breaking news
visakhapatnam district SP
-
'మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉంది'
విశాఖపట్నం : పెదపాడు కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు మావోయిస్టుల ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖపట్నం జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ... గాయపడిన ఇద్దరూ మావోయిస్టులు కాదనడంలో వాస్తవం లేదన్నారు. అయితే నర్సింగ్పై రివార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మువ్వల అంబరి మిలీషియా సభ్యుడే అని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరికి పోలీసులు రక్తదానం అందించడం మానవతా ధృక్పథం అని రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. -
వారికి ముప్పేమి లేదనుకుంటున్నా
విశాఖపట్నం : మావోల చెర నుంచి ఇంకా టీడీపీ నేతలు విడుదల కాలేదని విశాఖపట్నం జిల్లా ఎస్పీ డా.కోయ ప్రవీణ్ వెల్లడించారు. మంగళవారం విశాఖపట్నంలో కోయ ప్రవీణ్ మాట్లాడుతూ... మావోయిస్టులతో బుధవారం గిరిజన ప్రజా సంఘాలు చర్చించనున్నాయని తెలిపారు. మావోలు వాళ్లంతట వాళ్లే టీడీపీ నేతలను పలిచారు... కాబట్టి సదరు నేతలకు ముప్పేమి ఉండదని తాను భావిస్తున్నట్లు కోయ ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం జిల్లాలో జీకేవీధిలోని మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేష్‌తోపాటు జన్మభూమి కమిటీ మండల అధ్యకుడు వందనం బాలయ్యను సోమవారం మావోయిస్టులు అపహరించారు. జీకే వీధి మండలంలోని కొత్తగూడ వద్ద వీరిని కిడ్నాప్ చేశారు.బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.