breaking news
wagers
-
ఉపాధి సరే.. వేతనాలేవీ..?
సాక్షి,మద్దికెర: వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేసినా వేతనాలకు అందకపోవడంతో వలసలు తప్పడం లేదు. నాలుగు నెలలుగా చేసి న పనులకు వేతనాలు దాదాపు రూ.1.50 కోట్లు ఇంత వరకు ఇవ్వకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దాదాపు 10 వేల జాబ్ కార్డులున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ పనులు ముగిసిన గ్రామాల్లో దాదాపు వెయ్యి మంది ఉపాధి కూలీలు పనులకు వెళ్తున్నారు. ఉపాధి కల్పించి సకాలంలో వేతనాలు చెల్లిస్తామని అధికారులు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి కూలీలకు తెల్పడంతో వారు పనులకు వెళ్లారు. అయితే పనులు చేసినా వేతనాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నందు వల్ల్ల వారు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇలా అయితే ఎవరి కోసం ఉపాధి పనులు కల్పించినట్లు అని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. నాలుగు నెలల గడిచినా కూలి ఇవ్వలేదు.. ఉపాధి పనులు చేసి నాలుగు నెలలు గడిచినా.. ఇంత వరకు వేతనాలు ఇవ్వలేదు. ఇలా అయితే పనులకు ఎలా వెళ్లేది.మా జీవనం ఎలా సాగుతుంది. అధికారులు స్పందించి సకాలంలో వేతనాలు ఇస్తే.. గ్రామాల్లో వలసలు కూడా తగ్గుతాయి. – తిమ్మయ్య, పెరవలి వేతనాలు మంజూరు చేస్తాం... నాలుగు నెలలు వేతనాలు రావాల్సి ఉంది. కూలీలకు వేతనాలు మంజూరు విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి సకాలంలో వేతనాలు అందించేందుకు కృషి చేస్తాం. వేతనాలు మంజూరులో ఆలస్యమైన మాట వాస్తవమే.. పనులు చేసిన వారందరికీ వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణ, ఏపీఓ -
శ్రీవారి పోటు కార్మికులకు వేతనాలు పెంపు!
-
శ్రీవారి పోటు కార్మికులకు వేతనాలు పెంపు!
ధర్మకర్తల మండలి తీర్మానాలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలు తయారుచేసే 492 మంది పోటు కార్మికుల వేతనాన్ని రూ. 3 వేల చొప్పున పెంచుతూ మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానించింది. టీటీడీ గుర్తింపు కార్డు, రూ. 300 టికెట్ల సుపథం ప్రవేశ మార్గం నుంచి శ్రీవారి దర్శ నానికి అనుమతితోపాటు పోటు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు టీటీడీ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయిం చారు. తిరుపతిలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన సైన్స్ మ్యూజియం ఏర్పాటుకోసం 19.25 ఎకరాల టీటీడీ స్థలాన్ని కౌలు ప్రాతిపదికన కేటాయించనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఇక్కడి అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశంలో అనేక అంశాలను తీర్మానించారు. మరికొన్ని తీర్మానాలివీ.. ∙రూ. 2.5 కోట్లతో తిరుమలలో సర్వదర్శ నం భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్ నిర్మాణం. ∙టీటీడీ కాటేజీ విరాళ పథకం కింద తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో ఒక్కోగదికి రూ. 15 లక్షలు, విష్ణునివాసంలో రూ. 10 లక్షలు, ఒక్కో సూట్‌కు రూ. 18 లక్షలు చొప్పున భక్తుల నుంచి స్వీకరించా లని నిర్ణయం. ∙శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని స్వర్ణోత్సవ ఆర్చి వద్ద రూ. 29 లక్షలతో శ్రీవారి ఆలయ నిర్మాణం. ∙ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణకోసం రూ. 3.51 కోట్లు కేటాయించారు. ∙తెలంగాణలోని నిజామా బాద్ జిల్లా బర్దీపూర్ గ్రామంలోని శ్రీవేంకటే శ్వరస్వామి, రాజేశ్వరస్వామి త్రితల రాజగో పురం నిర్మాణానికి ఆలయానికి రూ. 25 లక్షలు. ∙ఖమ్మం జిల్లా ఎర్రబోయినపల్లెలో సీతారామస్వామి ఆలయానికి రూ. 23.85 లక్షలు, నీలాద్రిలో వెలసిన శ్రీశివాలయానికి రూ. 46.35 లక్షలు, జమలాపురంలో సత్రం అభివృద్ధికి రూ. 28.70 లక్షల కేటాయింపు. 7 వేల కిలోల శ్రీవారి బంగారాన్ని దీర్ఘకాలిక డిపాజిట్లోకి మార్పు: ఈవో టీటీడీ పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన దాదాపు 7 వేల కిలోల శ్రీవారి బంగారానికి ప్రస్తుతం స్వల్పకాలిక డిపాజిట్‌పై కేవలం 1 శాతం వడ్డీ మాత్రమే వస్తోందని, త్వరలోనే దీర్ఘకాలికంగా డిపాజిట్ చేయనున్నామని, దీనిద్వారా 2.5% వడ్డీ వచ్చే అవకాశముందని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు.