breaking news
VMDA
-
సంగీత సాధనే ఆధ్యాత్మికత ఆరాధన
పండిట్ విశ్వమోహన భట్ విశాఖ–కల్చరల్: సంగీతం మనసును, శరీరాన్ని, ఆత్మను స్వచ్ఛపరుస్తుంది.. పరమాత్మతో కనెక్ట్ చేస్తుంది.. తన వరకు దేవుడి పూజ అంటే.. సంగీత సాధనేనని పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్ భట్ అన్నారు. సంగీతాన్ని కళగానే చూడండి.. కళగానే అభ్యసించండి.. దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవద్దని సూచించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (వీఎండీఏ) 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగే సంగీత, నత్య, నాటకోత్సవాలు కళాభారతి ఆడిటోరియం శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్ భట్‌కు ‘నాద విద్య భారతి’ జాతీయ ప్రతిభా పురస్కారం, స్వర్ణ కమలాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కూచిపూడి నత్యకారుడు లీలా సామ్సన్ అందజేశారు. ఎంపీ కె.హరిబాబు జ్ఞాపికను, వీఎండీఏ అధ్యక్షుడు సి.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శి జి.ఆర్.కె.ప్రసాద్(రాంబాబు) నూతన వస్త్రాలు, లక్ష రూపాయల చెక్ అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందినప్పటికీ సాంస్కతిక రాజధాని విశాఖ నగరంలో ది గ్రేట్ మిలినీయం నాద విద్య భారతి జాతీయ ప్రతిభా పురస్కారం పొందడం ఆనందంగా ఉందన్నారు. పాటలోని స్వరాలకన్నా ఆ నేపథ్యాన్ని ప్రజెంట్ చేసే దృశ్యమే మనస్సుపై ముద్రవేస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉత్సవాలకు ఆర్థికసాయం చేసిన వైభవ్ జ్యూయలర్స్ అధినేత మల్లిక్మనోజ్ కుమార్తె కార్తిక్ గ్రంధి, బొత్రా గ్రూప్ సంస్థ అధినేత లక్ష్మికాంత్, ఆంధ్రా బ్యాంక్ ప్రతినిధులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఓలలాడించిన వీణా కచేరీ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్‌భట్ ప్రదర్శించిన మోహన వీణ వాద్య కచేరీ సంగీత ప్రియుల్ని ఓలలాడించింది. పండిట్ విశ్వమోహన్‌భట్ మోహనవీణ రాగ విన్యాసాలకు లయబద్ధంతో సలీమ్ మోహన వీణా సహాయ సంగీతం అందించగా దానికి తగ్గట్టుగా రామ్‌కుమార్ తబలా మంత్రముగ్దుల్ని చేశాయి. -
విఎండీఏకి ఓకే
- వుడా బోర్డు ఆమోదముద్ర - నెల రోజుల్లో మళ్లీ బోర్డు సమావేశం విశాఖపట్నం సిటీ: వీఎండీఏ ప్రతిపాదనకు వుడా బోర్డు ఓకే చెప్పింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఈ సమావేశం మళ్లీ నెల రోజుల్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 80 అంశాల్లో 70 అంశాలు మాత్రమే చర్చించారు. మిగిలిన వాటితో పాటు కొత్త అంశాలను రూపొందించి వచ్చే బోర్డు సమావేశానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. పట్టణ పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికల వలవన్ అధ్యక్షతన జరిగిన వుడా బోర్డు సమావేశం సుధీర్ఘంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పూర్తవుతాదని భావించిన ఈ సమావేశం రాత్రి 7.30 గంటల వరకూ జరిగింది. ముందుగా అనుకున్న అన్ని అంశాలకు బోర్డు ఆమోదం పొందింది. ఇవీ నిర్ణయాలు. - వుడాలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్, టైం స్కేల్ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో కనీసం రూ. లక్ష ప్రయోజనం కల్పించనున్నారు. - సంస్థనే నమ్ముకుని వికలాంగులుగా మారిన ఉద్యోగులకు రూ. 3 లక్షల ప్రయోజనం కల్పించనున్నారు. - మాస్టర్ రోడ్లు, పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తారు. -వుడాలో ఖాళీగా ఉన్న దాదాపు 106 ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు. - శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీనర్సింహం బోర్డు సమావేశంలో ప్రతీ అంశాన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో అవసరమైన జీవోలన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకునే సరికి బాగా ఆలస్యమైనట్టు అధికారులంటున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే తీర్మానం కూడా వచ్చే సమావేశంలో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.