Vizhinjam
-
సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం
తిరువనంతపురం: కంటైనర్ల ద్వారా సరుకు రావాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతిపెద్ద విఝింజమ్ అంతర్జాతీయ సీపోర్ట్‌తో కేరళ రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భవిష్యత్తులో ఈ సీపోర్ట్ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని, దాంతో కంటైనర్ కార్గో రవాణా విభాగంలో భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విఝింజమ్ వద్ద రూ.8,686 కోట్ల వ్యయంతో నిర్మించిన డీప్‌వాటర్ సీపోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.అప్పుడలా.. ఇప్పుడిలా‘‘గతంలో భారత కంటైనర్ల రవాణా వ్యవహారంలో 75 శాతం విదేశీ పోర్టుల్లో జరిగేది. దాని వల్ల దేశం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ సంపద భారత్‌కే ఉపయోగపడుతోంది. గతంలో భారత్‌ను దాటిపోయిన నిధులు ఇప్పడు స్వదేశంలోనే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని విఝింజమ్ ప్రజలకు అవకాశాలు పెరిగాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో తొలినాళ్ల నుంచీ కేరళ నౌకలు భారత్‌కు సరుకు రవాణాలో కీలక భూమిక పోషించాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత హబ్‌గా కేరళ ఎదుగుతోంది. ఇప్పుడు కేరళను మెరుగైన ఆర్థికశక్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ అన్నారు. అదానీని పొగిడిన మోదీఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీసెజ్) ఈ డీప్‌వాటర్ పోర్ట్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధినేత గౌతమ్ అదానీని మోదీ పొగిడారు. ‘‘ అదానీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సొంత రాష్ట్రంలోనూ ఓడరేవులున్నాయి. అయినాసరే గుజరాత్‌ను కాదని కేరళలో ఇంత పెద్ద సీపోర్ట్‌ను కట్టాడని తెలిస్తే గుజరాత్ ప్రజలు సైతం అసూయపడతారు’’ అని సరదాగా అదానీని మోదీ పొగిడారు.‘‘2014లో సరుకు రవాణా నౌకలు, ప్రజారవాణా, ఇతర పడవల ద్వారా 1.25 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందితే ఇప్పుడు వాళ్ల సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. ఈ కార్మికుల సంఖ్యపరంగా భారత్ ప్రపంచ టాప్–3 స్థానం పొందింది. సరుకు రవాణా విషయంలో టాప్–30లో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి’’ అని మోదీ అన్నారు.స్వప్నం సాకారమైంది‘‘కేరళ స్వప్నం సాకారమైంది. అంతర్జాతీయ జలరవాణా, వాణిజ్యం, సరుకు రవాణా చిత్రపటంలో ఈ సీపోర్ట్ భారత్‌కు కొత్త దారులు తెరిచింది’’ అని మోదీ అన్నారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయన్, గౌతమ్ అదానీ, శశిథరూర్ పాల్గొన్నారు. ‘‘ మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విఝింజమ్ సీపోర్ట్ సింహద్వారంగా నిలవనుంది’’ అని సీఎం విజయన్ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదానీ సంస్థ సంయుక్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఓడరేవును నిర్మించారు.ఈ ఇద్దరిని నా పక్కన చూశాకకొందరికి అస్సలు నిద్రపట్టదువిపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామి అయిన సీపీఎం సీనియర్ నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మోదీతోపాటు వేదికను పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్‌నుద్దేశిస్తూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం విజయన్‌కు నేనో విషయం చెప్పదల్చుకున్నా. విపక్షాల ఇండియా కూటమిలో మీరూ ఒక మూలస్తంభం. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం వేదికపైనే ఉన్నారు. మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్ర పట్టదు. మలయాళంలోకి నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్న వ్యక్తి సరిగా చెప్తున్నారో లేదో నాకు తెలీదుగానీ నా ఈ సందేశం చేరాల్సిన వారికి ఇప్పటికే చేరిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘పహల్గాం తర్వాత కూడా విపక్ష నేతల నిద్రలు పాడుచేయడం మీదే మోదీ దృష్టిపెట్టారు. మేం మాత్రం నిద్రలేని రాత్రులు గడిపైనాసరే మిమ్మల్ని మీ ప్రభుత్వ తప్పులకు బా«ధ్యులను చేస్తాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలతో శశిథరూర్ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరించడం తెల్సిందే. ‘‘శుక్రవారం నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం పలికా. సీపోర్ట్ ప్రారంభంకావడం మాకెంతో గర్వకారణం’’ అని శశిథరూర్ అంతకుముందు ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. -
రూ. 27 వేల కోట్లతో కొత్త పోర్టు!
న్యూఢిల్లీ: వ్యాపారరంగాన్ని వృద్ధిబాటలో నడిపేందుకు భారత ప్రభుత్వం రవాణా వ్యవస్థలపై దృష్టిపెట్టింది. కీలకంగా మారిన సముద్ర రవాణాను పటిష్టం చేసేందుకు కొత్త పోర్టుల నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. దేశీయ దిగ్గజ సంస్థ గౌతమ్ అదానీ గ్రూప్ పాతికేళ్ల క్రితం ప్రతిపాదించిన మొదటి ట్రాన్స్ షిప్ మెంట్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ ఆసియాలో వరుసగా పోర్టులను నిర్మిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్న చైనాకు దీటుగా కొత్త షిప్పింగ్ హబ్ ను కేరళలోని విజిన్జంలో నిర్మించేందుకు దాదాపు రూ. 27 వేల కోట్లు కేటాయించింది. విజిన్జం పోర్టు నిర్మాణానికి అవసరమయ్యే మొత్తాన్ని విడతల వారీగా ప్రభుత్వం గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థకు విడుదల చేయనుంది. విజిన్జం పోర్టు నిర్మాణం పూర్తయిన వెంటనే తమిళనాడులోని ఎనయామ్ వద్ద మరో పోర్టును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు షిప్పింగ్ మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కేవలం ఎనయామ్ నిర్మాణం వల్ల ఏటా 200 మిలియన్ డాలర్లను భారత కంపెనీలు ఆదా చేసుకోవచ్చని వివరించారు. భారతదేశానికి ఉన్న విశాలమైన 7,500 కిలోమీటర్ల తీరప్రాంతం ద్వారా దేశాన్ని ఆర్థికంగా పటిష్ట పరచాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిక అని చెప్పారు. 2021 నాటికల్లా కార్గో రవాణా మూడింట రెండొంతులు పెరుగుదల చూపిస్తుందని.. పోర్టులను నిర్మించడం ద్వారా శ్రీలంక, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు రవాణా సౌకర్యాలను పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో అదానీ గ్రూప్ ప్రారంభించిన విజిన్జం పోర్టు నిర్మాణాన్ని 2018లో పూర్తి చేయనున్నారు. విజిన్జం పోర్టు రవాణాకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సముద్ర రవాణా దారిగా పేరుగాంచిన గల్ఫ్-మలక్కాకు కీలకంగా మారుతుంది. ప్రస్తుతం ట్రాన్స్ షిప్ మెంట్ కోసం కొలంబో, సింగపూర్, దుబాయ్ ల పోర్టులపై ఆధారపడుతున్న భారత కంపెనీలు విజిన్జం నుంచి రవాణాకు వీలు కలుగుతుందని అదానీ గ్రూప్ కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. దాంతో శ్రీలంకలోని కొలంబో, హంబన్ తోటల్లో చైనా నిర్మిస్తున్న పోర్టులకు విజిన్జం గట్టి పోటీ ఇవ్వనుంది. చైనా ప్రమాదం శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల్లో పోర్టుల నిర్మాణంలో చైనా పెట్టుబడులు పెడుతుండటం భారత్ కు ముప్పుగా మారింది. చైనా-పాకిస్తాన్ కారిడార్ కింద దాదాపు 46 బిలియన్ డాలర్లతో చైనా పాకిస్తాన్ లోని గ్వాదర్ వద్ద పోర్టును నిర్మిస్తోంది. విజిన్జం పోర్టు నిర్మాణంలో కూడా చైనా భాగస్వామిగా మారడానికి ప్రయత్నించినా, దేశభద్రత కింద భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. పోర్టుల నిర్మాణంలో చైనాకు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టకుండా ఎలాంటి నిషేధం విధించలేదని ఓ అధికారి తెలిపారు. కేవలం రవాణా కోసమే కాకుండా రక్షణపరంగా కూడా నేవీ, కోస్ట్ గార్డుకు చెందిన నౌకలను కూడా విజిన్జం పోర్టులో ఉపయోగించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. 2014లో కొలంబో పోర్టు వద్ద చైనా తన జలాంతర్గామిని ఉంచడంతో షాకైన భారత్.. పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇరాన్ లోని చాబహార్ వద్ద పోర్టు నిర్మించేందుకు భారత్-ఇరాన్ లు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పోర్టు ద్వారా ఇరాన్, ఆప్ఘనిస్తాన్ మరికొన్ని మధ్య ఆసియా దేశాలకు రవాణా సులువుగా మారనుంది. అయితే, తక్కువ ధరలకే ట్రాన్స్ షిప్ మెంట్ ను అందిస్తున్న కొలంబో పోర్టును వదిలేసి విజిన్జం పోర్టుకు షిప్ మెంట్లను వ్యాపారస్తులు ఎలా పంపుతారన్నదే.. ప్రశ్నార్థకంగా మారింది. భారీగా ఆఫర్ లను ఇవ్వడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమనే వాదన కూడా ఉంది. వాస్తవానికి 25 ఏళ్ల క్రితమే విజిన్జం పోర్టు నిర్మాణానికి అనుమతులు రాగా ఎఫ్ బీఐ నుంచి భద్రత కారణాలు, కేసుల కారణంగా పోర్టు నిర్మాణం వాయిదా పడటం ఒక రకంగా భారత్ కు నష్టం కలిగించిందనే చెప్పాలి.