breaking news
voting on t bill
-
ఓటింగ్‌పై స్పీకర్ మీనమేషాలు
-
ఓటింగ్‌పై స్పీకర్ మీనమేషాలు
మీనమేషాలు లెక్కించకుండా శాసన సభలో విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... విభజన బిల్లుపై మెజార్టీ నిర్ణయం తెలియాలంటే శాసనసభలో ఓటింగ్ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం తక్షణమే సభలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన స్పీకర్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రగతి సాథ్యమని పేర్కొన్నారు. విభజన బిల్లుపై చర్చకు ఈ రోజు ఆఖరి రోజు కావున సమైక్యవాదాన్ని ఎట్టి పరిస్థితులలోనైన గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లు రూపొందించిందని ఆరోపించారు. టి.బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలని, అందుకోసం గడువు పెంచమంటే రాష్ట్రపతి మౌనం ముద్ర దాల్చారన్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి ఆ ప్రాంత ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అలాగే విభజన వాదాన్ని తరిమికొట్టాలని తొమ్మిది కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్ర ప్రజల హక్కులు, అధికారాలను తాము పణంగా పెట్టలేమని దేవినేని ఉమ పేర్కొన్నారు. -
అంతమాత్రానికే సభాహక్కుల నోటీసా: వీహెచ్
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని, చర్చ మాత్రమే ఉంటుందని దిగ్విజయ్ చెప్పడానికి ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమే కారణమని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. అంతమాత్రానికే టీడీపీ ఎమ్మెల్యేలు దిగ్విజయ్ సింగ్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సరికాదని ఆయన చెప్పారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడును లౌకికవాదులంటే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. టీడీపీ-బీజేపీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా వాటికి ఆశించిన ఫలితం దక్కదని వీహెచ్ జోస్యం చెప్పారు.