breaking news
water fight
-
నీటిలో డిష్యుం డిష్యుం
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటికే తొలి షెడ్యూల్లో షిప్లో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు కొరటాల శివ. తాజాగా ‘దేవర’లో కీలకంగా ఉండే మరో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని ఆరంభించారని టాక్. పూర్తిగా నీటిలో సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని భోగట్టా. దాదాపు 20 రోజుల పాటు ఈ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చేందుకు ఎన్టీఆర్ మూడు రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ఫైట్ మాస్టర్ కింగ్ సోలొమన్ ఈ సీక్వెన్స్‌ని డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
జల జగడం
- కృష్ణా జలాలను తరలించేందుకు వైఎస్సాఆర్ కడప జిల్లా రైతుల యత్నం - అడ్డుకున్న యల్లనూరు రైతులు యల్లనూరు : నీటి కోసం అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల రైతుల మధ్య వివాదం రాజుకుంది. గండికోట ఎత్తి పోతల పథకం నుంచి యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువుల ద్వారా గోడ్డుమర్రి ఆనకట్ట మీదుగా కృష్ణా జలాలను పార్నపల్లి రిజర్వాయర్‌కు పంపింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువులకు పంపింగ్ చేస్తున్నారు. అయితే గోడ్డుమర్రి ఆనకట్ట పనులతో పాటు పంప్ హౌస్ పనులు అసంపూర్తిగా ఉండటంతో నీటిని గడ్డంవారిపల్లి చెరువు నుంచి చిత్రావతి నదికి మళ్లించారు. అయితే వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలంలోని రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామల రైతులు తమ గ్రామాలకు సమీపంలో ఉన్న చిత్రావతి నదిలోకి నీటిని మళ్లించుకునేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. యల్లనూరు చెరువు తూముకు అడ్డుగా ఇసుక మూటలను వేయడంపై వివాదం చెలరేగింది. నీటిని మళ్లించడం కోసం ప్రయత్నించారని తెలుసుకున్న యల్లనూరు రైతులు మంగళవారం ఉదయం ఇసుక మూటలను తొలగించారు. అధికారులు తమకు హామీ ఇచ్చారంటూ రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామాల రైతులు పోలీసుల సహకారంతో మరోమారు యల్లనూరు చెరువు వద్ద నీటిని వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని మంగళవారం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న యల్లనూరు మండల ప్రజలు చెరువు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనా«ధ్‌రెడ్డి, డీఈ ఆనందరావు అక్కడి చెరుకోని యల్లనూరు మండల రైతులతో చర్చించారు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.