breaking news
Warangal agency
-
బస్సుల బంద్..
వాజేడు : ఏజెన్సీలో రవాణా వసతులపై అధికారులు, పాలకులు శీతకన్ను వేస్తున్నారు. వివిధ అవసరాల కోసం పల్లెల్లోని ప్రజలు పలు ప్రాంతాలకు ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే 21 రోజులుగా వాజేడు మండలానికి బస్సులు రావడం లేదు. మార్చి 2న ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేడ్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటన తర్వాత బస్సులను నిలిపివేసినట్లు తెలిసింది. మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకుంటారేమోననే కోణంలో బస్సులను నిలిపివేసి ఉంటారని ఈ ప్రాంత ప్రజలు భావించారు. మావోయిస్టుల బంద్ తర్వాత బస్సులను పునరుద్ధరిస్తారని ఆశించారు. కానీ ఇప్పటివరకు బస్సులను నడుపకపోవడంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. వాజేడు మండలంలో 26 వేల మంది జనాభా ఉంది. వీరంతా ప్రతీ అవసరానికి వెంకటాపురం, భద్రాచలం, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. అయితే 21 రోజులుగా బస్సులు రాకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిచక తప్పడం లేదు. ఏడు బస్సులు రద్దు.. భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి గతంలో 25 బస్సులు నడిచేవి. వాటిలో కొన్ని సర్వీసులను అప్పట్లోనే రద్దు చేసి.. ఎనిమిదికి కుదించారు. ఆ ఎనిమిదిలోనూ ప్రస్తుతం కేవలం ఒక్క రాజమండ్రి సర్వీసును మాత్రమే నడుపుతున్నారు. 21 రోజులుగా మిగతా ఏడు బస్సులు వాజేడు మండలానికి రావడంలేదు. దీంతో మండల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భద్రత దృష్ట్యా బస్సులను నిలిపివేసినా.. ప్రజల సౌకర్యార్థం రాత్రి వేళల్లో తిరిగే సర్వీసులను రద్దు చేసి పగటి పూట సర్వీసులను కొనసాగించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాజమండ్రి సర్వీస్‌ను కూడా సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుపుతుడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం మూడు బస్సులే.. వాజేడు మండలానికి కేవలం మూడు బస్సులు మాత్రమే వస్తున్నాయి. ఒకటి భద్రాచలం డిపోకు చెందిన రాజమండ్రి పేరూరు సర్వీసు కాగా వరంగల్ డిపోకు చెందిన పేరూరు, వాజేడు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మూడు సర్వీసులకే వాజేడు మండలం పరిమితమయ్యాయి. ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు అసలే పరీక్షల కాలం.. సరైన రవాణా సౌకర్యాం లేక విద్యార్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో సంవత్సరమంతా కష్టపడి చదివి సమయానికి కేంద్రానికి చేరుకోలేక పరీక్షను సరిగా రాయలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు ఆటోలు ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ వాహనాలతో జేబులకు చిల్లు పడుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో వాజేడు, వెంకటాపురం ఉన్నప్పుడు భద్రాచలం నుంచి ఎక్కువ సంఖ్యలో బస్సు సర్వీలు నడిచాయి. అందులో పేరూరు–హైదరాబాద్ సర్వీసులతో భద్రాచలం డిపోనకు ఎక్కువ ఆదాయం వచ్చేది. జిల్లాల విభజన తర్వాత వాజేడు, వెంకటాపురం రెండు మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లాయి. దీంతో బస్సు సర్వీసులను కుదించారు. వరంగల్ , భూపాలపల్లి బస్సు డిపోల నుంచి మండలానికి బస్సు నడుపడం లేదు. ప్రజల అభ్యర్థన మేరకు కేవలం రెండు బస్సులను వరంగల్ డిపో నుంచి నడుపుతున్నారు. మరిన్ని బస్సులను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
అలజడి
మళ్లీ మావోయిస్టుల కదలిక తాడ్వాయిలో విధ్వంసక చర్య అటవీ శాఖ గుడిసె, జీపు దగ్ధం కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరిట లేఖ పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన వరంగల్ ఏజెన్సీలో మరోసారి అలజడి రేగింది. తాడ్వాయిలోని అటవీ శాఖ వన్యప్రాణి విభాగం గుడిసెను, వాహనాన్ని తగులబెట్టడం.. సంఘటన స్థలంలో మావోయిస్టుల పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ ఉండడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో తాడ్వాయిలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. వీరి చర్యతో ఆదివాసీల సంస్కృతి వివరించే ఒక గుడిసె, జీపు కాలిపోయాయి. మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్(కేకేడబ్ల్యూ) కార్యదర్శి దామోదర్ పేరుతో ఘటన స్థలంలో ఇప్ప చెట్టు వద్ద లేఖ ఉంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ లేఖలోని అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను మావోయిస్టులు ధ్వంసం చేయడం ఐదారేళ్ల కాలంలో ఎప్పుడూ జరగలేదు. తాడ్వాయిలోని అటవీ శాఖ ఆస్తులను మావోయిస్టు పార్టీ దగ్ధం చేయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అంతా స్తబ్ధుగా ఉందనుకుంటున్న దశలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేకుండాపోయిందని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే ప్రకటిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో తాడ్వాయి ఘటన జరగడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. సాగునీటి శాఖ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో భాగంగా నిర్మించనున్న ప్రాజెక్టుల రక్షణ కోసం తుపాకులగూడెం వద్ద పోలీస్ అటాకింగ్ స్టేషన్‌ను నిర్మించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి ఘటన నేపథ్యంలో స్టేషన్ నిర్మాణం కోసం మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సరిగ్గా ఏడు నెలలకు... తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయిన మొదటి సంఘటన తాడ్వాయి-గోవిందరావుపేట అడవుల్లోనే జరిగింది. 2015 సెప్టెంబరు 15న జరిగిన ఈ ఎన్కౌంటర్లో తంగెళ్ల శృతి(27) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్ మృతిచెందారు. వరంగల్ ఏజెన్సీలో అప్పటికే మావోయిస్టుల ప్రభావం పూర్తిగా లేకుండా పోయిందనే పరిస్థితులలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దీంతో మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల్లోనూ ఆందోళన పెరిగింది. ఇప్పుడు పూర్తిగా పోలీసుల అధిపత్యం ఉందనే భావన ఉంంది. ఇలాంటి పరిస్థితుల్లో తాడ్వాయి ఘటన జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ఏడు నెలల తర్వాత అటవీ శాఖ ఆస్తుల దగ్ధమయ్యాయి. పోలీసు వర్గాలు సైతం మావోయిస్టు సానుభూతిపరులే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదే దిశగా గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలతో స్థానికులకు, మావోయిస్టు పార్టీ మాజీ సభ్యులు, సానుభూతి పరులకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మావోస్టులా.. నకిలీలా.. ములుగు / తాడ్వారుు : తాడ్వాయిలో అటవీశా ఖ వన్యప్రాణి విభాగానికి చెందిన గుడిసె, జీపు దగ్ధం చేసింది మావోయిస్టులా.. నకిలీలా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటన స్థలంలో కేకేడబ్ల్యు కార్యదర్శి దామెదర్ పేరుతో లేఖ లభ్యమైంది. లేఖలో ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు గ్రీన్ హంట్ పేరుతో మావోయిస్టులను ఏరి పారేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని’ రాసి ఉంది. దీనిని చూస్తే మావోయిస్టులేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరుుతే లేఖ లెటర్‌ప్యాడ్‌పై కాకుండా తెల్లకాగి తంపై రాసి ఉండడాన్ని చూస్తే ఇది చేసింది నకిలేనన్న అనుమానం కూడా కలుగుతోంది. ఇదే తరహాలో గత ఏడాది జూన్ లో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో నడుస్తున్న జేసీబీ, వెంకటాపురం మండలంలోని బూర్గుపేటలో మిషన్‌కాకతీయ పనులు చేస్తున్న జేసీబీలు దగ్ధం చేశారు. ఈ ఘటనల్లో కూడా మావోరుుస్టుల పేరుతో లేఖలు కనిపించారుు. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఇది ఆకతాయిల పనిగా తేల్చారు. అయితే మ ల్లంపల్లి సంఘటన జరిగిన నెల రోజుల వ్యవధి లో మొద్దుగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో విద్యాసాగర్, శృతి ప్రాణాలు వదిలారు. దీంతో పోలీసులు మావోయిస్టుల కదలికలు, సానుభూతిపరులపై దృష్టి పెట్టారు. తాడ్వాయి సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులకు సమాచా రం అందింది. తక్షణమే కూబింగ్ చేపట్టినా ఎవరూ తారసపడలేదు. ఒకరిద్దరు మావోరుుస్టులు గానీ, లేదా సానుభూతి పరులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈ సంఘటనకు పాల్పడి క్షణాల్లో తప్పించుకొని ఉంటారని భావిస్తున్నారు. సందర్శించిన ములుగు ఏఎస్పీ మావోయిస్టులు దగ్ధం చేసిన హట్స్‌ను ములుగు ఏఎస్పీ విశ్వజిత్ సందర్శించారు. ముందుగా తా డ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు పోలీసుల బలగాలతో సంఘటన స్థలంలో వివరాలు సేకరించా రు. అనంతరం వచ్చిన సందర్శించిన ఏఎస్పీ దగ్ధమైన జీపు, గుడిసెలను పరిశీలించి నైట్వాచ్మెన్లు రవి, సమ్మయ్య, జీపు డ్రైవర్‌ను ఘటన జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. మంటల శబ్దానికి నిద్ర లేశాం.. గుడిసె, జీపు కాలుతున్న మంటల శబ్దానికి రాత్రి ఒంటి గంటకు మేల్కొన్నామని వాచ్మెన్లు రవి, సమ్మయ్య చెప్పారు. అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తూనే అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. ఆ తర్వా త ఫైర్‌ఇంజన్ వచ్చి ఆర్పేసిందన్నారు. తాడ్వాయి-పస్రా మధ్య కూంబింగ్ పస్రా-తాడ్వాయి-ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు భారీ కూం బింగ్ చేపట్టారుు. గొత్తికోయగూడేలపై పోలీసు లు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎవరైనా తలదాచుకోవడానికి వచ్చారా అనే కోణం లో ప్రశ్నించారని సమాచారం. అనుమానితుల తో పాటు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. మంత్రి పర్యటన రద్దు ములుగు : తాడ్వాయి మండలం వనకుటీరంలో మావోయిస్టుల పేరుతో గుడిసె, వాహనాన్ని తగలబెట్టిన నేపథ్యంలో ఏజెన్సీలో మంత్రి చందూలాల్ పర్యటన రద్దయింది. శనివారం మంత్రి మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. ఇంతలో మావోయిస్టుల పేరుతో ఘటన జరగడంతో పర్యటన రద్దయింది. పోలీసుల సూచనతో మంత్రి చందూలాల్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనట్టు సమాచారం.