breaking news
visakha land mafia
-
విశాఖలో భారీగా ప్రభుత్వ భూమి స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి శోత్యాం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిది. టీడీపీ హయాంలో కొందరు బడా బాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహరీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం) -
'అన్ని స్కాముల్లో సీఎం చంద్రబాబు హస్తం'
విశాఖపట్నం: భారతదేశంలో అవినీతి అనే పుస్తకం రాయాల్సి వస్తే.. అందులో 80 శాతం పేజీలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అక్రమాలనే రాయాల్సి ఉంటుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎంగా గత తొమ్మిదేళ్ల పాలనతో పాటు ప్రస్తుత మూడేళ్ల కాలంలో జరిగిన అన్ని స్కాముల్లో సీఎం చంద్రబాబు పాత్ర ఉందని అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భూ కబ్జాల్లో సీఎం, మంత్రుల హస్తం ఉందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడే విశాఖ కుంభకోణంపై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. భూ కబ్జాల అన్యాయంపై మహాధర్నా చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. సిట్ విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవాలని చేస్తోందని, విశాఖలో కబ్జాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ భూ కబ్జాలకు నిరసనగా ఈ నెల 22 నుంచి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ మహాధర్నా చేపట్టనుందన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహాధర్నాకు పిలుపునిచ్చారు. ప్రజల సొమ్మును మంత్రి గంటా శ్రీనివాసరావు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దసపల్లాహిల్స భూములపై పోరాటం చేస్తుంటే.. తమకు రూ.50 లక్షల పరువునష్టం దావా వేశారని తెలిపారు. భూ కబ్జాల్లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించిన అమర్నాథ్.. ఈ కబ్జాల్లో నష్టపోయిన కుటుంబాలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు.