virappamoyli
-
వైఎస్సార్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ల ఏర్పాటు
సాక్షి, నిజామాబాద్ అర్బన్: దివంగ త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిజామాబాద్ జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ లు ఏర్పాటు చేశామని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. సోమవా రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మోసపురితమైన పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అవినీతి, రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి తాహెర్‌బిన్‌హుందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్, నగర అధ్యక్షుడు కేశవేణు, తదితరులున్నారు. -
ఎన్నికల వేడి
రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌లు తమ తొలి జాబితాను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు పార్టీల్లో వరుసగా 20 మంది, 14 మందికి టికెట్లు దక్కాయి. వీరిలో చాలా మంది సిట్టింగ్ పార్లమెంటు సభ్యులే కావడం గమనార్హం. టికెట్లు దక్కిన వారిలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఆదివారం నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిగిలిన వారంతా సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నారు. అయితే ఈ రెండు పార్టీల్లో కూడా మొదటి జాబితాలో ప్రముఖులైన సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు దక్కలేదు. వీరిలో కాంగ్రెస్ నుంచి కేంద్రమంత్రి వీరప్పమొయిలీ (చిక్కబళాపుర), బీజేపీ నుంచి టీబీ చంద్రేగౌడ (బెంగళూరు ఉత్తర) టికెట్లు దక్కించుకోలేకపోయారు. దీంతో ఇరు పార్టీలకు అసమ్మతి సెగ తగులుతోంది. వీరప్పమొయిలీకు రెండో జాబితాలో టికెట్టు దక్కుతుందని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెబుతున్నా ఆయన అనుచరులు శాంతించడం లేదు. మంత్రి కృష్ణబైరేగౌడకు టికెట్టు కేటాయించాలనే ఉద్దేశంతోనే వీరప్పమొయిలీకు మొండి చెయ్యి చూపించారనేది రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, సదానందగౌడకు టికెట్టు కేటాయించడం ఖారారైన ప్పటి నుంచి చంద్రేగౌడ పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఇరు పార్టీలు అసమ్మతులను బుజ్జగించే పనిలో పడ్డారు. రాజకీయ పార్టీల పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల విధుల్లో ప్రధాన పాత్ర వహించే పోలీసు, అబ్కారీ, ఎన్నికల కమిషన్ రాష్ట్ర శాఖల పరిస్థితి మరోలా ఉంది. నల్లధనం బయటకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు వివిధ చెక్‌పోస్టుల్లో నిఘా పెంచారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా అసాంఘిక శక్తులపై నిఘా ఉంచారు. ఇక ఎన్నికల వేళ అక్రమ మద్యం విక్రయాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. సమాచారం కోసం బెంగళూరు కేంద్రంగా 24 గంటలూ పనిచేసే కాల్‌సెంటర్‌ను అబ్కారీ శాఖ ఏర్పాటు చేసింది. సమాచారం తెలిసినవారు 080-22103105కు ఫోన్‌చేయవచ్చు. ఓటరు కార్డు ఉండి ఓటరు జాబితాలో పేర్లులేనివారు తమ పేర్లను చేర్చుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర శాఖ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిని గుర్తేంచేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే పనిలో ఎన్నికల అధికారులు తలములకలై ఉన్నారు. నేడు రెండు రెండు పార్టీల జాబితా... ఇక రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ జేడీఎస్ కూడా నేడు (సోమవారం) తన తొలిజాబితాను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పార్టీ తరఫున హాసన్ నుంచి మాజీ ప్రధాని పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ, శివమొగ్గ నుంచి శాండిల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్ భార్య గీత శివరాజ్‌కుమార్ పోటీచేయనున్నారు. ఇక అమ్ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో రాష్ట్ర పార్లమెంటు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల పేర్లతో కూడిన తొలిజాబితా నేడు విడుదలచేయనున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ప్రతినిధి మహంతేష్ ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ ‘అంతర్గత’ం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం తొలిసారిగా అంతర్గత ఎన్నికలు నిర్వహించింది. ప్రకటించిన రెండు లోక్‌సభ స్థానాలకు గాను ఆదివారం మొదట మంగళూరులో నిర్వహించారు. ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. ప్రస్తుతం ఈ స్థానానికి పార్టీ సీనియర్ నాయకుడు జనార్దనపూజారి, కేంద్ర మంత్రి మొయిలీ కుమారుడు హర్షమొయిలీ పోటీ పడుతున్నారు. ఈనెల 13న బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గానికి అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తారు -
ఎత్తినహొళె పథకాన్ని రాజకీయం చేయడం తగదు
రాజ్‌నాథ్ సింగ్ నాకు సర్టిఫికెట్ ఇచ్చేంత యోగ్యుడు కాదు కేంద్రమంత్రి వీరప్పమొయిలీ దొడ్డబళ్లాపురం,న్యూస్‌లైన్: ఎత్తినహొళె పథకాన్ని రాజకీయం చేస్తుండడం తగదని, ఎవరెన్ని రాజకీయాలు చేసినా ఈ పథకం అమలుచేసితీరతాన ని కేంద్రమంత్రి,స్థానిక ఎంపీ వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పాత బస్టాండులో నూతనంగా నిర్మించిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన అంతకుముందు ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మంచి జరగగాలని, తాగునీరు అందించాలనే మంచి మనసు ఉన్నవారెవ్వరూ ఎత్తినహొళెను రాజకీయం చేయరన్నారు. జల నిపుణులు పరమశివయ్య నివేదిక అమలు చేయడానికి పాతిక సంవత్సరాలు పడుతుందని, ఆలోపు బయలుసీమలోని 5 జిల్లాలు ఎడారవుతాయన్నారు. ఈలోపు ఎత్తినహొళె పథకం అమలుచేస్తే 5 జిల్లాలలోని ప్రతీ చెరువు నిండుతుందన్నారు. కొందరు స్వార్థపరులు నేత్రావతి నది మళ్లింపు అంటూ పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. నిజానికి సముద్రంలో కలిసే నదినీటిని మాత్రమే ఈ పథకంలో మళ్లిస్తున్నామన్నారు. బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు సదానందగౌడ, జగదీష్‌శెట్టర్ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ పథకాన్ని అంగీకరించారని, బీజేపీ ప్రభుత్వం హయాంలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేయగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో రెండు వందల కోట్లు పెంచి రూ1200 కోట్లు విడుదల చేసారన్నారు. కర్ణాటక ర రాష్ట్రంలో ఉన్నంతమంది జలనిపుణులు వేరే ఏ రాష్ట్రంలోనూ లేరని, వారు పథకాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి అంగీకరిస్తారన్నారు. రాజ్‌నాథ్ సింగ్ సర్టిఫికెట్ ఇచ్చేంత యోగ్యుడు కాదు : ఇటీవల దొడ్డబళ్లాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడి భగత్‌సింగ్ క్రీడామైదానంలో జరిగిన భారత్ గెలిపించండి కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు మొయిలీని ఉద్దేశించి అపద్దాల కోరు..ఆయన చెప్పేవన్ని అపద్దాలే అని విమర్శలు గుప్పించడం పట్ల మొయిలీ తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ నాకు సర్టిఫికెట్ ఇచ్చేంత యోగ్యుడు కాదని అనుకుంటున్నానన్నారు. ఎంపీ అనంతకుమార్ మొయిలీని ఉద్దేశించి వలస పక్షిగా ఏద్దేవా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అనంతకుమారే వలస పక్షి అన్నారు. బాబు జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణకు రాష్ట్ర మంత్రి హెచ్ ఆంజనేయ మరో అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగ్జీవన్‌రాం లాంటి మహా వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణయ్య, దేవనహళ్లి ఎమ్మెల్యే పిళ్లముని శామప్ప, మాజీ ఎమ్మెల్యే ఆర్జీ వెంకటాచలయ్య, నగరసభ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
సాకారం కానున్న ఉభయ జిల్లావాసుల కల
నేడు చిక్కబళ్లాపురంలో ఎత్తినహొళె పథకానికి శంకుస్థాపన విచ్చేయనున్న సీఎం సిద్ధరామయ్య పథకం అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు 28 టీఎంసీల నీరు లభ్యం పరమశివయ్య నివేదికలో భాగమే ఎత్తినహొళె కోలారు/చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : నిత్యం కరువు కోరల్లో చిక్కుకునే కోలారు, చిక్కబళ్లాపురం జిల్లావాసుల స్వప్నం సాకారం కాబోతోంది. ఈ రెండు జిల్లాలకు శాశ్వత తాగు, సాగునీటిని అందించేందుకు రూపొందించిన ఎత్తినహొళె పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం చిక్కబళ్లాపురంలోని బీజీఎస్ వర్డ స్కూల్ మైదానంలో ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉభయ జిల్లాలతో పాటు బయలు సీమ జిల్లాలకు సాగునీటిని అందించాలని దశాబ్దాలుగా రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. నీటిపారుదల రంగం నిపుణుడు పరమశివయ్య నివేదికను అమలు చేసి పడమటి కనుమల నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే నేత్రావతి నీటిని బయలు సీమ జిల్లాలకు మళ్లించాలని ప్రజలు, రైతు సంఘాలు, సంఘ సంస్థలు ఉద్యమించాయి. పోరాటాల ఫలితంగా గత బీజేపీ ప్రభుత్వం పరమశివయ్య నివేదికలోని ఒక భాగమైన ఎత్తిన హొళె పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అప్పట్లో రూ. 8 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచి ఎత్తినహొళె పథకానికి కేబినెట్లో ఆమెదం తెలిపింది. టెండర్ ప్రక్రియ పూర్తవ్వడంతో నేడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఎంబీ.పాటిల్, కేంద్రమంత్రులు వీరప్పమొయిలీ, కేహెచ్.మునియప్ప, మాజీ ప్రధాని హెచ్డీ.దేవెగౌడ, జిల్లా ఇన్చార్జ్మంత్రి రోషన్‌బేగ్, రవాణాశాఖా మంత్రి రామలింగారెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి యుటీ.ఖాదర్, మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్‌శెట్టర్, డీవీ.సదానందగౌడ జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్ విశాల్ తదితరులు పాల్గొనున్నారు. ఎత్తినహొళె పథకానికి అనేకులు వ్యతిరేకం : ఇదిలా ఉండగా ఎత్తినహొళె పథకాన్ని ప్రభుత్వం కంటి తుడుపు చర్యగానే చేపడుతోందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. చిక్కబళ్లాపురం జిల్లాల్లో ఎత్తినహొళె ప్రారంభాన్ని బ్లాక్‌డేగా పరిగణించి శాశ్విత నీటిపారుదల పోరాట సమితి ఆందోళనలు చేస్తోంది. పరమశివయ్య నివేదిక అమలు ద్వారా తమ ప్రాంతానికి నీటి సమస్య ఎదురువుతుందని, ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ కన్నడ జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చారు. పరమశివయ్య నివేదికలో భాగమే.. : మధ్య కర్ణాటకలోని బయలుసీమ జిల్లాల్లో భవిష్యత్తులో భయంకర క్షామం ఏర్పడుతుందని యోచించిన నీటిపారుదల రంగం నిపుణుడు డాక్టర్ పరమశివయ్య 30 ఏళ్ల క్రితమే పడమటి కనుమల నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే 2500 టీఎంసీల నీటిలో 120 టీఎంసీల నేత్రావతి నీటిని బయలుసీమలోని 9 జిల్లాలకు మళ్లించాలని ప్రభుత్వానికి నివేదికను అందించారు. కానీ పాలకులు ఆ నివేదికను మూలన పడేశారు. -
టీడీపీతో అంటకాగుతున్న గల్లా కుటుంబం
-
గల్లా సాక్షిగా బాబు విమర్శలు
సాక్షి, తిరుపతి: రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. బంగారుపాళెం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్పీ.చెంగల్రాయనాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. మంత్రి గల్లా కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమానికి మంత్రి స్వయంగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసిన ప్రాంగణంలోని వేదికపై చంద్రబాబు, అరుణకుమారి పక్కపక్కనే కూర్చున్నారు. దశబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న ఈ నేతలు ఒకే వేదికపై పక్కపక్కన కూర్చోవడం చర్చకు దారితీసింది. ఈ వేదికపై నుంచే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్పమొయిలీలను ప్రతిపక్షనేత తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు విమర్శలు చేస్తున్న సమయంలో అరుణకుమారి కొంత ఇబ్బందిపడినట్టు కనిపించారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని కాంగ్రెస్ నేతలు కీలకంగా వ్యవహరించారని బాబు తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో చిదంబరం భారీ మెజారిటీతో ఓడిపోవడం ఖాయమన్నారు. అంతకుముందు గల్లా అరుణకుమారి తన ప్రసంగంలో ఎన్పీ. చెంగల్రాయనాయుడు సేవలను కీర్తించారు. కాగా చంద్రబాబు బంగారుపాళెం చేరుకోవడానికి గంట ముందుగానే అరుణకుమారి అక్కడికి చేరుకున్నారు. అయితే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాబు చేరుకోవడానికి ఐదు నిమిషాల ముందు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే రవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఉదయం పది గంటల సమయంలో బంగారుపాళెం చేరుకుని చెంగల్రాయనాయుడు విగ్ర హానికి నివాళులు అర్పించి వెళ్లారు. -
రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులు
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి పట్టణాల అభివృద్ధి పథకం కింద రెండవ విడతలో నగరసభల పరిధిలో రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం తెలిపారు. పట్టణాల అభివృద్ధి పథకం కింద 2 వ విడతలో రూ.15 కోట్లతో పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం ఆయన కేంద్ర మంత్రి వీరప్పమొయిలీతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, మరో 19 జిల్లాల్లో టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నా రు. చేపట్టిన పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. నగర సభల అధ్యక్ష, ఉపాధ్యక్షుల రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు ఈనెల 30 లోపు ప్రమాణపత్రం అందజేస్తామన్నారు. వీరప్ప మొయిలీ మాట్లాడుతూ నగరసభల పరిధిలోని వార్డులలో నీటి శుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటుకు చమురు కంపెనీల నుంచి రూ.2.5కోట్లు, నగర సభ పరిపాలన కట్టడాల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఘాటి పుణ్యక్షేత్రం సమీపంలోని విశ్వేశ్వరయ్య పికప్ డ్యాం పునరుద్ధరణకు ని ధులు విడుదల చేస్తామన్నారు. నవంబర్ 23న చిక్కబళ్లాపురంలో కెనరా బ్యాంక్ సహకారంతో రుణ మేళా, నిరుద్యోగ యువతీ యువకులకు విద్యాభ్యాసానికి రుణాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పట్టణంలో యూజీడీ పనుల కారణంగా అధ్వాన్నంగా మారిన రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని స్థానిక ఎమ్మె ల్యే వెంకట రమణయ్య వీరప్ప మొయిలీని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.