్శ్‌రెడ్డి, యువజన నాయకులు శ్రీకాంత్, ప్రశాంత్, రాజా,జావీద్, కన్నా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
జలం..గళం!
వైఎస్ జగన్‌కు మద్దతుగా మండల కేంద్రాల్లో జలదీక్షలు తెలంగాణ అక్రమ {పాజెక్టులపై నేతల ధ్వజం పలుచోట్ల వర్షంలోనూ కొనసాగిన నిరసన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై భగ్గుమన్న వైఎస్ఆర్ సీపీ శ్రేణులు జలం కోసం జనం గళం విప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు, నేతలు, రైతులు మద్దతుగా నిలిచారు. అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు మంగళవారం జల దీక్షలు నిర్వహించారు. ఉదయం ఉంచి సాయంత్రం వరకూ దీక్షా శిబిరాలు నిరసన నినాదాలతో హోరెత్తాయి. పలు మండలాల్లో ఈ దీక్షలు వర్షంలోనూ కొనసాగాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తిరుపతి: తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి కర్నూలులో జలదీక్ష చేపట్టిన విషయం విదితమే. ప్రతిపక్షనేతకు మద్దతుగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఒకట్రెండు మండలాల్లో మినహా మిగతా అన్ని చోట్లా రోజంతా దీక్షలు కొనసాగాయి. బంగారుపాళ్యం మండల కేంద్రంలో జరిగిన నిరసన దీక్షలో పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎం.సునీల్‌కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఖండించారు. ఇదే నియోజకవర్గంలోని యాదమరిలో జరిగిన దీక్షల్లో ఆ పార్టీ మండల నేత ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. తవణంపల్లి, ఐరాల మండల కేంద్రాల్లోనూ పార్టీ నేతలు దీక్షలు నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనంలో జరిగిన దీక్షలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, వరదయ్యపాళ్యంలో నాయుడు దయాకర్‌రెడ్డి, బుచ్చినాయుడుకండ్రిగలో పార్టీ నేత గోపి పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కేశవులు, చంద్ర గిరిలో మైనారిటీ సెల్ నేత మస్తాన్, పాకాలలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు విక్రంరెడ్డి, సహదేవరెడ్డి పాల్గొన్నారు. పీలేరులో నారే వెంకట రమణారెడ్డి, కేవీ పల్లిలో జెడ్పీటీసీ జయరామచంద్రయ్య, మండల పార్టీ కన్వీనర్ వెంకట రమణారెడ్డి, గుర్రంకొండలో ఎంపీపీ నక్కా చంద్ర శేఖర్, వాల్మీకిపురంలో ఎంపీపీ శ్రీవల్లి దీక్షల్లో పాల్గొన్నారు. పుంగనూరులో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డప్ప పాల్గొన్నారు. పలమనేరులో పార్టీ కన్వీనర్ హేమంత్‌కుమార్‌రెడ్డి, మండల పార్టీ నేత బాలాజీ నాయుడు, వీకోట మండలంలో బాలగురునాథ్, బెరైడ్డిపల్లిలో పార్టీనేత కేశవులు, రాష్ట్ర కార్యదర్శి కిషోర్గౌడ దీక్షలను నిర్వహించారు. గంగాధర నెల్లూరు, పుత్తూరు, నగరిల్లోనూ దీక్షలు హోరెత్తాయి. పుత్తూరులో పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అమ్ములు, నగరిలో మున్సిపల్ చైర్మన్ శాంతి, వడమాలపేటలో జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, నిండ్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిలు పాల్గొన్నారు. మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా చేపట్టిన జల దీక్షలో పార్టీ నాయకులు దేశాయ్ జయదేవరెడ్డి, ఎంపీపీ సుజన బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వర్షంలోనూ.. జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, నగరి, చంద్రగిరి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది. అయినప్పటికీ పార్టీ నేతలు జలదీక్షలను కొనసాగించారు.