breaking news
visakha ustav
-
ముగిసిన విశాఖ ఉత్సవ్
-
ఘనంగా ముగిసిన విశాఖ ఉత్సవ్
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల పాటు విశాఖ హోరెత్తింది. విశాఖ ఉత్సవ సంబరం.. అంబరాన్ని తాకింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌దీప కాంతులతో.. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. వీనుల విందైన ఎస్ఎస్ థమన్ మ్యూజికల్ నైట్‌తో ఉత్సవ్ ముగింపు అదిరిపోయింది. రెండు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ఉత్సవ్ని లక్షలాది మంది ప్రజలు వీక్షించి ఆనంద పరవశులయ్యారు. డాక్టర్ వైఎస్సార్ సెంట్రల్ పార్కులో నిర్వహించిన ఫ్లవర్ షోని తిలకించేందుకు ఆదివారం దాదాపు లక్ష మంది వచ్చారు. తీరంలో ఎస్ఎస్ థమన్ మ్యూజికల్ నైట్ ఉర్రూతలూగించింది. సుమ యాంకరింగ్‌తో మెస్మరైజ్ చెయ్యగా.. త్రీ ఓరీ లైవ్ బ్యాండ్ మొదలవగానే ప్రేక్షకులు స్టెప్పులతో అదరగొట్టారు. సినీనటుడు వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్‌చంద్, అధికారులు పాల్గొన్నారు. -
'విశాఖ ఉత్సవ్‌ను వాయిదా వేయండి'
విశాఖపట్నంలో రేపటి నుంచి జరగనున్న విశాఖ ఉత్సవ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణతో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ కేసులున్నాయని ఏపీ డాక్టర్ల సంఘం సెక్రటరీ డాక్టర్ శ్యామ్‌సుందర్ చెప్పారు. విశాఖ ఉత్సవ్‌లో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొంటారు, దాంతో స్వైన్‌ఫ్లూ వ్యాధి సులువుగా వ్యాప్తి చేందే అవకాశం ఉందని ఏపీ డాక్టర్ల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని శ్యామ్‌సుందర్ వివరించారు.