breaking news
Vishvaguru
-
నిజం వైపు నిలబడే ధైర్యమే విద్య
అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ ఎల్. ఐస్గ్రూబర్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం: ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం పట్టభద్రులుగా బయటకు వెళ్తున్న మీ జీవిత ప్రయాణంలో... ఎన్నో ఆనందకరమైన క్షణాలు, వేడుకలు, సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే, మీ జీవితంలోని ఈ కొత్త ప్రయాణం ఒక సంక్లిష్టమైన సమయంలో ప్రారంభమవుతోంది. రాజకీయ విభేదాలు, హింస, వేగంగా మారుతున్న టెక్నాలజీ వంటి సమస్యలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది.ఇలాంటి సవాళ్లు ఎదురౌతున్న తొలి ప్రిన్స్టన్ విద్యార్థులు మీరే కాదు. అందుకే, నేటి సమస్యలను అర్థం చేసుకోవడానికి, గతంలో మనకంటే ముందున్నవారి అనుభవాలు, ఆలోచనలు ఉపయోగపడ తాయి. ముఖ్యంగా 1960ల నాటి పరిస్థితులను పరిశీలించడం సహాయపడుతుంది. ఆ సమయంలో కూడా అమెరికాలో, ముఖ్యంగా కళాశాల ప్రాంగణాలలో సామాజిక మార్పు, అశాంతి చోటుచేసుకుంది. ఆ దశకంలో ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించిన వ్యక్తి రాబర్ట్ ఎఫ్.గోహీన్. ఆయన ఈ విశ్వవిద్యాలయంలోనే 1940లో బ్యాచిలర్ డిగ్రీని, 1948లో డాక్టరేట్‌ను పొందారు. 1957లో, తన 37వ ఏట, ఆయన ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడయ్యారు. అప్పటికి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కూడా లేని ఒక యువ క్లాసిక్స్ అధ్యాపకుడు ఒక గొప్ప విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించగలడని విశ్వవిద్యాలయ ట్రస్టీలు ఎలా గుర్తించారో నాకు తెలియదు. కానీ, వారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.విలువలతో కూడిన గొప్ప నాయకత్వం2008లో గోహీన్ మరణించినప్పుడు, ప్రిన్స్టన్కు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు ప్రముఖులు విలియం బోవెన్, హెరాల్డ్ షాపిరో ఆయనను ‘‘ఆధునిక ప్రిన్స్ టన్ నిర్మాత’’గా కొనియాడారు. గోహీన్ నాయకత్వంలో ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో మహిళలకు గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ప్రక్రియ ముందుకు సాగింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న మైనారిటీ వర్గాల విద్యార్థుల సంఖ్యను కూడా ఆయన పెంచారు. విశ్వవిద్యాలయ పాలనలో మార్పులు తీసుకొచ్చారు. వియత్నాం యుద్ధానికి సంబంధించి తీవ్రమైన వివాదాలు, ఘర్షణలు తలెత్తిన సమయంలో విద్యాసంస్థను సమర్థంగా నడిపించారు.ఆయన పదిహేనేళ్ల పదవీ కాలంలో ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం 38 కొత్త భవనాలను నిర్మించింది. అధ్యాపకుల సంఖ్య 40 శాతం పెరిగింది. విశ్వవిద్యాలయం గురించి, ఉన్నత విద్య గురించి గోహీన్ తన ఆలోచనలను ‘ద హ్యూమన్ నేచర్ ఆఫ్ యూనివర్సిటీ’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఆయన తన పుస్తకాన్ని ఈ మాటలతో ముగించారు: ‘‘విశ్వవిద్యాలయం తన పాత్రను, లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే... ధైర్యం, సంయమనం ఎప్పుడూ అవసరం. ఇదీ చదవండి: ప్రతి వ్యక్తీ ఒక కాంతి!స్వేచ్ఛాయుత విద్యా విధానాన్ని ప్రేమించే, మానవాళికి మంచి భవిష్యత్తును కోరుకునే వారు ధైర్యంగా నిలబడాలి. ఇలాంటి ధైర్యంతో ముందుకు సాగి నప్పుడు విశ్వవిద్యాలయం తన గతం, వర్తమానం, భవిష్యత్తుపై నమ్మకంగా ఉండగలదు. తన లక్ష్యాలు, ప్రాథమిక విలువలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండగలదు. సమాజంలో తన గొంతును ధైర్యంగా వినిపించగలదు.’’భయం వీడి.. సత్యం వైపు నడవండిప్రిన్స్ టన్లో ప్రొఫెసర్‌గా పనిచేసిన నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ నవలా రచయిత్రి టోనీ మోరిసన్ కూడా ఇదే తరహా ఆలోచనలను వ్యక్తం చేశారు. 1996లో ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం 250వ వార్షికోత్సవ సభలో ఆమె ‘ద ప్లేస్ ఆఫ్ ద ఐడియా, ద ఐడియా ఆఫ్ ద ప్లేస్ ’అనే శీర్షికన ప్రసంగించారు. తన ప్రసంగం చివర్లో మోరిసన్ కూడా గోహీన్ లాగే ధైర్యం గురించి మాట్లాడారు. ప్రిన్స్టన్కు ఉన్న భిన్నంగా ఆలోచించే సంప్రదాయం ప్రకారం నిజాయితీ, గౌరవం, న్యాయబద్ధత, ధైర్యం వంటి విలువలకు విద్యార్థులు, అధ్యాపకులు గట్టిగా కట్టుబడి ఉండాలని ఆమె ఆశించారు. అమెరికా సుప్రీంకోర్టులో ప్రసిద్ధ న్యాయమూర్తి అయిన లూయిస్ బ్రాండీస్ కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కును సమర్థిస్తూ ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిన ప్రజలు.. స్వేచ్ఛగా భయం లేకుండా ఆలోచించడం ద్వారా, ప్రజాస్వామ్య పాలనా విధానాలతో సమస్యలను పరిష్కరించగలమని నమ్ముతారు’’ అని పేర్కొన్నారు. బ్రాండీస్ చెప్ప దలచుకున్న విషయం ఏమిటో, 1960వ దశకంలోని అల్ల కల్లోల పరిస్థితుల్లో రాబర్ట్ గోహీన్ గుర్తించిన విషయం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది.ఇదీ చదవండి: అసలు 'చూడటం' అంటే ఏమిటి?అదేమిటంటే.. ప్రమాదకరమైన ధోరణులను, సమాజానికి హాని చేసే ఆలోచనలను ఎదుర్కోవాలంటే.. పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. చర్చలోఅందరూ ఒక అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నప్పుడు.. దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ సత్యాన్ని తెలుసుకోవాలనే మన నిబద్ధతకు, సమాజం పట్ల మన బాధ్యతకు కట్టుబడి ఉండాలి. అవి మనల్ని కష్టమైన మార్గాల్లోకి తీసుకెళ్లినా సరే, మనం వెనక్కి తగ్గకూడదు. కఠినమైన నిజాలకే పట్టం కట్టండిలూయిస్ బ్రాండీస్, రాబర్ట్ గోహీన్, టోనీ మోరిసన్ ముగ్గురూ చెప్పినట్లుగా... ప్రజాస్వామ్య స్వపరిపాలన, స్వేచ్ఛ, విద్య అనేవి ఎల్లప్పుడూ సౌకర్యంగా ఉండవు. వాటికి స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం అవసరం. స్వతంత్రంగా ఆలోచించడం అంటే.. అవసర మైనప్పుడు ఇతరుల మద్దతు లేకపోయినా ఒంటరిగా నిలబడగల బలం కలిగి ఉండటం. ధైర్యం అంటే కేవలం ఇతరులకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రమే కాదు. మన అభిప్రా యాన్ని మార్చుకోవడానికి కూడా ధైర్యం అవసరం. మీరు ఈ విశ్వవిద్యాలయంలో... కొత్త ఆలోచనలను ఆస్వాదించి, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచానికి మీ జ్ఞానం, మీ నైపుణ్యాలు మాత్రమే కాదు, మీ ధైర్యం కూడా చాలా అవసరం. అందుకే రాబోయే రోజుల్లో, రాబోయేసంవత్సరాల్లో మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. రాబర్ట్ గోహీన్ చెప్పినట్లుగా, సౌకర్యంగా అని పించే కల్పిత కథల కంటే.. కఠినమైన నిజాలను; ఇతరుల ప్రశంసల కంటే ఆత్మగౌరవాన్ని ఎంచుకోండి. సంక్షిప్తంగా చెప్పాలంటే.. రాబర్ట్ గోహీన్, టోనీ మోరిసన్‌లు తమ జీవితాల ద్వారా, తమ మాటల ద్వారా, చేతల ద్వారా చూపించిన ప్రిన్స్టన్ విలువలను మీరు ఎల్లప్పుడూ మీతో పాటు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మీ ముందున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. మీఅందరికీ హృదయపూర్వక అభినందనలు! మీ భవిష్యత్తు విజయ వంతం కావాలని కోరుకుంటున్నాను! -
ప్రతి వ్యక్తీ ఒక కాంతి!
జపాన్‌లోని హొక్కైడో యూనివర్సిటీ 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ కియోహిరో హౌకిన్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం: ఈ రోజు డిగ్రీలు అందుకుంటున్న 1,938 మంది విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. హొక్కైడో యూనివర్సిటీలో మాస్టర్స్, ప్రొఫెషనల్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. మీ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులకు కృతజ్ఞతలు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మీరు మీ చదువును పూర్తి చేశారు. మీ పట్టుదల, కృషి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది..ఉన్నత విద్య అంటే ఏంటో తెలుసా?!ఈ రోజు మీరు డిగ్రీలు అందుకుంటున్న ఆనందకరమైన సందర్భంలో అసలు డిగ్రీకి, ఉన్నత విద్యకు ప్రస్తుత ప్రపంచంలో ఉన్న అర్థం ఏమిటి? అనే విషయాన్ని కొద్దిసేపు ఆలోచిద్దాం. విశ్వవిద్యాలయానికి సమాజం ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించింది. అంటే.. భవిష్యత్తును నిర్మించే వ్యక్తులను తయారు చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది. అందుకే ఈ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలు పొందుతున్న మీ అందరిపై కూడా ఒక గొప్ప బాధ్యత ఉంది.భవిష్యత్ తరాల కోసం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంక్షేమ సమాజాన్ని నిర్మించటానికి మీరు కృషి చేయాలి. జపాన్ కు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో జనాభా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ‘మేజీ’ రాజ్యాధికార పునరుద్ధరణ తర్వాత జనాభా, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వేగంగా పెరిగాయి. జనాభా పెరుగుదల ప్రభావం జపాన్ కే పరిమితం కాలేదు. ప్రపంచ జనాభా కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8 బిలియన్లకు పైగా ఉంది. 2080 నాటికి ప్రపంచ జనాభా 10 బిలియన్లకు పైగా చేరవచ్చని అంచనా.కానీ మీరు ప్రస్తుతం జపాన్ సమాజంలో చూస్తున్నట్లుగా, జనాభా పెరుగుదల ధోరణి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జపాన్ జనాభా తగ్గుతోంది. ఇప్పుడు మనం ఒక కీలకమైన దశలో ఉన్నాం. ముందుకు వెళ్లడానికి మన ప్రయాణంలో కొన్ని మార్పులు అవసరం. ప్రస్తుత సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలను కనుగొనే బాధ్యత మీ తరంపై ఉంది. జపాన్‌తోపాటు ప్రపంచం కూడా గత కొన్నేళ్లుగా ఎన్నో తీవ్రమైన మార్పులను ఎదుర్కొంటోంది. మొదటిది వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు తరాల కోసం సహజ వనరులను కాపాడటం వంటి అంశాలు మరింత కీలకంగా మారాయి.యువతరం చేతుల్లోనే నవ సమాజంమన పూర్వీకులు చరిత్ర ద్వారా మనకు నేర్పిన మానవత్వం, వైవిధ్యం, సహజీవనం వంటి విలువలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. మన యుగాన్ని ఒక కొత్త రకమైన మౌలికమైన ఆందోళన చుట్టుముట్టినట్లు కనిపిస్తోంది. జపాన్ లో జనాభా తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా విలువల్లో మార్పులు, పర్యావరణ స్థిరత్వంపై ఆందోళనలు, కృత్రిమ మేధస్సు మానవ మేధస్సుకు విసురుతున్న సవాళ్లు.. ఈ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగింది.కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. మనం ప్రస్తుతం ఒక ‘యుగం నుంచి మరో యుగానికి మారుతున్న సంధికాలంలో’ ఉన్నాం. తర్వాతి యుగం ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యత ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తోంది. ఈ రోజు డిగ్రీలు పొందుతున్న మీరు భవిష్యత్తుకు మార్గదర్శకులు.ఈ సంవత్సరంతో హొక్కైడో యూనివర్సిటీ స్థాపించి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. గత పదిహేను దశాబ్దాల ప్రయాణానికి మేము ఎంచుకున్న ప్రధాన భావన: ‘వెలుగు ఉత్తరం వైపు నుంచి వస్తుంది’’ అని. ఇక్కడ ‘వెలుగు’ అంటే ఈ రోజు మా ముందున్న మీరందరూ. ఈ మాటకే నేను మరో భాగాన్ని జోడించాలనుకుంటున్నాను: ‘ఉత్తరం నుంచి వచ్చే వెలుగు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది’. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ఒక చిన్న ప్రాంతాన్ని వెలిగించే కాంతి వంటివారు. కానీ ఆ వెలుగులన్నీ ఒక్కటిగా కలిస్తే, ప్రపంచాన్నే ప్రకాశింపజేసేంత వెలుగు ఏర్పడుతుంది. ఉత్తరం నుంచి వచ్చిన మీ వెలుగులు భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాయని నేను ఆశిస్తున్నాను.విలియం ఎస్.క్లార్క్ మనకు ఆదర్శంచివరిగా, ఈ విశ్వవిద్యాలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి గురించి గుర్తు చేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. ఆయనే డాక్టర్ విలియం ఎస్.క్లార్క్. 150 ఏళ్ల క్రితం జీవించిన వ్యక్తి. అయినప్పటికీ, 2026లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఆయన జీవితం, ఆలోచనలు మనకు ఎంతో ప్రేరణ ఇవ్వగలవు. 1876లో మేజీ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు డాక్టర్ క్లార్క్ అమెరికా ఖండాన్ని దాటి, పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణించి జపాన్ కు వచ్చారు.ఆ సమయంలో మేజీ ప్రభుత్వం ఇంకా అనేక అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దూర ప్రాచ్యంలోని భౌగోళిక–రాజకీయ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎవరికీ స్పష్టంగా తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో సప్పోరో అగ్రికల్చరల్ కాలేజీకి పునాది వేయడంలో డాక్టర్ క్లార్క్ కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థే తరువాత హొక్కైడో యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. క్లార్క్ జపాన్ లో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించలేదు. ఆయన ఆధునిక వ్యవసాయ విద్యా పద్ధతులను కూడా ప్రవేశపెట్టారు.తాను జపాన్ విడిచిపోతున్నప్పుడు తన విద్యార్థులతో ఆయన చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి: ‘విద్యార్థుల్లారా, ఈ వృద్ధుడిలాగే మీరు కూడా గొప్ప ఆశయాలు కలిగి ఉండండి!’ ఈ చిన్న వాక్యం విద్యార్థుల హృదయాలను ఎంతగానో తాకింది. అది వారికి జీవితాంతం ప్రేరణగా నిలిచింది. ప్రపంచాన్ని, సమాజాన్ని మార్చాలనే తపన కూడా ఆయనలో ఉండేది. ‘గొప్ప లక్ష్యాలు కలిగి ఉండండి’ అని ఆయన తరచూ చెప్పడమే కాదు.. ఆ మాటలను తన జీవితంలో ఆచరించారు.ఇదీ చదవండి: సాహితీ వినువిహారంధైర్యంగా, ఆశయంతో, సాహసంతో జీవించారు. ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న జ్యోతి.. డాక్టర్ క్లార్క్. ఆయనతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయుల వారసత్వం వల్ల, ఇనాజో నిటోబే, కాన్జో ఉచిమురా, కింగో మియాబే వంటి వ్యక్తులు ప్రపంచ నాయకులుగా ఎదిగారు. వారు తమలో ఉన్న ఆ జ్యోతిని తరువాతి తరాలకు అందించారు. ఇప్పుడు ఆ జ్యోతి మీ చేతుల్లోకి వచ్చింది.మీరు కూడా ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిన తరం. మీరు కూడా క్లార్క్ వారసత్వంగా ఇచ్చిన ఆశయం, ధైర్యం, నేర్చుకోవాలనే తపనను ముందుకు తీసుకెళ్లాలి. గొప్ప ఆశయాలతో ముందుకు సాగండి. అనిశ్చితితో నిండిన ఈ యుగంలోకి ధైర్యంగా అడుగుపెట్టండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం, గొప్ప విజయాలు, సంతోషకరమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. డిగ్రీలు పొందుతున్న ప్రతి ఒక్కరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు!! -
భారత్.. విశ్వగురువు పాత్ర పోషిస్తుంది: మోదీ
భారత దేశం విశ్వగురువు పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫిజీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి ఫిజీ టెక్నికల్ యూనివర్సిటీలో పౌర సమాజ ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్ తన ప్రజాస్వామ్య, యువజనాభా శక్తిని ఉపయోగించుకుని మానవాళికి మేలు చేస్తుందన్నారు. రాబోయే తరం అంతా టెక్నాలజీదేనని, దాంతో సమానంగా పరుగులు పెడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అన్నారు. భారతదేశంలోని పాతకాలం నాటి రుషులు, మునులు కూడా అంతర్జాతీయ బాధ్యత గురించి చెప్పారన్నారు. రాబోయే జ్ఞానయుగంలో భారత్ విశ్వగురువు పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. ప్రపంచం మొత్తానికి మేలు చేసేందుకు భారతదేశం నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వివిధ దేశాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాలకు ముగింపు పలకాల్సి ఉందని తెలిపారు. ఫిజిలో ఉన్న మొత్తం 9 లక్షల జనాభాలో దాదాపు 37 శాతం వరకు భారత సంతతివాళ్లే. వీళ్లలో చాలామందిని బ్రిటిష్ పాలకులు 1879 నుంచి 1916 మధ్య చెరుకుతోటల్లో పని చేయించడానికి తీసుకొచ్చారు.


