breaking news
wakers
-
వాకర్స్ జిల్లా గవర్నర్గా సత్యనారాయణరెడ్డి
అమలాపురం రూరల్ : నడక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని వాకర్స్ జిల్లా గవర్నర్గా ఎన్నికైన అమలాపురానికి చెందిన తేతలి సత్యనారాయణరెడ్డి అన్నారు. వాకర్స్ జిల్లా 103వ గవర్నర్గా సత్యనారాయణరెడ్డి స్థానిక కిమ్స్ వైద్య కళాశాల సమావేశపు హాలులో సోమవారం ప్రమాణ స్వీకారం చేసి ప్రసంగించారు. వాకర్స్ అంతర్జాతీయ సంస్థ మాజీ అధ్యక్షుడు కె.రామానందం జిల్లా గవర్నర్గా సత్యనారాయణరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. వాకర్స్ మాజీ గవర్నర్ ఎం.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అతిథిగా మాట్లాడుతూ అమలాపురంలో నాలుగు దశాబ్దాల కిందట నడక ఉద్యమానికి ఊపిరి పోసిన డాక్టర్ డి.రామచంద్రరావు కృషితో ఏర్పాటైన వాకర్స్ క్లబ్ నుంచి సత్యనారాయణరెడ్డి గవర్నర్ కావటం అభినందనీయమన్నారు. అనంతరం రెడ్డిని సత్కరించారు. వాకర్స్ మాజీ గవర్నర్ డాక్టర్ పీఎస్ శర్మ, వాకర్స్ ప్రతినిధులు డాక్టర్ గంధం రామం, డాక్టర్ నిమ్మకాయల రామమూర్తి పాల్గొన్నారు. -
వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్గా సత్యనారాయణరెడ్డి
అమలాపురం టౌన్ : వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 103వ గవర్నర్గా అమలాపురానికి చెందిన తేతల సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 2006 సంవత్సరం నుంచి రెడ్డి నడక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, వాకర్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన్ను గవర్నర్ పదవి వరించింది. అమలాపురం వాకర్స్ క్లబ్లో అధ్యక్ష పదవితో పాటు ఎన్నో పదవులు చేపట్టారు.