breaking news
visvaksen
-
స్టార్స్‌తో సినిమా తీయడం రిస్క్
‘‘హ్యాంగోవర్, దిల్ చహ్తా హై, జిందగీ నా మిలేంగా దోబారా’ లాంటి సినిమాలన్నీ బడ్డీ కామెడీలు. అలాంటి సినిమాలు తెలుగులో రాలేదు. ఆ స్టైల్లో రాసుకున్న సినిమానే ‘ఈ నగరానికి ఏమైంది’’ అని దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. తరుణ్ భాస్కర్ చెప్పిన విశేషాలు... ► ‘పెళ్ళిచూపులు’ సక్సెస్ అర్థం కావడానికి టైమ్ పట్టింది. ఈ షాక్‌లో నుంచి బయటకు రావడానికి, కొంచెం బ్యాలెన్స్ రావడానికి సమయం పట్టింది. ‘పెళ్ళిచూపులు’ సినిమాకి ప్లస్ పాయింట్ కథ. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి కూడా అదే ప్లస్ పాయింట్. కథ విన్న వెంటనే సురేశ్‌బాబుగారు ఓకే అన్నారు. షూటింగ్‌లోనూ ఎలాంటి మార్పులు చెప్పలేదు. ►కొత్త వాళ్లతో కథ చెప్పడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. స్టార్స్‌తో అయితే కథ వాళ్ల చుట్టూ తిరగాలి. అలా రాయడం నాకు కొత్త. నిజమైన రిస్క్ స్టార్స్‌తో సినిమా తీయడమే. కొత్తవాళ్లతో ఆల్రెడీ చేశాను. అదే నమ్మకంతో ‘ఈ నగరానికి ఏమైంది’ చేశా. ►‘పెళ్ళిచూపులు’ హిట్ తర్వాత చాలా మంది హీరోలు జెన్యూన్‌గా అప్రిషియేట్ చేశారు. మంచి పాయింట్ ఉంటే అప్రోచ్ అవ్వమన్నారు. సినిమా పూర్తిగా అర్థం అవ్వాలి. అది అయ్యాక వాళ్లను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా. ►జనంలో క్యూరియాసిటీ పెంచడం కోసమే కాకుండా సినిమాలో మెయిన్ థీమ్ కూడా అదే ఉండటంతో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ టైటిల్ నా ఫ్రెండ్ కౌశిక్ చెప్పారు. సురేశ్‌బాబుగారు కూడా బావుంది అనడంతో ఫిక్స్ అయ్యాం. తాగుడుకు బానిసత్వం గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశాం. ఫన్నీ ఎంటర్టైనింగ్ మూవీ. తర్వాతి సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. ముందు కథ రాస్తా. అది ఎవరికి సూట్ అవుతుందనిపిస్తే వాళ్లను అప్రోచ్ అవుతా. -
ఇది లైబ్రరీలాంటి సినిమా
‘‘కొత్తవారందరూ కలిసి చేసిన ఈ సినిమాను సపోర్టు చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ బాగుంటే ఏ కొత్త సినిమాకైనా నా వంతు సపోర్ట్ చేస్తా’’ అని ‘దిల్’ రాజు అన్నారు. విశ్వక్సేన్, సుప్రజ , శ్వేత హీరో హీరోయిన్లుగా యాకుబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెళ్లిపోమాకే’. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ విహారి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు సతీష్ వేగేశ్న విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మన పక్కింటి అమ్మాయిలు, అబ్బాయిలు, సహోద్యోగు లు ఉన్నట్టే ఈ కథలోని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలను ప్రొత్సహిస్తే మంచి కథనాలతో మరిన్ని సినిమాలు వస్తాయి. రాబోయే సినిమాలకు ఈ సినిమా లైబ్రరీలా ఉంటుంది’’అన్నారు. ‘‘దిల్’ రాజుకు కథ నచ్చడంతో మూడేళ్ల కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం’’ అని యాకూబ్ అలీ అన్నారు. ‘‘ఏఆర్ రెహమాన్ దగ్గర పనిచేశా. ఈ చిత్రానికి క్లాసికల్ టచ్ ఉన్న వెస్ట్రన్ మ్యూజిక్ అందించా’’ అని ప్రశాంత్ విహారి చెప్పారు.