breaking news
visvabrahmanulu
-
విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్ జగన్ పెద్దపీట
సాక్షి, తాడేపల్లి: విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులు, పనుల్లో సీఎం ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. బీసీ సమస్యల పరిష్కారానికి శాశ్వతంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. విశ్వకర్మ భగవానుడు విశ్వాన్ని సృష్టించిన వ్యక్తి అని.. విశ్వకర్మలను విశ్వ భగవానుడి వారసులుగా ఆయన పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణలు లేని వృత్తి లేదని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
విశ్వబ్రాహ్మణులు మరో పోరాటానికి సిద్ధం కావాలి
నయీంనగర్ : విశ్వ బ్రాహ్మణులు ఆర్థిక సంక్షోభంతో కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో ఉంటుండడంతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఐలాపురం వేణుచారి ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండ నయీంనగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి మల్లోజు సత్యనారాయణచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేణుచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో స్థిరపడుతూ ఆత్మసై్థర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర నాయకుడు ముగులోజు రాజగోపాలచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులంతా ఏకమై కార్పొరేషన్‌ను సాధించుకోవడానికి ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు చిట్టిమల్ల నాగరాజు, నారాయణగిరి రాజు, ఆకోజు బ్రహ్మచారి, అనుపురం వినోద్, బాలోజు శ్రీకాంతాచారి, బండ్ల భాస్కరాచారి, రావుల నాగరాజు, కందుకూరి శ్రీకాంత్, దీపక్, సుధీర్, సతీష్, హయగ్రీవాచారి తదితరులు పాల్గొన్నారు.