breaking news
Visakhapatnam ODI
-
రద్దయిన విశాఖ వన్డే టిక్కెట్ల డబ్బు వాపస్
హైదరాబాద్: హుదూద్ తుపాను కారణంగా గత నెలలో విశాఖపట్నంలో రద్దయిన భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ టిక్కెట్ల డబ్బును వెనక్కి ఇవ్వనున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖ స్టేడియం వద్ద టిక్కెట్ల డబ్బును వాపస్ ఇస్తారు. గత నెల 14న విశాఖలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య మూడో వన్డే జరగాల్సివుంది. ఈ మ్యాచ్‌కు టిక్కెట్లను కూడా విక్రయించారు. అయితే హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖ అతలాకుతలమవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో బీసీసీఐ మూడే వన్డేను రద్దు చేసింది. ఈ మ్యాచ్‌ను మరో తేదీ లేదా వేదికకు మార్చాల్సిన అవసరం కూడా లేదని బోర్డు నిర్ణయించింది. -
ధోనీ దూకుడు.. విండీస్ బేజారు
విశాఖపట్టణం: వెస్టిండీస్‌తో ఆదివారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. విండీస్ ముందు 289 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కోహ్లీ 99, రోహిత్ శర్మ 12, ధావన్ 35, యువరాజ్ సింగ్ 28, రైనా 23, జడేజా 10, అశ్విన్ 19 పరుగులు చేసి అవుటయ్యారు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన ధోనీ తర్వాత విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్ 4 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్, పెర్మాల్, సమీ తలో వికెట్ దక్కించుకున్నారు. -
'విశాఖ వన్డేను రద్దు చేయాలి'
భారత్, వెస్టిండీస్‌ల మధ్య విశాఖపట్నంలో జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న విశాఖపట్నంలో భారత్, విండీస్ మ్యాచ్ జరగాల్సివుంది. కోట్లాది ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తీర్మానించినట్టు కన్వీనర్ ముప్పాల సుబ్బారావు చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కోట్లాదిమంది సమైక్యవాదులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఈ సమయంలో విశాఖలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం సరికాదని సుబ్బారావు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల జేఏసీ పోరాటం కొనసాగిస్తోంది. ఈ నెల 23 వరకు విధుల్ని బహష్కరించారు.